Upcoming Phones March 2026: సాధారణంగా మార్చి నెల రాబోతుందంటే చాలు.. టెక్ ప్రియుల్లో కొత్త ఉత్సాహం పుట్టుకొస్తుంది. ఎందుకంటే.. ప్రతి ఏటా ఈ నెలలో స్మార్ట్‌ఫోన్ కంపెనీలు తమ బెస్ట్ మోడల్స్‌ను మార్కెట్లోకి తీసుకొస్తుంటాయి. ఈసారి కూడా ప్రముఖ శాంసంగ్, షియోమీ, నథింగ్ వంటి బ్రాండ్స్ అదిరిపోయే ఫీచర్లతో మన ముందుకు రానున్నాయి. ఈ నేపథ్యంలో మార్చి నెలలో లాంచ్ కాబోతున్న టాప్ స్మార్ట్‌ఫోన్ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..
మార్చిలో అందరి కళ్లు Xiaomi 17 సిరీస్‌పైనే ఉన్నాయి. ముఖ్యంగా Xiaomi 17 Ultra తన 200MP పెరిస్కోప్ కెమెరా, స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ జెన్ 5 చిప్‌సెట్‌తో ఫొటోగ్రఫీ ప్రియులను ఊరించనుంది. అలాగే Samsung Galaxy S26 సిరీస్ గ్లోబల్ మార్కెట్‌లో మార్చి నెలాఖరు లోపు మార్కెట్లోకి రానుంది. ఈ ఫోన్‌లో ఉండే సరికొత్త AI ఫీచర్లు ఫోన్ వాడే అనుభూతిని మరో లెవల్‌కు తీసుకెళ్తాయి.
బడ్జెట్ అండ్ స్టైలిష్ ఫోన్ల కోసం చూసేవారికి నథింగ్ సంస్థ మార్చి 5న తన Nothing Phone 4a, Nothing Phone 4a Pro మోడల్స్‌ను లాంచ్ చేయనుంది. ఈసారి బ్యాటరీ సామర్థ్యాన్ని పెంచడంతో పాటు క్లీన్ సాఫ్ట్‌వేర్ అనుభవాన్ని కూడా ఇస్తామని కంపెనీ చెబుతోంది. డిజైన్ పరంగా ఎప్పటిలాగే గ్లిఫ్ ఇంటర్‌ఫేస్‌తో ఈ ఫోన్లు స్పెషల్ అట్రాక్షన్‌గా నిలవనున్నాయి.
Also Read: రూ.7,999కే రియల్‌మీ కొత్త స్మార్ట్‌ఫోన్ మావా.. ఫీచర్లు మామూలుగా లేవుగా!
కెమెరాకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచే వివో తన X300 Ultra మోడల్‌ను మార్చి ఆఖర్లోపు తీసుకొచ్చే అవకాశం ఉంది. దీనికి పోటీగా ఒప్పో తన Find X9 Ultrను రంగంలోకి దించుతోంది. ఈ రెండు ఫోన్లు కూడా Zeiss, Hasselblad లెన్స్‌లతో అద్భుతమైన ఫొటోలను అందిస్తుంది.
ఫోల్డబుల్ ఫోన్ల విభాగంలో హానర్ తన Robot phone, Magic V6 మోడల్స్‌ను మార్చిలో పరిచయం చేసే అవకాశం ఉంది. మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ (MWC 2026) ముగిసిన వెంటనే ఈ ఫోన్లు ఇండియన్ మార్కెట్లోకి అడుగుపెట్టవచ్చు.
కేవలం ఖరీదైన ఫోన్లే కాకుండా.. Realme 16 Pro సిరీస్, OnePlus 15T వంటి మిడ్‌రేంజ్ స్మార్ట్‌ఫోన్లు కూడా మార్చిలో మార్కెట్‌ను షేక్ చేయనున్నాయి. ముఖ్యంగా రియల్‌మీ తన 200MP కెమెరా సెటప్‌ను తక్కువ ధరకే అందుబాటులోకి తేవాలని చూస్తోంది.
Also Read: ఫ్లిప్‌కార్ట్‌లో ఐఫోన్ 17పై కళ్లు చెదిరే డిస్కౌంట్.. ఎంత తగ్గిందో తెలిస్తే ఇప్పుడే కొనేస్తారు!