E-Paper
Advertisement

Chicken Rates: అమెరికా, జపాన్‌లలో కిలో చికెన్ ధర ఎంతో తెలుసా? ఏ దేశంలో తక్కువంటే?

Chicken Rates: అమెరికా, జపాన్‌లలో కిలో చికెన్ ధర ఎంతో తెలుసా? ఏ దేశంలో తక్కువంటే?
Advertisement

Chicken Rates in World: చికెన్ లేనిదే ముద్ద దిగదా? అయితే, మీరు ఆ దేశానికి వెళ్తే పస్తులుండాలి ఏమో. ఎందుకంటే.. అక్కడ ఇండియా కంటే రెట్టింపు ధరలో చికెన్ దొరుకుతుంది. చెప్పాలంటే మన దేశంలోనే చికెన్ చీప్‌గా దొరుకుతుంది. అయితే, మన పొరుగు దేశాలైన చైనా, పాకిస్థాన్‌లో చికెన్ రేట్లు చాలా భిన్నంగా ఉన్నాయి. మరి, కిలో చికెన్ ఏయే దేశాల్లో ఎంత ధర పలుకుతుందో చూద్దామా?

చైనా, పాకిస్థాన్‌లో ఎంతంటే?

చికెన్‌ను చాలా రకాలుగా అమ్ముతారు. స్కిన్‌తో ఉన్న చికెన్ ఒక రేటు.. స్కిన్ లేని చికెన్ ఒక రేటు ఉంటుంది. ఇక బోన్‌లెస్ చికెన్ అయితే.. చాలా కాస్ట్ ఉంటుంది. సాధారణ లైవ్ చికెన్ ధరలను తీసుకుంటే ప్రపంచవ్యాప్తంగా వేర్వేరు ధరలు ఉన్నాయి. ఇండియాతో పోల్చితే పొరుగు దేశమైన చైనాలో చికెన్ చాలా చవక. అక్కడ కిలో చికెన్.. రూ.180 మాత్రమే. బోన్‌లెస్ చికెన్ అయితే సుమారు రూ.420 వరకు ఉంటుందట. అయితే, మన పక్కనే పాకిస్థాన్‌లో మాత్రం చికెన్ కొనాలంటే కాస్త కష్టమే. అక్కడ కిలో చికెన్ సుమారు రూ.430 పలుకుతోందట. అదే బోన్‌లెస్ అయితే సుమారు రూ.1200 వరకు చెల్లించాలట. దీన్ని బట్టి చూస్తే ఇండియాలోనే బెటర్ అనిపిస్తోంది కదూ.

యూఎస్ఏ, రష్యా, యూకేలో ఎంత?

Advertisement

యూఎస్ఏ, యూకేలు ఖరీదైన దేశాలు అక్కడ నివాసించడానికే కాదు.. తిండికి ఖర్చు పెట్టాలన్నా కష్టమే. మరి, ఇండియాతో పోల్చితే అక్కడి కిలో చికెన్ ధరలు పర్వాలేదు అనిపించేలాగే ఉన్నాయి. అమెరికాలో కిలో చికెన్ రూ.310 నుంచి రూ.530 వరకు ఉందట (అంటే ప్రాంతాన్ని బట్టి ఒక్కో రేటు అక్కడ). యూకేలో కూడా అంతే.. అక్కడ దేశాన్ని బట్టి రేటు ఒక్కోలా ఉంది. కిలో చికెన్ ధర రూ.380 నుంచి రూ.600 వరకు ఉందట. రష్యాలో కిలో చికిన్ రూ.250 నుంచి రూ.350 వరకు ఉందట. ఆస్ట్రేలియాలో రూ.255 నుంచి రూ.400 వరకు ఉన్నట్లు సమాచారం.

అత్యంత ఖరీదు ఈ దేశాల్లోనే..

సాధారణంగా మనం అమెరికా లేదా యూకేలోనే చికెన్ రేట్లు ఎక్కువ ఉండవచ్చని భావిస్తాం. కానీ, ఆ ప్లేస్ కొట్టేసింది కొరియా, జపాన్. జపాన్‌లో కిలో చికెన్ రూ.450 నుంచి రూ.680 వరకు ఉంది. ఇక దక్షిణ కొరియాలో అయితే రూ.740 నుంచి రూ.1100 వరకు ధర పలుకుతోందట. థాయ్‌లాండ్‌‌లో అయితే కిలో చికెన్ రూ.230 నుంచి 330 వరకు ఉందట. ఇంతకీ ఇండియాలో కిలో చికెన్ ధర ఎంతో తెలుసా? రూ.200 నుంచి రూ.250. అయితే, ఈ ధరలు ప్రాంతం, రాష్ట్రాన్ని బట్టి మారుతాయి.

Advertisement

Also Read: హైదరాబాదీలకు ఇష్టమైన ఫుడ్స్ ఇవే.. టాప్‌లో బిర్యానీ, తర్వాతి ప్లేసులో ఆ ఫుడ్!

(గమనిక: ప్రాంతాలు, దేశాలను బట్టి చికెన్ ధరల్లో వ్యత్యాసం ఉండవచ్చు. కాబట్టి ఇక్కడ పేర్కొన్న ధరలను అధికారికంగా ధృవీకరించడంలేదు. ఆయా దేశాల్లో డిమాండ్, సప్లై, స్టాక్‌ను బట్టి ఈ ధరల్లో హెచ్చు తగ్గులు ఉండవచ్చని గమనించగలరు. ఈ వివరాలు కేవలం సాధారణ అవగాహన కోసమే.)

Related News

రక్తపోటు పెరగడానికి మౌత్ వాష్ కూడా ఒక కారణమేనా.. తాజా రీసెర్చ్ ఏం చెబుతోంది?

గ్రీన్ టీ తాగుతున్నా బరువు తగ్గట్లేదా? అయితే మీరు ఈ 5 తప్పులు చేస్తున్నట్టే!

గుండెపోటు వెనక అసలు విలన్ ప్లాస్టిక్కేనా? మెడికల్ హిస్టరీలోనే షాకింగ్ నిజాలు!

మ్యూజిక్ లవర్స్‌కి పండగే..తక్కువ ధరలో ఎక్కువ బేస్ ఇచ్చే క్రేజీ బడ్స్!

మీ బంధువులు, స్నేహితులను ఈ 4 ప్రశ్నలు ఎప్పుడూ అడగకూడదు.. రిలేషన్ దెబ్బతింటుంది

ఛార్జింగ్ అవసరం లేని.. ఈ మ్యాజికల్ వేరబుల్ డివైస్ విశేషాలివే!

ఐలైనర్ సరిగ్గా రావడం లేదా? పర్ఫెక్ట్ లుక్ కోసం ఈజీ మేకప్ ట్రిక్స్‌ ఇవిగో

ఇంటి ఖర్చులకు నెలజీతం సరిపోవడం లేదా? అదనపు ఆదాయం ఇలా సంపాదించండి

Big Stories

Advertisement
×