Smart TV: ప్రస్తుతం చాలామంది థియేటర్‌కు వెళ్లి సినిమాలు చూడటం తగ్గించేశారు. ఇంట్లోనే పెద్ద స్క్రీన్ మీద సినిమాలు చూస్తూ థియేటర్ ఫీల్‌ను పొందుతున్నారు. ఇకపోతే వినోదం అనగానే.. ముందుగా గుర్తుకొచ్చే గ్యాడ్జెట్ స్మార్ట్ టీవీ. ఒకప్పుడు టీవీ అంటే.. కేవలం ఛానెళ్లు చూడటానికే పరిమితమై ఉండేది. కానీ ఇప్పుడు అలా కాదు. మారుతున్న కాలానికి తగ్గట్టే.. పరిస్థితులు కూడా పూర్తిగా మారిపోయాయి. ఇంటర్నెట్‌తో కనెక్ట్ అయ్యే స్మార్ట్ టీవీల ద్వారా సినిమాలు, వెబ్ సిరీస్‌లు, యూట్యూబ్ వీడియోలు, ఓటీటీ కంటెంట్ అన్నీ ఒకే స్క్రీన్‌పై ఆస్వాదించవచ్చు. అందుకే ఇప్పుడు స్మార్ట్ టీవీ లేకుండా ఇంటి వినోదాన్ని ఊహించుకోవడం కష్టమే.
ప్రస్తుతం స్మార్ట్ టీవీలకు ఉన్న డిమాండ్‌ను గమనించిన ప్రముఖ ఎలక్ట్రానిక్స్ బ్రాండ్లు, ఆధునిక ఫీచర్లతో కూడిన స్మార్ట్ టీవీలను తక్కువ ధరల్లోనే మార్కెట్లోకి తీసుకొస్తున్నాయి. ముఖ్యంగా ఈ మధ్య ఈ-కామర్స్ వెబ్‌సైట్లలో ఆఫర్లు భారీగా ఉన్నాయి. రూ.5,000లోపే HD స్మార్ట్ టీవీ కొనుగోలు చేసే అవకాశం కూడా అందుబాటులోకి వచ్చింది. మీరు కూడా కొత్త టీవీ కొనాలని అనుకుంటుంటే.. ఇప్పుడే సరైన సమయం అని చెప్పవచ్చు.
ఈ టీవీ ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌లో రూ.4,999 ధరకే అందుబాటులో ఉంది. 24 అంగుళాల స్క్రీన్ సైజ్‌తో వచ్చే ఈ టీవీ 1366 x 768 పిక్సెల్ రిజల్యూషన్, 60Hz రిఫ్రెష్ రేట్‌ను అందిస్తుంది. 20W స్పీకర్లతో ఆడియో కూడా బాగానే ఉంటుంది. ప్రైమ్ వీడియో, యూట్యూబ్ వంటి ప్రముఖ యాప్‌లు ముందే ఇన్‌స్టాల్ అయి రావడం వల్ల అదనపు సెటప్ అవసరం ఉండదు. చిన్న గదులు, ఆఫీసులు లేదా వ్యక్తిగత వినియోగానికి ఈ టీవీ చాలా అనుకూలంగా ఉంటుంది. నెలవారీ వాయిదాలుగా రూ.159 చెల్లించి కూడా దీనిని కొనుగోలు చేయవచ్చు.
Also Read: సరికొత్త సౌండ్‌బార్లను దింపిన జస్ట్ కోర్సెకా.. ఇక 200వాట్ల ఆడియో డివైజ్‌తో ఇంట్లో దబిడదిబిడే!
కాస్త పెద్ద స్క్రీన్ కావాలనుకునే వారికి.. కోడాక్ QLED SE 32 అంగుళాల QLED HD రెడీ స్మార్ట్ టీవీ మంచి ఎంపిక. 2025 ఎడిషన్‌గా వచ్చిన ఈ టీవీ 1366 x 768 రిజల్యూషన్‌తో పాటు 60Hz రిఫ్రెష్ రేట్, 400 నిట్స్ బ్రైట్‌నెస్‌ను అందిస్తుంది. డ్యూయల్ బ్యాండ్ Wi-Fi, రెండు HDMI పోర్ట్‌లు, రెండు USB పోర్ట్‌లు, బ్లూటూత్ 5.0 వంటి అనేక కనెక్టివిటీ ఆప్షన్లు ఇందులో ఉన్నాయి. ఈ స్మార్ట్ టీవీలో 512MB RAM, 4GB స్టోరేజ్ ఉండగా, యూట్యూబ్, ప్రైమ్ వీడియో, జియో హాట్‌స్టార్, సోనీ లివ్, జీ5 వంటి యాప్‌లు సపోర్ట్ చేస్తాయి. దీని ధర రూ.8,499 కాగా.. నెలవారీ EMIగా రూ.412 చెల్లించే అవకాశం ఉంది.
బ్రాండెడ్ గూగుల్ టీవీ అనుభవం కావాలనుకుంటే.. ఏసర్ 32 అంగుళాల అల్ట్రా I సిరీస్ HD స్మార్ట్ LED టీవీని పరిశీలించవచ్చు. 60Hz రిఫ్రెష్ రేట్‌తో వచ్చే ఈ టీవీ HDMI, USB, Wi-Fi వంటి అవసరమైన కనెక్టివిటీ ఆప్షన్లను కలిగి ఉంది. నెట్‌ఫ్లిక్స్, యూట్యూబ్, అమెజాన్ ప్రైమ్ వీడియో, డిస్నీ+ వంటి ప్రముఖ ఓటీటీ యాప్‌లకు పూర్తి మద్దతు ఇస్తుంది. ఈ టీవీ ధర రూ.9,999 కాగా.. అమెజాన్‌లో EMIగా నెలకు రూ.485 చెల్లించి కొనుగోలు చేయవచ్చు.
ప్రీమియం బ్రాండ్‌ను ఇష్టపడే వారికి Samsung 32 అంగుళాల HD రెడీ LED స్మార్ట్ టీవీ మరో ఆప్షన్. 1366 x 768 పిక్సెల్ రిజల్యూషన్‌తో వచ్చే ఈ టీవీ HDR10+ సపోర్ట్‌ను కలిగి ఉంది. రిఫ్రెష్ రేట్ 50Hz అయినప్పటికీ.. పిక్చర్ క్వాలిటీ, బ్రాండ్ నమ్మకం పరంగా ఇది ప్రత్యేకంగా నిలుస్తుంది. నెట్‌ఫ్లిక్స్, ప్రైమ్ వీడియో, యూట్యూబ్, జియో హాట్‌స్టార్, యాపిల్ టీవీ+, సోనీ లివ్ వంటి యాప్‌లు ముందే ఇన్‌స్టాల్ అయి ఉంటాయి. అయితే.. ధర మాత్రం కొంచెం ఎక్కువగా రూ.13,990గా ఉంది. ఫ్లిప్‌కార్ట్‌లో EMI సౌకర్యం కూడా అందుబాటులో ఉంది.
మొత్తంగా చూస్తే, ఇప్పుడు మార్కెట్లో ప్రతి బడ్జెట్‌కు సరిపోయే స్మార్ట్ టీవీలు అందుబాటులో ఉన్నాయి. మీ అవసరం, స్క్రీన్ సైజ్, బ్రాండ్ ప్రాధాన్యతను బట్టి సరైన టీవీని ఎంపిక చేసుకుంటే.. తక్కువ ఖర్చుతోనే ఇంట్లో థియేటర్ అనుభూతిని పొందవచ్చు.
Also Read: 55 అంగుళాల TCL QLEDపై మెగా ఆఫర్.. రూ.1.09 లక్షల టీవీ రూ.36,990కే వచ్చేస్తోంది!