Big Stories

Portable AC Price: కదిలే ఏసీ.. ఇంటిని మంచు పర్వతంలా మార్చేస్తుంది..!

Buy Portable AC @ Rs. 39,990: వేసవి కాలం వచ్చిందంటే చాలామంది ఏసీ కోసం వెతుకులాట మొదలుపెడతారు. అయితే ఎలాంటి ఏసీని కొనుక్కోవాలి అని తెగ సెర్చ్ చేస్తుంటారు. ఎప్పుడైనా పోర్టబుల్ ఏసీ గురించి ఆలోచించారా..? పోర్టబుల్ ఏసీ అంటే ఏంటని అనుకుంటున్నారా..? అదేనండి మిగతా ఏసీల్లా ఈ పోర్టబుల్ ఏసీని గోడకు పెట్టుకునే అవసరం లేదు.

- Advertisement -

ఈ పోర్టబుల్ ఏసీని గదిలో ఏ మూలన అయినా పెట్టుకోవచ్చు. ఎక్కడికైనా తీసుకెళ్లొచ్చు. గోడకు వేలాడదీయాల్సిన అవసరం లేదు. సులభంగా ఉపయోగించడం వల్ల ఈ పోర్టబుల్ ACలు ఇతర ఏసీలకు భిన్నంగా ఉంటాయి. అయితే మార్కెట్‌లో అనేక కంపెనీలు పోర్టబుల్ ఏసీలను మార్కెట్‌లోకి తీసుకువచ్చాయి. ఇప్పుడు వాటి ధర ఇతర వివరాల గురించి పూర్తిగా తెలుసుకుందాం.

- Advertisement -

Also Read: రూ.35 వేల లోపు లభించే బెస్ట్ ఏసీలు ఇవే..!

లాయిడ్ 1 టన్ 3 స్టార్ పోర్టబుల్ ఏసీ:

ప్రముఖ ఈ కామర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్‌లో లాయిడ్ 1 టన్ 3 స్టార్ పోర్టబుల్ ఏసీని కొనుక్కోవచ్చు. దీని ధర ఫ్లిప్‌కార్ట్‌లో రూ. 39,990 లకు అందుబాటులో ఉంది. ఈ ఏసీ కొనుగోలుపై కస్టమర్లు పలు బ్యాంక్ ఆఫర్లను కూడా సొంతం చేసుకోవచ్చు.

అలాగే కస్టమర్లు ఫాస్ట్ డెలివరీ ఆప్షన్‌ను కూడా పోందుతారు. ఈ ఏసీ కొనుగోలుపై 1 సంవత్సరం వారంటీ కూడా లభిస్తుంది. అంతేకాకుండా దీన్ని క్రెడిట్ కార్డ్ ద్వారా చెల్లిస్తే, మరింత తగ్గింపు కూడా లభిస్తుంది. కాగా ఈ ఏసీ వినియోగంపై 15 శాతం తక్కువ విద్యుత్ మాత్రమే అవుతుందని కంపెనీ తెలిపింది.

క్రోమా 1.5 టన్ పోర్టబుల్ ఏసీ:

ప్రముఖ ఈ కామర్స్ సంస్థ క్రోమాలో.. క్రోమా 1.5 టన్ పోర్టబుల్ ఏసీని ఆన్‌లైన్‌ ద్వారా కొనుగోలు చేయవచ్చు. దీని అసలు ధర రూ.50 వేలు ఉండగా.. ఇప్పుడు కేవలం రూ.43,990లకే కొనుక్కోవచ్చు. కాగా ఈ పోర్టబుల్ ఏసీ డిజైన్ కూడా చాలా అందంగా అద్భుతంగా ఉంటుంది.

Also Read: Motorola Edge 50 Pro sale: సేల్ మొదలైంది.. ఈ ఆఫర్లతో తక్కువ ధరకే కొత్త 5జీ ఫోన్‌ను కొనేయండి..!

బ్లూ స్టార్ 1 టన్ పోర్టబుల్ ఏసీ:

బ్లూ స్టార్ 1 టన్ పోర్టబుల్ ఏసీ అధిక కూలింగ్‌ను అందిస్తుంది. దీనిని ఆన్‌లైన్ ద్వారా కొనుగోలు చేయవచ్చు. దీని అసలు ధర రూ.39,000గా ఉంది. అయితే ఇప్పుడు దీనిని కేవలం రూ.33,990 లకే సొంతం చేసుకోవచ్చు. మంచి బ్రాండ్‌లో పోర్టబుల్ ఏసీని కొనుక్కోవాలని ప్లాన్ చేస్తున్నట్లయితే దీనిని కొనుగోలు చేయవచ్చు. ఈ పోర్టబుల్ ఏసీ వల్ల విద్యుత్ కూడా ఆదా అవుతుందని కంపెనీ పేర్కొంది.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News