E-Paper
Advertisement

30 ఏళ్ల వయసు తరువాత మీ రోజువారి అలవాట్లతో ప్రమాదం.. జీవనశైలిలో ఈ మార్పులు చేయడం తప్పనిసరి

30 ఏళ్ల వయసు తరువాత మీ రోజువారి అలవాట్లతో ప్రమాదం.. జీవనశైలిలో ఈ మార్పులు చేయడం తప్పనిసరి
Advertisement

30 ఏళ్లు పైబడిన తర్వాత శారీరకంగా, మానసికంగా అనేక మార్పులు వస్తాయి. ఈ వయసులో శరీరాన్ని బాగా జాగ్రత్తగా చూసుకోవాలి. చెడు అలవాట్లు శరీరంలో ఎనర్జీ, ఫిట్‌నెస్, ఆరోగ్యాన్ని నెమ్మదిగా దెబ్బతీస్తాయి. చిన్న చిన్న జీవనశైలి మార్పులు దీర్ఘకాలిక ప్రయోజనాలను ఇస్తాయి. ఆరోగ్యకర అలవాట్లు మనల్ని చురుకుగా, బలంగా, మానసికంగా తాజాగా ఉంచుతాయి.

క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి

30 ఏళ్ల తర్వాత చాలా మంది పని, కుటుంబ బాధ్యతల్లో మునిగిపోయి వ్యాయామం మానేస్తారు. ఇది కండరాలను బలహీనం చేసి బరువు పెరగడానికి దారి తీస్తుంది. రోజూ నడక, యోగా లేదా తేలికపాటి వ్యాయామం చేయడం గుండె ఆరోగ్యం, ఎనర్జీ, మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. రోజుకు 30 నిమిషాలు చేసినా ప్రయోజనకరంగా ఉంటుంది.

జంక్ ఫుడ్ తినడం తగ్గించండి

Advertisement

ఫాస్ట్ ఫుడ్ సమయం ఆదా చేస్తుంది కానీ ఆరోగ్యాన్ని క్రమంగా దెబ్బతీస్తుంది. ఎక్కువ నూనె కలిగిన లేదా ప్రాసెస్డ్ ఫుడ్స్.. కొలెస్ట్రాల్, ఊబకాయం పెంచుతాయి. తాజా పండ్లు, కూరగాయలు, ఇంట్లో వండిన ఆహారం తినండి. తగినంత నీళ్లు తాగడం కూడా చాలా ముఖ్యం.

రాత్రి ఆలస్యంగా నిద్రపోవడం మానండి

ఆలస్యంగా నిద్రపోవడం శారీరక మరియు మానసిక ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది. తక్కువ నిద్ర వల్ల ఏకాగ్రత తగ్గి, ఒత్తిడి పెరుగుతుంది. రోజుకు కనీసం 7 గంటలు నిద్రపోవాలి. నిద్రకు ముందు మొబైల్ వాడకండి.

ఒత్తిడిని నియంత్రించండి

Advertisement

30 ఏళ్ల తర్వాత బాధ్యతలు పెరగడం వల్ల ఒత్తిడి సాధారణం అవుతుంది. ధ్యానం, శ్వాస వ్యాయామాలు, బ్యాడ్మింటన్ లేదా స్మిమ్మింగ్ లాంటి హాబీలు చేయండి. కుటుంబం, స్నేహితులతో సమయం గడపడం ఒత్తిడిని తగ్గిస్తుంది.

క్రమం తప్పకుండా ఆరోగ్య పరీక్షలు చేయించుకోండి

చాలా మంది తీవ్రమైన అనారోగ్యం వచ్చినప్పుడు మాత్రమే డాక్టర్ దగ్గరకు వెళ్తారు. రక్తపోటు, చక్కెర, కొలెస్ట్రాల్ లెవెల్స్ క్రమం తప్పకుండా చెక్ చేయించుకోవాలి. ముందుగా గుర్తించడం వల్ల చికిత్స సులభం అవుతుంది.

స్క్రీన్ టైమ్ తగ్గించండి

ఫోన్, ల్యాప్‌టాప్ ముందు ఎక్కువ సమయం గడపడం కళ్లు, భంగిమను దెబ్బతీస్తుంది. పని చేసేటప్పుడు చిన్న చిన్న విరామాలు తీసుకోండి. బయటకు వెళ్లి, పుస్తకాలు చదవడం అలవాటు చేసుకోండి.

ధూమపానం, అధిక మద్యపానం మానండి

ధూమపానం ఊపిరితిత్తులను దెబ్బతీస్తుంది. అధిక మద్యం సేవించడం.. కాలేయం, గుండె, మానసిక ఆరోగ్యాన్ని పాడు చేస్తుంది. ఈ అలవాట్లను మానడం వల్ల దీర్ఘకాలం ఆరోగ్యంగా ఉండవచ్చు.

మానసిక ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి

మానసిక సమస్యలను నిర్లక్ష్యం చేయకండి. స్నేహితులు, కుటుంబంతో మాట్లాడండి. అవసరమైతే కౌన్సెలింగ్ తీసుకోండి.

Also Read: మీ టీనేజ్ పిల్లాడు చదువు, కెరీర్‌ని నిర్లక్ష్యం చేస్తున్నాడా.. తప్పుకుండా ఈ విషయాలు నేర్పండి

మంచి సంబంధాలను కాపాడుకోండి

కుటుంబం, స్నేహితులతో సమయం గడపడం మానసిక బలాన్ని పెంచుతుంది. మంచి సంబంధాలు జీవితాన్ని సంతోషంగా చేస్తాయి.

30 ఏళ్ల తర్వాత జీవితం మరింత బాధ్యతాయుతంగా మారుతుంది. సరైన ఆహారం, నిద్ర, వ్యాయామం, ఒత్తిడి నియంత్రణ, మానసిక ఆరోగ్యం వంటి అలవాట్లు ఆరోగ్యకరమైన, సుఖమైన జీవితాన్ని ఇస్తాయి. చిన్న మార్పులు దీర్ఘకాలిక ప్రయోజనాలను ఇస్తాయి.

Related News

పిల్లలు ఫోన్ వదిలేయాలంటే తిట్టడం కాదు.. ఈ టీచర్ చేసిన మ్యాజిక్ చూడండి!

ఆ దేశం ప్రజలు కేవలం రాత్రి మాత్రమే స్నానం చేస్తారు? ఈ అలవాటు వెనుక ప్రత్యేక కారణం ఇదే

తినడానికే బతుకుతుంటారు.. ఈ తేదీల్లో పుట్టినవారికి ఎప్పుడూ తిండిపైనే ధ్యాస

ఎలాంటి ప్రతిఫలం ఆశించకుండా సాయం చేస్తారు.. ఈ తేదీల్లో పుట్టినవారు కష్టకాలంలో తోడుగా నిలుస్తారు

మరణం తర్వాత శరీరంలోని ఏ అవయవం ఎంతసేపు జీవించి ఉంటుంది? ఈ విషయాలు తెలుసా

జీవితంలో ఎప్పుడూ తప్పుడు నిర్ణయాలు తీసుకోరు, మోసపోరు.. చాణక్యుడు చెప్పిన ఈ నీతి సూత్రాలు పాటిస్తే

తక్కువ స్థలంలో కిచెన్ గార్డెన్‌.. ఇంట్లోనే కూరగాయలు పండించడం మరింత సులభం

రాత్రి ఆలస్యంగా నిద్రపోయి ఉదయం త్వరగా లేస్తున్నారా? మీ శరీరానికి కలిగే నష్టాలివే

Big Stories

Advertisement
×