E-Paper
Advertisement

రూ.10,000 లోపు బ్రాండెడ్ ఫోన్ కొనాలనుకుంటున్నారా? ఈ ఐదు మోడల్స్ ఫీచర్లు తెలిస్తే వావ్ అంటారు!

రూ.10,000 లోపు బ్రాండెడ్ ఫోన్ కొనాలనుకుంటున్నారా? ఈ ఐదు మోడల్స్ ఫీచర్లు తెలిస్తే వావ్ అంటారు!
Advertisement

Best Phones Under 10000: నేటి జనరేషన్ వాళ్లు ఎలా తయారయ్యారంటే.. చేతిలో ఫోన్ లేనిదే ముద్ద దిగదు, పొద్దు గడవదు. పైగా అందరికీ ఐఫోన్లే కావాలంటే కుదరదు కదా. అందుకే.. బడ్జెట్ ధరలో మంచి ఫోన్ కోసం చూసే వాళ్లకు ఇప్పుడు బోలెడు ఆప్షన్లు వచ్చేశాయి. ఒకప్పుడు తక్కువ ధర అంటే ఏదో నాసిరకం ఫోన్లు ఇచ్చేవారు. కానీ ఇప్పుడు పోటీ పెరగడంతో రూ.10వేల లోపే మంచి కెమెరా, రోజంతా వచ్చే బ్యాటరీ ఉన్న ఫోన్లు మార్కెట్లోకి వచ్చేస్తున్నాయి. స్టూడెంట్లకు గానీ, ఇంట్లో పెద్దవాళ్లకు గిఫ్ట్ ఇవ్వడానికి గానీ ఇవి బెస్ట్ ఛాయిస్.

భరోసా ఇచ్చే శాంసంగ్ బ్రాండ్:

బడ్జెట్ అనగానే చాలామందికి గుర్తొచ్చేది శాంసంగ్. ఆ నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ గెలాక్సీ M07, F07 మోడళ్లను తీసుకొచ్చారు. వీటి ధర రూ.9,999. దీనిలో మెయిన్ హైలైట్ ఏంటంటే.. మీడియాటెక్ హీలియో G99 ప్రాసెసర్ వాడటం వల్ల ఫోన్ అస్సలు హ్యాంగ్ అవ్వకుండా స్మూత్‌గా నడుస్తుంది. అలాగే 50 MP కెమెరా ఉండటంతో ఫొటోలు కూడా క్లారిటీగా వస్తాయి. ఇందులో 5000mAh బ్యాటరీ ఉంది కాబట్టి.. ఒక్కసారి ఛార్జ్ చేస్తే రోజంతా వాడుకోవచ్చు.

Advertisement

Also Read: ఈ ట్రిక్ తెలిస్తే.. WhatsAppలో ప్రతి చాట్‌ను ఓపెన్ చేయక్కర్లేదు.. అన్ని మెసేజ్‌లను ఒకేసారి చదివేయండిలా!

రెడ్‌మీ, పోకో.. స్టైల్ అదిరింది:

స్టైలిష్‌గా ఉంటూనే తక్కువ ధరలో కావాలనుకుంటే రెడ్‌మి A5, పోకో C71 ఫోన్లను పరిశీలింవచ్చు. పోకోలో ఏకంగా 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్ ఇచ్చారు. తద్వారా సినిమాలు చూడటానికి బాగుంటాయి. దీని బ్యాటరీ కూడా మిగతా వాటికంటే కాస్త ఎక్కువ. ఇక రెడ్‌మి A5 విషయానికి వస్తే.. దీనిలో 32MP కెమెరా ఇచ్చారు. స్టోరేజీ సరిపోదు అనుకుంటే ఏకంగా 2 TB వరకు పెంచుకోవచ్చు. ఈ రెండు ఫోన్లు కూడా సుమారు రూ.9వేల లోపే దొరుకుతున్నాయి.

దేశీయ బ్రాండ్ లావా జోరు..

Advertisement

చాలామందికి తెలియదు కానీ, మన స్వదేశీ బ్రాండ్ లావా కూడా ఇప్పుడు పవర్‌ఫుల్ ఫోన్లను తయారు చేస్తోంది. లావా బోల్డ్ N2 కేవలం రూ.8,899కే అందుబాటులో ఉంది. ఈ ఫోన్ చూడటానికి చాలా ప్రీమియంగా ఉంటుంది. వేరే కంపెనీలు బాక్స్‌లో ఛార్జర్లే తీసేస్తుంటే.. వీళ్లు మాత్రం ఫోన్‌తో పాటు ఉచితంగా కేస్, సిమ్ పిన్ వంటివి ఇస్తున్నారు. తక్కువ ధరలో స్వదేశీ ఫోన్ వాడాలనుకునే వారికి ఇది నిజంగా మంచి డీల్ అని చెప్పొచ్చు.

Also Read: ఫాయిల్ పేపర్‌ను కట్ చేస్తే నిజంగానే కత్తెర పదును పెరుగుతుందా? సైన్స్ ఏం చెబుతోందంటే..

Related News

యూట్యూబ్‌లో ఏ వీడియో క్వాలిటీకి ఎంత డేటా ఖర్చవుతుందో తెలుసా?

ఐఫోన్ బ్యాటరీని బ్యాక్‌గ్రౌండ్‌లో తినేస్తున్నది ఇదే.. ఈ ఒక్క సెట్టింగ్ మార్చండి చాలు!

ఫోన్ అడిక్షన్ అనుకుంటున్నారా? ఉదయాన్నే ఫోన్ చూడటం వెనుక అసలు సైకాలజీ ఇదే!

పవర్ బ్యాంక్‌ వాడుతున్నారా? ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన విషయాలు!

ఆపిల్ వాచ్..పాత లుక్కే అయినా పర్ఫార్మెన్స్‌లో అదుర్స్!

రూ.50 వేలలోపు బెస్ట్ స్మార్ట్ టీవీలు..అమెజాన్,ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో ఇవే బెస్ట్!

ప్రైమ్ డే సేల్ కంటే ముందే ఆఫర్లు.. ఈ 5 గాడ్జెట్స్‌పై అమెజాన్‌లో కళ్లు చెదిరే డిస్కౌంట్లు!

బ్లూటూత్ తరచూ డిస్‌కనెక్ట్ అవుతోందా?నిమిషాల్లో ఇలా సాల్వ్ చేసుకోండి!

Big Stories

Advertisement
×