Big Stories

Amazon Summer Appliances Fest: అమెజాన్ సమ్మర్ అప్లయెన్సెస్ ఫెస్ట్ సేల్.. రూ.30,000 లోపు బెస్ట్ ఏసీలు ఇవే..!

Amazon Summer Appliances Fest: ప్రముఖ ఈ కామర్స్ సంస్థ అమెజాన్ భారతదేశంలో ‘అమెజాన్ సమ్మర్ అప్లయన్స్ ఫెస్ట్‌’ సేల్‌ను నిర్వహిస్తోంది. ఈ సేల్ ఏప్రిల్ 24న ప్రారంభం కాగా.. ఏప్రిల్ 28 వరకు కొనసాగుతుంది. ఈ సేల్‌లో గృహోపకరణాల కొనుగోలుపై 55 శాతం వరకు తగ్గింపును అమెజాన్ అందిస్తోంది. దానితో పాటు, రూ.5,000 వరకు తక్షణ బ్యాంక్ తగ్గింపు, రూ.15,000 వరకు ఎక్స్ఛేంజ్ ఆఫర్‌ను అమెజాన్ ఇండియా అందిస్తోంది. ఇక ఇప్పుడు Amazonలో రూ.30,000లోపు పొందగలిగే ది బెస్ట్ స్ప్లిట్ ACల గురించి తెలుసుకుందాం.

- Advertisement -

Daikin 0.8 Ton 3 Star, Fixed Speed Split AC:

- Advertisement -

డైకిన్ 0.8 టన్ 3 స్టార్, ఫిక్స్‌డ్ స్పీడ్ స్ప్లిట్ ఏసీ అమెజాన్‌లో అతి తక్కువ ధరలోనే అందుబాటులో ఉంది. కేవలం రూ.25,990 లకి దీనిని కొనుక్కోవచ్చు. అంతేకాకుండా దీనిపై బ్యాంక్ డిస్కౌంట్లు కూడా పొందవచ్చు. దీని ద్వారా మరింత తక్కువ ధరకే ఈ ఏసీని కొనుక్కోవచ్చు. ఇది 0.8-టన్ను సామర్థ్యం, మూడు స్టార్ రేటింగ్‌తో వస్తుంది. ఇది 43-డిగ్రీల శీతలీకరణ సామర్థ్యం, ప్రత్యేక పవర్ చిల్ ఫంక్షన్‌ను కలిగి ఉంది.

Cruise 1.5 Ton 3 Star Inverter Split AC:

క్రూయిజ్ 1.5 టన్ 3 స్టార్ ఇన్వర్టర్ స్ప్లిట్ AC ధర అమెజాన్‌లో రూ.28,290గా ఉంది. దీనిని బ్యాంక్, ఎక్స్ఛేంజ్ డిస్కౌంట్‌లతో మరింత తక్కువ ధరకే కొనుక్కోవచ్చు. ఇది 1.5-టన్ను సామర్థ్యంతో వస్తుంది. మరింత సమర్థవంతమైన కూలింగ్ కోసం ప్రత్యేక టర్బో, డ్రై మోడ్‌లతో వస్తుంది. అదనంగా ఇది VarioQool ఇన్వర్టర్ కంప్రెసర్, యాంటీ-వైరస్ సేఫ్టీ HD ఫిల్టర్‌తో కన్వర్టిబుల్ 4-in-1 కూలింగ్ ఫీచర్‌తో వస్తుంది.

Also Read: కదిలే ఏసీ.. ఇంటిని మంచు పర్వతంలా మార్చేస్తుంది..!

Voltas 1 Ton 3 Star, Inverter Split AC:

ఈ స్ప్లిట్ AC అమెజాన్‌లో బడ్జెట్ ధరకే అందుబాటులో ఉంది. కేవలం రూ.29,940 లకే ఇది లభిస్తుంది. ఇది ఒక టన్ను సామర్థ్యంతో వస్తుంది. సమర్థవంతమైన కూలింగ్ కోసం నాలుగు కూలింగ్ మోడ్‌లను కలిగి ఉంది. ఇది యాంటీ డస్ట్, యాంటీ మైక్రోబియల్ కోటింగ్, మెమరీ స్టార్ట్ ఫీచర్‌తో వస్తుంది.

Cruise 1 Ton 3 Star Inverter Split AC:

ఈ స్ప్లిట్ AC సమర్థవంతమైన కూలింగ్ కోసం నాలుగు కూలింగ్ మోడ్‌లను కలిగి ఉంది. ఈ ఏసీ రూ. 25,990 ధరలో లభిస్తుంది. ఒక టన్ను సామర్థ్యంతో వస్తుంది. ఇది VarioQool ఇన్వర్టర్ కంప్రెసర్ కన్వర్టిబుల్ 4-in-1 కూలింగ్ ఫంక్షన్‌తోను కలిగి ఉంది. అదనంగా, ఇది బుల్టిన్ PM2.5 ఎయిర్ ఫిల్టర్‌లను కలిగి ఉంది.

Lloyd 1.0 Ton 3 Star Inverter Split AC:

Also Read: రూ.35 వేల లోపు లభించే బెస్ట్ ఏసీలు.. మీరే ఓ లుక్కేయండి..!

లాయిడ్ 1.0 టన్ 3 స్టార్ ఇన్వర్టర్ స్ప్లిట్ AC అమెజాన్‌లో రూ.29,950 ధరకి అందుబాటులో ఉంది. ఇది ఒక టన్ను సామర్థ్యంతో వస్తుంది. సమర్థవంతమైన కూలింగ్ కోసం నాలుగు కూలింగ్ మోడ్‌లను కలిగి ఉంది. అదనంగా, ఇది మరింత సమర్థవంతమైన కూలింగ్ కోసం PM 2.5 ఎయిర్ ఫిల్టర్‌ను కలిగి ఉంది.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News