E-Paper
Advertisement

Smart TVs Under Rs 15000: జస్ట్.. రూ. 15 వేలకే అదిరిపోయే స్మార్ట్ టీవీలు!

Smart TVs Under Rs 15000: జస్ట్.. రూ. 15 వేలకే అదిరిపోయే స్మార్ట్ టీవీలు!
Advertisement

ఒకప్పుడు స్మార్ట్ టీవీలు కొనుగోలు చేయాలంటే వేలకు వేలు ఖర్చు చేయాల్సివచ్చేది. కానీ, ఇప్పుడు తక్కువ ధరలోనే 32 ఇంచులతో పాటు 40 ఇంచుల స్మార్ట్ టీవీలు లభిస్తున్నాయి. ధర తక్కువ అయిన ఫీచర్ల పరంగా ఏమాత్రం లోటు ఉండటం లేదు. మంచి పిక్చర్ క్వాలిటీ, గూగుల్ TV, అండ్రాయిడ్, వెబ్‌ఓఎస్ స్మార్ట్ ఫీచర్లు, డాల్బీ ఆడియో, HDR, మంచి కనెక్టివిటీ ఉన్న మోడల్స్ లభిస్తున్నాయి. ప్రధానంగా 32, 43 ఇంచ్ సైజులు, HD లేదా Full HD రిజల్యూషన్‌ తో వస్తున్నాయి. రీసెంట్ రివ్యూలు, ధరలు, ఫీచర్ల ఆధారంగా రూ. 15 వేల లోపు టాప్ 8 మోడల్స్‌ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ప్రస్తుతం ఈ స్మార్ట్ టీవీలు అన్నా అమెజాన్, ఫ్లిప్‌ కార్ట్ తో పాటు ఆఫ్ లైన్ స్టోర్లలోనూ అందుబాటులో ఉన్నాయి. ఇంతకీ అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

⦿ Xiaomi A Series L32M8-5AIN 

ఈ స్మార్ట్ టీవీ 32 ఇంచుల స్క్రీన్ ను కలిగి ఉంటుంది. HD Ready రిజల్యూషన్ తో వస్తోంది. ఫీచర్ల విషయానికి వస్తే.. అండ్రాయిడ్ TV, ప్యాచ్‌ వాల్, డాల్బీ ఆడియో, HDR10, 1.5GB RAMను కలిగి ఉంది. ధర రూ. 10,999గా ఉంటుంది. బడ్జెట్-ఫ్రెండ్లీ, మంచి స్పీడ్, నెట్‌ ఫ్లిక్స్, ప్రైమ్ సపోర్ట్ తో వస్తుంది. యూజర్ రేటింగ్: 4.2/5గా ఉంది.

⦿ Samsung Series 4 UA32N4305

Advertisement

ఈ స్మార్ట్ టీవీ కూడా 32 ఇంచ్ సైజ్ తో పాటు  HD Ready రిజల్యూషన్ ను కలిగి ఉంది. ఫీచర్ల విషయానికి వస్తే Tizen OS, వాయిస్ అసిస్టెంట్, PurColor, 20W స్పీకర్లును కలిగి ఉంది. ధర రూ. 14,499గా నిర్ణయించారు. ప్రీమియం కలర్ అక్యురసీ, స్మూత్ ఇంటర్‌ ఫేస్తో యూజర్ రేటింగ్: 4.3/5ను కలిగి ఉంది.

⦿ LG LR570 (2025)

ఈ స్మార్ట్ టీవీ కూడా 32 ఇంచ్ సైజ్ తో HD Ready రిజల్యూషన్ ను కలిగి ఉంటుంది. webOS, Alpha5 AI ప్రాసెసర్, ThinQ AI, HDR10 ఫీచర్లను కలిగి ఉంది. దీని ధర రూ. 13,990. AI-ఆప్టిమైజ్డ్ పిక్చర్, వాయిస్ కంట్రోల్ లాంటి బెస్ట్ క్వాలిటీస్ ఉన్నాయి. రేటింగ్: 4.4/5గా ఉంది.

⦿ Acer V Series AR32GR2841VQD

Advertisement

ఈ స్మార్ట్ టీవీ 32 ఇంచ్ సైజ్ తో పాటు HD Ready రిజల్యూషన్ ను కలిగి ఉంటుంది. Google TV, QLED, Dolby Vision, 30W ఆడియో లాంటి ఫీచర్లను కలిగి ఉంది. ధర రూ. 11,999గా ఉంది. QLED కలర్స్ బెటర్ వైబ్రెంట్, గూగుల్ అసిస్టెంట్ తో వస్తుంది. రేటింగ్: 4.1/5గా ఉంది.

⦿ Kodak 9XPRO 40-inch

ఈ స్మార్ట్ టీవీ 40 ఇంచ్ సైజుతో Full HD రిజల్యూషన్ తో వస్తుంది. Linux OS, 30W సౌండ్, Bezel-less, HDRను కలిగి ఉంటుంది. ధర. రూ.13,499. పెద్ద స్క్రీన్ బడ్జెట్‌ ధరలో లభిస్తుంది. 4.0/5గా ఉంది.

⦿ Toshiba V35MP

ఈ స్మార్ట్ టీవీ 32 ఇంచ్ సైజ్,  HD Ready రిజల్యూషన్ ను కలిగి ఉంటుంది. Android TV, Dolby Audio, Chromecast Built-in ఫీచర్లతో వస్తుంది. ధర రూ. 12,999. ఈజీ అప్‌స్ట్రీమింగ్, మంచి బిల్డ్ క్వాలిటీతో వస్తుంది.  రేటింగ్ 4.2/5గా ఉంది.

⦿ Onida 32-inch HD Ready

ఈ స్మార్ట్ టీవీ 32 ఇంచ్ సైజ్,  HD Ready రిజల్యూషన్ ను కలిగి ఉంటుంది. Google TV, Google Assistant, Cast Supportతో వస్తుంది. రూ. 12,199కి అందుబాటులో ఉంది. సింపుల్ యూజర్ ఫ్రెండ్లీ, బెటర్ యాప్ సపోర్ట్ తో అందుబాటులో ఉంది. దీని రేటింగ్: 4.1/5గా ఉంది.

⦿ Blaupunkt 40-inch QLED

ఈ స్మార్ట్ టీవీ 40 ఇంచ్ సైజ్, Full HD రిజల్యూషన్, Android TV, Quantum Dot, Dolby Vision లాంటి ఫీచర్లను కలిగి ఉంది ధర 13,799గా ఉంది. QLED టెక్నాలజీతో బ్రైట్ కలర్స్, గేమింగ్‌కు సపోర్టింగ్ గా ఉంది.  రేటింగ్: 4.0/5గా ఉంది.

Read Also: నోకియా 43 ఇంచెస్ స్మార్ట్ టీవీ.. సౌండ్ ఉంటుది భయ్యా నెక్ట్స్ లెవల్!

Related News

ఐకూ నుంచి క్రేజీ కాంపాక్ట్ టాబ్లెట్.. నెక్ట్స్ జనరేషన్ చిప్‌సెట్‌తో ఎంట్రీ!

ఐఫోన్ యూజర్లకు మెటా బిగ్ ఆఫర్.. ఐక్లౌడ్ లేకున్నా వాట్సప్ చాట్ బ్యాకప్ ఇక ఈజీ!

ఆకాశం నీలం, సూర్యాస్తమయం ఎరుపు.. అంతరిక్షం నలుపు.. అసలేంటీ రంగుల మిస్టరీ?

జస్ట్.. రూ.3,000 లోపే 45 రోజుల బ్యాటరీ బ్యాకప్.. ఐఫోన్ కంటే పవర్‌ఫుల్ టార్చ్‌తో Nokia 4G ఫోన్!

8,100mAh బ్యాటరీ, AI బటన్‌తో హానర్ నుంచి క్రేజీ ఫోన్.. ధరెంతో తెలిస్తే Buy Now నొక్కేస్తారు!

జియో, విఐ బెటర్ అంటున్న యూజర్లు.. ఎయిర్‌టెల్ 5G హాట్‌స్పాట్ బ్యాన్‌పై సోషల్ మీడియాలో ఆగ్రహం!

స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ ప్రాసెసర్, భారీ బ్యాటరీ.. గేమర్స్ కోసం నెక్ట్స్ లెవెల్ టాబ్లెట్ వచ్చేసింది!

కెమెరా పక్కనే మరో డిస్‌ప్లే.. ఇన్ఫినిక్స్ కొత్త బడ్జెట్ ఫోన్ లుక్ చూశారా?

Big Stories

Advertisement
×