E-Paper
Advertisement

Cm Revanth : బీసీలకు వాగ్దానం.. కేంద్రంతో సీఎం రేవంత్ ‘ఢీ’..!

Cm Revanth : బీసీలకు వాగ్దానం.. కేంద్రంతో సీఎం రేవంత్ ‘ఢీ’..!
Advertisement

రాష్ట్రంలో మరోసారి బీసీ రిజర్వేషన్ల అంశం తెరమీదకు వచ్చింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. అందుకోసం బీసీ డెడికేటెడ్ కమిటీ వేసి మరీ అది ఇచ్చిన నివేదిక ఆధారంగా రిజర్వేషన్లు ఫైనల్ చేశారు. కానీ ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లు అమలు చేయాలంటే కేంద్రం పార్లమెంటులో చట్టం చేయాలని ఒక నిబంధన ఉంది. ఆ విషయంపై రాష్ట్రం ప్రభుత్వం కాకుండా కేంద్రం చొరవ చూపాలి. పలువురు బీసీ రిజర్వేషన్లపై హైకోర్టు, సుప్రీంకోర్టులో పిటిషన్లు వేయగా.. విచారించిన న్యాయస్థానాలు 50 శాతం రిజర్వేషన్లకు మించకుండా గతంలో మాదిరి ఎన్నికలు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వానికి సూచించాయి. దీంతో సర్పంచ్, మున్సిపల్ ఎన్నికల్లో ప్రభుత్వం పాత రిజర్వేషన్ల ప్రకారమే ఎన్నికలు నిర్వహించింది.

ఎంపీటీసీ,జెడ్పీటీసీకి అడ్డంకి..

సర్పంచ్, మున్సిపల్ ఎన్నికలు ముగిశాయి. ఎంపీటీసీ, జెడ్పీటీసీ, గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు జరగాల్సి ఉన్నది. అయితే, నిన్న జరిగిన కేబినెట్ భేటీలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలపై ప్రస్తావన రాగా.. బీసీ రిజర్వేషన్లపై క్లారిటీ వచ్చాకే ఎన్నికలకు వెళ్దామని సీఎం రేవంత్ తోటి మంత్రివర్గంతో అన్నట్టు సమాచారం. ఈ మేరకు కేంద్రంతో పలుమార్లు చర్చలు జరపాల్సి ఉందని ఆయన అభిప్రాయం వ్యక్తం చేసినట్టు సమాచారం. ఒకవేళ కేంద్రం నుంచి ఎటువంటి స్పందన లేకపోయినట్టయితే .. రాష్ట్రం నుంచి అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకువెళ్లి కేంద్రానికి తమ పవర్ ఏంటో చూపించాలని సీఎం రేవంత్ నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తున్నది. అయితే, ముందుగా కేంద్రంలోని పెద్దలను కలిసి బీసీ రిజర్వేషన్ల ఆవశ్యకతను వివరించాలని చూస్తున్నట్టు తెలుస్తోంది.

పార్టీకి, ప్రభుత్వానికి మచ్చ రాకూడదని..

Advertisement

ఎన్నికల సమయంలో ఇచ్చిన ఆరు గ్యారెంటీల్లో మహిళలకు రూ.2500, తులం బంగారం, పెన్షన్ల పెంపు వంటి హామీలు ఇంకా నెరవేరలేదు. వాటిని త్వరలోనే అమలు చేయాలని సర్కార్ ప్లాన్ చేస్తున్నది. నిధుల సమీకరణకు తన వంతు ప్రయత్నాలు చేస్తున్నది. రాష్ట్రం మీద అప్పుల భారం అధికం అవ్వడంతో ఆరుగ్యారెంటీల అమలు ఆలస్యం అవుతోందని ఇటీవల మంత్రి సీతక్క ప్రకటించారు. ఈ క్రమంలోనే రాష్ట్ర ఆదాయం పెంచి సంక్షేమాన్ని పక్కాగా అమలు చేయాలని రేవంత్ సర్కార్ భావిస్తున్నది. సంక్షేమం పక్కనబెడితే బీసీలకు రాజకీయంగా 42 శాతం రిజర్వేషన్లు కల్పించడం అనేది సంచలన నిర్ణయం. అదే గనుక రేవంత్ సర్కార్ సాధించినట్టయితే.. వచ్చే ఎన్నికల్లో పార్టీకి తిరుగుండదు. ఎందుకంటే రాష్ట్రంలో బీసీలదే అత్యధిక మెజార్టీ.

AP Politics : కల్తీ నెయ్యి.. కల్తీ పాలు.. ఏదైనా సర్కారు వైఫల్యమేనా?

Advertisement

బీసీ రిజర్వేషన్లు సాధించకపోయినట్టయితే అటు ప్రభుత్వానికి, ఇటు పార్టీపై బీసీల్లో వ్యతిరేకత వచ్చే అవకాశం లేదు. ఇప్పటికే ప్రతిపక్ష పార్టీలు ఆరు గ్యారెంటీలతో పాటు బీసీ రిజర్వేషన్లపై ప్రశ్నిస్తున్నారు. ఆరు గ్యారంటీల అమలులో సర్కారు ఫెయిల్ అయ్యిందని ప్రతిపక్ష బీఆర్ఎస్ మొదటి నుంచి విషప్రచారం చేస్తున్నది. దీనికి తోడు అటు బీజేపీ, మిగతా పార్టీలు సైతం బీసీ రిజర్వేషన్లను ఎప్పుడు అమలు చేస్తారో చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే బీసీ రిజర్వేషన్లను ఎలాగైనా సాధించాలని సీఎం రేవంత్ మొండిగా వెళ్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. రిజర్వేషన్లు సాధించాకే ప్రతిపక్షాలు వేసే ప్రశ్నలకు సమాధానం ఇవ్వాలని చూస్తున్నట్టు తెలుస్తోంది. ఎంపీటీసీ,జెడ్పీటీసీ.. గ్రేటర్ ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లు అమలైతే కాంగ్రెస్ పార్టీకి ఇక తిరుగు ఉండదని సీఎం రేవంత్ భావిస్తున్నట్టు సమాచారం.

Related News

కేటీఆర్ వచ్చే వేళ మిర్యాలగూడలో పొలిటికల్ హీట్.. కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ మధ్య వార్!

ఢిల్లీలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి అవార్డ్స్ 2026.. సీఎం రేవంత్ రెడ్డి స్పీచ్ వైరల్!

యూట్యూబ్‌లో చూసి నకిలీ నోట్ల తయారీ.. కానీ చివరికి ఎలా చిక్కాడంటే..?

హుజూరాబాద్‌లో మళ్లీ కాకరేపుతున్న రాజకీయ వేడి.. కాంగ్రెస్ వైఫల్యాలపై కౌశిక్ రెడ్డి భారీగా ధర్నా!

క్రికెట్ గ్రౌండ్ కోసం చెరువు కబ్జా చేస్తారా.. పట్టించుకోని అధికారులు!

ఆయనకు అన్నీ ఆశలు, కోరికలే ఉన్నాయి.. కేటీఆర్‌పై జగ్గారెడ్డి షాకింగ్ కామెంట్స్!

తెలంగాణలో భారీ డిఫెన్స్ ఎక్స్‌పో.. రాజ్‌నాథ్ సింగ్‌కు రేవంత్ స్పెషల్ ఇన్విటేషన్!

కుషాయిగూడ పీహెచ్‌సీలో ఊహించని పరిణామం.. డాక్టర్‌గా మారిన డీఎంహెచ్‌ఓ!

Big Stories

Advertisement
×