Head Vs Kohli: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ లో ( Indian Premier League 2026 Tournament) భాగంగా మే 22వ తేదీన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వర్సెస్ సన్ రైజర్స్ హైదరాబాద్ జట్ల మధ్య బిగ్ ఫైట్ జరిగింది. ఈ మ్యాచ్ నేపథ్యంలో అద్భుతంగా రాణించిన సన్ రైజర్స్ హైదరాబాద్ విక్టరీ నమోదు చేసుకుంది. అయితే ఈ మ్యాచ్ లో విరాట్ కోహ్లీ, ట్రావిస్ హెడ్ (Travis Head Vs Virat Kohli ) మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ నేపథ్యంలోనే ట్రావిస్ హెడ్ కు షేక్ హ్యాండ్ ఇవ్వకుండానే విరాట్ కోహ్లీ ఘోరంగా అవమానించాడు. ఈ సంఘటన ఇప్పుడు వైరల్ గా మారింది. అయితే దీనిపై క్రికెట్ అభిమానులు మండిపడుతున్నారు. విరాట్ కోహ్లీ పరువు తీస్తున్నారు. వరల్డ్ క్లాస్ క్రికెటర్ అయి ఉండి, షేక్ హ్యాండ్ ఇవ్వకుండా విదేశీ క్రికెటర్ హెడ్ ను అవమానించడం పెద్ద తప్పు అంటూ కోహ్లీని విలన్ చేస్తున్నారు.
ఉప్పల్ స్టేడియం వేదికగా ట్రావిస్ హెడ్ ను అవమానించిన సంఘటన రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు జట్టుకు పెద్ద ప్రమాదం అంటూ హెచ్చరికలు చేస్తున్నారు క్రికెట్ ఫ్యాన్స్. కర్మకాలి బెంగళూరు వర్సెస్ సన్ రైజర్స్ హైదరాబాద్ మధ్య ఫైనల్స్ అహ్మదాబాద్ వేదికగా జరిగితే… హెడ్ చెలరేగే ప్రమాదం ఉందని వార్నింగ్స్ ఇస్తున్నారు. ప్రస్తుతం హెడ్ ఫామ్ లో లేడు. అలాంటి వ్యక్తిని గిల్లి మరి విరాట్ కోహ్లీ రెచ్చగొట్టాడు. పడుకున్న సింహాన్ని తన్ని మరి లేపాడు కోహ్లీ. దీని ప్రభావం ఫైనల్స్ లో ఖచ్చితంగా ఉంటుందని హెచ్చరిస్తున్నారు. సన్రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ బెంగళూరు మధ్య నిజంగానే ఫైనల్ జరుగుతే మాత్రం హెడ్ సెంచరీ చేస్తాడని చెబుతున్నారు.
2023 వన్డే వరల్డ్ కప్ సందర్భంగా ఆస్ట్రేలియా వర్సెస్ టీమిండియా మధ్య అహ్మదాబాద్ వేదికగా ఫైనల్ జరిగింది. ఈ సందర్భంగా ఆస్ట్రేలియా ఆరు వికెట్ల తేడాతో విజయం సాధించి ఛాంపియన్ అయింది. ఇందులో ఆస్ట్రేలియా డేంజర్ ఓపెనర్ హెడ్ 120 బంతుల్లో 137 పరుగులు సాధించాడు. దీంతో ఇండియా ఓడిపోవాల్సి వచ్చింది. ఇక లేటెస్ట్ గా కోహ్లీ అనవసరంగా హెడ్ ను గెలికాడు కాబట్టి.. ఫైనల్స్ లో రెచ్చిపోతాడని అంచనా వేస్తున్నారు. ఐపీఎల్ లో ఇప్పటివరకు హెడ్…మూడు అర్థ సెంచరీలు మాత్రమే చేశాడు. మిగిలిన అన్ని మ్యాచ్ లలో విఫలమయ్యాడు. అయితే కోహ్లీ రెచ్చగొట్టిన నేపథ్యంలో హైదరాబాద్ వర్సెస్ బెంగళూరు మధ్య ఫైనల్ జరిగితే మాత్రం బడిత పూజ తప్పదని వార్నింగ్ ఇస్తున్నారు. ఐసీసీ కూడా ఇదే విషయాన్ని పరోక్షంగా హెచ్చరించింది. ఓ వీడియో పెట్టి వార్నింగ్ ఇచ్చింది. బ్యాటింగ్ తో పాటు, బౌలింగ్ లో హెడ్ రాణిస్తాడని పేర్కొంటూ వీడియో విడుదల చేసింది.
?igsh=MW1vZ2ZmcHZvNHhlYg==
?utm_source=ig_web_copy_link&igsh=NTc4MTIwNjQ2YQ==