E-Paper
Advertisement

ఈ ట్రిక్ తెలిస్తే.. WhatsAppలో ప్రతి చాట్‌ను ఓపెన్ చేయక్కర్లేదు.. అన్ని మెసేజ్‌లను ఒకేసారి చదివేయండిలా!

ఈ ట్రిక్ తెలిస్తే.. WhatsAppలో ప్రతి చాట్‌ను ఓపెన్ చేయక్కర్లేదు.. అన్ని మెసేజ్‌లను ఒకేసారి చదివేయండిలా!
Advertisement

WhatsApp Tip: పొద్దున లేచింది మొదలు రాత్రి పడుకునే వరకు మన పనులన్నీ ఇప్పుడు వాట్సప్ చుట్టూనే తిరుగుతున్నాయి. ఆఫీసు పనులు, ఇంటి విషయాలు, ఫ్రెండ్స్ గ్రూపులు.. ఇలా ఒకటేమిటి, అన్నీ ఇందులోనే. అయితే కొన్నిసార్లు బిజీగా ఉండటం వల్ల వచ్చే మెసేజ్‌లన్నీ చూడటం కుదరదు. సాయంత్రం అయ్యేసరికి ఫోన్ తీసి చూస్తే వందల కొద్దీ అన్‌రీడ్ మెసేజ్‌లు దర్శనమిస్తాయి. ఆ పక్కన కనిపించే గ్రీన్ డాట్స్ చూస్తేనే ఒక రకమైన టెన్షన్ వచ్చేస్తుంది. ఒక్కో చాట్‌ను ఓపెన్ చేసి చదవడం అంటే తలకు మించిన భారమే. మరి ఈ తలనొప్పి లేకుండా అన్ని మెసేజ్‌లను ఒక్కసారిగా చదివేసినట్లు మార్చడం ఎలాగో ఇప్పుడు చూద్దాం.

ఈ సెట్టింగ్ మార్చుకోండి..

మీరు ఆండ్రాయిడ్ ఫోన్ యూజర్లు అయినా లేదంటే ఐఫోన్ వాడుతున్నా ఈ ప్రాసెస్ చాలా సింపుల్. వాట్సప్‌ను ఓపెన్ చేసి పైన కుడివైపు మూలన మూడు చుక్కలు కనిపిస్తాయి కదా.. దానిపై నొక్కాలి. అక్కడ Mark all as read అనే ఆప్షన్ కనిపిస్తుంది. ఒక్కసారి దాన్ని క్లిక్ చేశారంటే చాలు.. మ్యాజిక్ లాగా మీ వాట్సాప్‌లో ఉన్న పెండింగ్ మెసేజ్‌లన్నీ మాయమైపోతాయి. దీంతో అవన్నీ మీరు చదివేసినట్టుగా మారిపోతాయన్నమాట. దీంతో మీ వాట్సాప్ స్క్రీన్ చూడటానికి చాలా నీట్‌గా కనిపిస్తుంది.

Advertisement

Also Read: ఫాయిల్ పేపర్‌ను కట్ చేస్తే నిజంగానే కత్తెర పదును పెరుగుతుందా? సైన్స్ ఏం చెబుతోందంటే..

వెబ్ వెర్షన్ వాడుతున్నారా?

చాలామంది డ్యూటీలో ఉన్నప్పుడు సిస్టమ్ లేదంటే లాప్‌టాప్‌లో వాట్సప్ వెబ్ వాడుతుంటారు. అక్కడ కూడా ఈ సౌకర్యం ఉంది. మీ కంప్యూటర్ స్క్రీన్‌పై చాట్ లిస్ట్ పైన ఉండే మెనూ బటన్ (మూడు చుక్కలు) మీద క్లిక్ చేయండి. అందులో Mark all as read అని ఉంటుంది.. దాన్ని సెలెక్ట్ చేసుకుంటే సరిపోతుంది. అయితే ఇక్కడో చిన్న విషయం గుర్తుంచుకోవాలి. మీరు ఏదైనా చాట్‌ను ఆర్కైవ్ చేసి ఉంటే మాత్రం.. ఈ ఆప్షన్ ద్వారా అవి క్లియర్ అవ్వవు. వాటిని మీరు విడివిడిగానే చూసుకోవాల్సి ఉంటుంది.

మరో సీక్రెట్ సెట్టింగ్ ఏంటంటే..

Advertisement

కొన్నిసార్లు అవతలి వారు పంపిన మెసేజ్‌ను మనం చదివినా.. చదివినట్లు వారికి తెలియకూడదని అనుకుంటాం. అలాంటప్పుడు వాట్సాప్ సెట్టింగ్స్‌లోకి వెళ్లి Read Receipts ఆప్షన్‌ను ఆఫ్ చేసుకోండి. ఇలా చేయడం వల్ల మీరు మెసేజ్ చూసినా అవతలి వారికి బ్లూ టిక్స్ పడవు. కేవలం గ్రే కలర్ టిక్స్ మాత్రమే కనిపిస్తాయి. దీనివల్ల మీకు కొంచెం ప్రైవసీ దొరుకుతుంది. చూశారుగా.. ఈ చిన్న చిన్న చిట్కాలు పాటిస్తే వాట్సప్ వాడకం ఎంత హాయిగా ఉంటుందో.

Also Read: ఏసీ వాడకపోయినా కరెంటు బిల్లు అమాంతం పెరుగుతోందా? అసలు కారణం ఈ 6 వస్తువులే!

Related News

ఆన్‌లైన్ షాపింగ్‌ చేసే..99 % మందికి తెలియని విషయాలు!

ఇంట్లోనే థియేటర్ కిక్..అదుర్స్ అనిపించే 55-ఇంచుల టీవీలు!

ఈ వాక్యూమ్ క్లీనర్స్‌తో ఎలాంటి మరకలైనా..క్షణాల్లోనే మాయం

పాత ఫోన్ వేస్ట్ అనుకుంటే పొరపాటే..ఇలా వాడితే ఎన్నో లాభాలు!

పాన్ కార్డ్ ఫోటో లేదా సిగ్నేచర్ మార్చుకోవాలా?

యూపీఐ పేమెంట్స్ చేసేటప్పుడు..ఈ పొరపాట్లు అస్సలు చేయొద్దు

రీఛార్జ్ టెన్షన్ వద్దు..ఒక్క క్లిక్‌తో 1000+టీవీ ఛానెళ్లు ఫ్రీ!

మరుగుతున్న నీటిలో పడినా పాడవ్వదు..8100mAh బ్యాటరీతో హానర్ సరికొత్త అద్భుతం!

Big Stories

Advertisement
×