E-Paper
Advertisement

IndiGo flight: ఇండిగో విమానాన్ని ఢీకొట్టిన పక్షి, వెంటనే ల్యాండింగ్ చేసిన పైలెట్

IndiGo flight: ఇండిగో విమానాన్ని ఢీకొట్టిన పక్షి, వెంటనే ల్యాండింగ్ చేసిన పైలెట్
Advertisement

IndiGo flight: డెహ్రాడూన్‌ నుంచి ముంబైకి వెళ్తున్న ఇండిగో విమానాన్ని సడన్‌గా ఓ పక్షి ఢీకొట్టింది. పరిస్థితి గమనించిన పైలట్ వెంటనే విమానాన్ని ల్యాండింగ్ చేశాడు. ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రత్యామ్నాయంగా మరో విమాన సర్వీస్‌ను ఏర్పాటు చేసింది. ఈ విషయాన్ని అధికారికంగా వెల్లడించింది ఇండిగో సంస్థ.

ఇండిగో విమానాన్ని ఢీకొట్టిన పక్షి

Advertisement

ఉత్తరాఖండ్‌ డెహ్రాడూన్‌లోని రిషికేశ్ సమీపంలోని జాలీ గ్రాంట్ విమానాశ్రయం రన్‌వేపై ముంబైకి 186 మంది ప్రయాణికులతో ఇండిగో విమానం బయలుదేరింది. టేకాఫ్ అయిన కొద్దిసేపటికే ఓ పక్షి ఆ విమానాన్ని బలంగా ఢీ కొట్టింది. దీంతో స్వల్పంగా దెబ్బతిన్నట్లు ఇండిగో సంస్థ అధికారులు తెలిపారు. ఈ ఘటన ఆదివారం సాయంత్రం 6.45 గంటల ప్రాంతంలో ఈ సంఘటన జరిగింది.

పక్షి ఢీకొన్న తర్వాత పైలట్.. ఎయిర్‌పోర్టు అధికారులతో మాట్లాడాడు. ఆ తర్వాత ఆ విమానాన్ని సేఫ్‌గా  ల్యాండింగ్ చేశాడు. దీంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. ఆ తర్వాత విమానం నిలిపి వేశారు. ప్రత్యామ్నాయంగా మరో విమానాన్ని ఏర్పాటు చేశారు. అందులో ప్రయాణికులను తరలించారు.

Advertisement

విమానాన్ని ల్యాండింగ్ చేసిన పైలెట్

కొంత సేపు అంతరాయం ఏర్పడడంతో ప్రయాణీకులందరికీ ఇబ్బంది లేకుండా  రిఫ్రెష్‌మెంట్ బాక్స్‌లు, విందు అందించినట్టు ఇండిగో ప్రతినిధి తెలిపాడు.  నార్మల్‌గా విమానాలు తక్కువ ఎత్తులో వెళ్తున్నప్పుడు ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయి. టేకాఫ్ లేదా ల్యాండింగ్ సమయంలో ఇలాంటివి బయటపడుతున్నాయి.

ఇలాంటి ఘటనలలో ఎక్కువ భాగం విమానాలకు ఎలాంటి ముప్పు కలిగించవు. కాకపోతే సున్నితమైన విమాన భాగాలను దెబ్బతీస్తాయని అంటున్నారు నిపుణులు. కాబట్టి వాటిని జాగ్రత్తగా పరిగణిస్తారని చెబుతున్నారు. ముక్కు కోన్, విండ్‌ షీల్డ్, రెక్కలు, ల్యాండింగ్ లైట్లు వంటి భాగాలు సాధారణంగా ప్రభావితమవుతాయని అంటున్నారు.

ALSO READ: మన హిమాలయాలకు అరుదైన గుర్తింపు.. టాప్ ట్రెండింగ్ డెస్టినేషన్స్‌లో ఫస్ట్ ప్లేస్

ఆధునిక జెట్ ఇంజన్లు చిన్న పక్షుల ఢీ కొన్నా, వాటిని తట్టుకునేలా రూపొందించబడుతున్నట్లు చెబుతున్నారు. పక్షి ఢీ కొన్నప్పుడు పైలట్లు వెంటనే ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్‌కు సమాచారం ఇస్తారు. ఒకవేళ విమానం గాలిలో ఉంటే ల్యాండింగ్‌ చేస్తారు. ఇంజనీర్లు తనిఖీ నిర్వహిస్తారు, అన్ని భద్రతా తనిఖీలు పూర్తయిన తర్వాత మాత్రమే మళ్లీ వాటిని సేవలకు ఉపయోగిస్తారు

Related News

డ్రోన్ తో వందే భారత్ వీడియోలు తీస్తున్నారా? ఇక కటకటాల్లోకి వెళ్లక తప్పదు!

కోడైకనాల్ టూర్‌కు వెళ్లేవారికి అలర్ట్.. ఇక ఆన్‌లైన్ లో టికెట్ తీసుకోవాల్సిందే!

పులులను దగ్గరగా చూడాలనుందా? అయితే, ఐఆర్‌సిటిసి ‘వన్ దర్శన్’ యాత్రకు రెడీ అవ్వండి!

హైదరాబాద్‌కి ఇంత దగ్గర్లో ఇలాంటి అందమైన జలపాతం ఉందా? వీకెండ్ ట్రిప్‌కు పర్ఫెక్ట్ ప్లేస్!

రైలు టికెట్లు బుక్ చేస్తున్నారా? సీట్లు ఉన్నాయో? లేవో? సింపుల్ గా ఇలా చెక్ చేయండి!

అయ్యప్ప భక్తులకు రైల్వే గుడ్ న్యూస్.. 148 స్పెషల్ ట్రైన్లు!

పండుగ సీజన్‌.. ఫ్యామిలీ నుంచి సోలో ట్రిప్ వరకు.. బెస్ట్ 5 టూరిస్ట్ డెస్టినేషన్లు!

దసరా వేళ మాత్రమే తెరుచుకునే అద్భుత ఆలయం.. ఏడాదిలో 11 రోజులే దర్శనం.. మిస్టరీ తెలిస్తే షాకే!

Big Stories

Advertisement
×