E-Paper
Advertisement

ఫాయిల్ పేపర్‌ను కట్ చేస్తే నిజంగానే కత్తెర పదును పెరుగుతుందా? సైన్స్ ఏం చెబుతోందంటే..

ఫాయిల్ పేపర్‌ను కట్ చేస్తే నిజంగానే కత్తెర పదును పెరుగుతుందా? సైన్స్ ఏం చెబుతోందంటే..
Advertisement

Kitchen Hacks: సాధారణంగా ఏదైనా ముఖ్యమైన పని చేస్తున్నప్పుడు కత్తెర సరిగ్గా తెగకపోతే ఎంత చిరాకు వస్తుందో కదా. పేపర్‌ను కట్ చేయబోతే అది తెగకుండా మధ్యలోకి మడతపడిపోతుంటుంది. ఇలాంటప్పుడు చాలామంది వెంటనే చేసే పని.. ఇంట్లో ఉన్న అల్యూమినియం ఫాయిల్‌ను తీసుకుని ముక్కలు ముక్కలుగా కట్ చేయడం. ఇలా చేస్తే కత్తెర పదునుగా మారుతుందని నమ్ముతుంటారు. అలా చేసేటప్పుడు మనకు కూడా ఏదో కొత్తగా పదును వచ్చినట్టు అనిపిస్తుంది కానీ, అసలు విషయం ఏమిటంటే.. ఇది కేవలం మన భ్రమ మాత్రమే. దీని వెనుక ఉన్న అసలు కారణాలేంటో ఇప్పుడు చూద్దాం.

కత్తెర ఎందుకు మొద్దు బారుతుంది?

కత్తికి, కత్తెరకు మధ్య చాలా తేడా ఉంటుంది. కత్తి ఒకే వైపు నుంచి కట్ చేస్తే.. కత్తెరలో రెండు బ్లేడ్లు ఒకదానికొకటి రాసుకుంటూ వెళ్లినప్పుడు మాత్రమే పని జరుగుతుంది. మనం కత్తెరను వాడే కొద్దీ, ఆ రెండు బ్లేడ్ల అంచులు అరిగిపోయి కాస్త గుండ్రంగా తయారవుతాయి. కొన్నిసార్లు బ్లేడ్ల మధ్య ఉండే స్క్రూ వదులైపోయి గ్యాప్ వస్తుంది. అప్పుడు మనం దేన్ని కట్ చేసినా అది తెగకుండా బ్లేడ్ల మధ్య ఇరుక్కుపోతుంటుంది.

Advertisement

Also Read: డబుల్ డోర్ ఫ్రిడ్జ్ స్టైల్ కోసమే అనుకుంటే పొరపాటే.. దీని వల్ల కలిగే లాభాలు అన్నీ ఇన్నీ కావు!

ఫాయిల్ ఉపయోగం ఉందా?

మనం అల్యూమినియం ఫాయిల్‌ను కట్ చేసినప్పుడు అది బ్లేడ్ల మీద ఉన్న జిగురును, దుమ్మును మాత్రమే శుభ్రం చేస్తుంది. దీంతో కత్తెరకు పాలిష్ పెట్టినట్టు అవుతుందే తప్ప.. బ్లేడ్ మొన మాత్రం పదును అవ్వదు. ఆ జిగురు పోవడం వల్ల బ్లేడ్లు ఫ్రీగా కదులుతాయి. అది చూసి మనం పదును పెరిగిందని అనుకుంటాం. అల్యూమినియం అనేది చాలా మెత్తటి లోహం, అది కత్తెర బ్లేడ్ అంత గట్టి లోహాన్ని చెక్కి పదును పెట్టలేదు.

కత్తెర పదును పెరగాలంటే?

Advertisement

కత్తెర నిజంగా పదునుగా మారాలంటే దాని బ్లేడ్ల అంచులను ఒక క్రమ పద్ధతిలో అరగదీయాలి. దీనికి షార్పెనింగ్ స్టోన్ లేదంటే మిషన్లే ఉండాలి. అల్యూమినియం ఫాయిల్ కేవలం పైన ఉన్న చిన్న చిన్న గీతలను మాత్రమే సరిచేయగలదు. కత్తెర ఆకారాన్ని మార్చి పదునుగా చేయాలంటే దానికి గట్టి పదార్థమే అవసరం. అందుకే ఫాయిల్ పేపర్ అనేది ఒక తాత్కాలిక చిట్కా మాత్రమే, శాశ్వత పరిష్కారం కాదు.

కత్తెరను ఇలా కాపాడుకోండి..

కత్తెరను ఎక్కువ కాలం వాడుకోవాలంటే కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే చాలు. అప్పుడప్పుడు కత్తెర మధ్యలో ఉండే స్క్రూను చెక్ చేసుకుని టైట్ చేయాలి. బ్లేడ్ల మీద తుప్పు పట్టకుండా కొద్దిగా నూనె రాసి తుడుస్తూ ఉండాలి. మొండిగా మారినప్పుడు షార్ట్‌కట్స్ వెతకకుండా పద్ధతి ప్రకారం పదును పెట్టించుకుంటే కత్తెర ఏళ్ల తరబడి కొత్తదానిలా పనిచేస్తుంది.

Also Read: ఇకపై ఫోన్‌పే, గూగుల్ పేలతో పని లేదు.. వాట్సాప్‌లోనే మొబైల్ రీఛార్జ్‌.. ఎలాగో చూడండి!

Related News

ఈ సీక్రెట్ ట్రిక్స్ తెలిస్తే.. రోజంతా ఏసీ, ఫ్రిజ్ వాడినా కరెంట్ బిల్లు సగమే!

ట్రెండింగ్ vs యూజ్‌ఫుల్.. గ్యాడ్జెట్స్ కొనేముందు ఈ క్లారిటీ లేకపోతే డబ్బులు వేస్టే!

ఫోన్ ధర రూ.1.68 లక్షలు.. అయినా తగ్గదేలే అంటున్న జనాలు, iPhone Duoలో అంతలా ఏముంది?

చేతిలో ఇమిడిపోయే ప్రింటర్‌ తెచ్చిన షావోమీ.. దీని స్మార్ట్ ఫీచర్లు చూస్తే ఎవరైనా వావ్ అనాల్సిందే!

మన మాటల్ని సీక్రెట్‌గా రికార్డ్ చేసే AI డివైజ్‌లు.. అమెజాన్ కొత్త ప్రయోగం ఇదే!

ఒక్క రూపాయి ఖర్చు లేకుండా క్రెడిట్ కార్డ్ పాయింట్లను క్యాష్‌గా మార్చడం ఎలా?

నకిలీ QR కోడ్‌లను స్కాన్ చేసే ముందే ఇలా కనిపెట్టండి.. ఈ చిన్న ట్రిక్ తెలిస్తే మీ డబ్బు సేఫ్!

గూగుల్ ప్లేస్టోర్‌లో ఫేక్ వాట్సప్ యాప్.. అసలైనదో కాదో ఎలా గుర్తించాలి?

Big Stories

Advertisement
×