E-Paper
Advertisement

Harish Rao: రెండేళ్లుగా ఓపికగా గమనిస్తున్నాం.. ఇక‌ గల్లా పట్టి నిలదీస్తాం: హరీష్ రావు

Harish Rao: రెండేళ్లుగా ఓపికగా గమనిస్తున్నాం.. ఇక‌ గల్లా పట్టి నిలదీస్తాం: హరీష్ రావు

Harish Rao: దేవాదుల ప్రాజెక్టు, వరంగల్ హెల్త్ సిటీ నిర్మాణంలో కాంగ్రెస్ ప్రభుత్వం అనుసరిస్తున్న నిర్లక్ష్య వైఖరిని మాజీ మంత్రి హరీష్ రావు తీవ్రంగా తప్పుబట్టారు. కేసీఆర్ హయాంలో జరిగిన అభివృద్ధిని అడ్డుకుంటున్నారని.. పేదల ఆరోగ్యం కంటే రియల్ ఎస్టేట్ వ్యాపారానికే రేవంత్ రెడ్డి ప్రాధాన్యత ఇస్తున్నారని ఆరోపించారు. వ‌రంగల్ పర్యటనలో భాగంగా సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణ పనులను హ‌రీష్ రావు స్వయంగా పరిశీలించారు. కేసీఆర్ హయాంలో పేదల కోసం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ హెల్త్ సిటీ పనులు కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో మందగించడంపై ఆయన తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఆసుపత్రిలోని వివిధ అంతస్తులను.. వార్డులను కలియదిరిగిన ఆయన పనుల పురోగతి గురించి అధికారులను ఆరా తీశారు.

అనంతరం మాట్లాడుతూ… వరంగల్ నగరాన్ని అంతర్జాతీయ స్థాయి హెల్త్ సిటీగా మార్చాలన్న కేసీఆర్ కలని కాంగ్రెస్ ప్రభుత్వం చిన్నాభిన్నం చేస్తోందని హరీష్ రావు ఆవేదన వ్యక్తం చేశారు. పేదల కోసం కేసీఆర్ హెల్త్ సిటీ నిర్మిస్తే.. రేవంత్ రెడ్డి కేవలం రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం ఫ్యూచర్ సిటీపై దృష్టి సారించారని ఆరోపించారు. కేసీఆర్‌కు పేరు వస్తుందనే అక్కసుతోనే 24 అంతస్తుల సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి పనులను అడ్డుకుంటున్నారని విమర్శించారు. 2000 పడకల ఈ ఆసుపత్రిని జూన్‌లో ప్రారంభిస్తామని చెబుతున్నా.. నేటికీ సిబ్బంది నియామకంపై క్యాబినెట్ అనుమతి తీసుకోలేదని.. వైద్య పరికరాలు కూడా సమకూర్చలేదని గుర్తు చేశారు. కేవలం ఓపీ సేవలు ప్రారంభించి ఇంతటి భారీ భవనాన్ని బస్తీ దవాఖానాగా మార్చాలని చూస్తున్నారా అని నిలదీశారు. ప్రభుత్వ నేరపూరిత నిర్లక్ష్యం కారణంగా వరంగల్ ఎంజీఎంలో ఏడాదిన్నరగా గుండె శస్త్రచికిత్సలు ఆగిపోయాయని.. తాము ఏర్పాటు చేసిన ఆక్సిజన్ ప్లాంట్లు కూడా నిర్వహణ లేక మూతపడ్డాయని ఆగ్రహం వ్యక్తం చేశారు.

దేవాదుల ప్రాజెక్టు సందర్శన అనంతరం ముఖ్యమంత్రి నిర్వహించిన సమీక్ష కేవలం తాము క్షేత్రస్థాయిలో సమస్యలను తట్టిలేపడం వల్లే జరిగిందని ఆయన ఎద్దేవా చేశారు. దేవాదుల ప్రాజెక్టును మొదటి ప్రాధాన్యత అని చెబుతూనే రెండేళ్ల కాలంలో ఒక్క ఎకరా భూసేకరణ కూడా చేయలేదని విమర్శించారు. ప్రాజెక్టు పనులపై మంత్రుల మాటలకు.. ముఖ్యమంత్రి మాటలకు అస్సలు పొంతన లేదని.. కేవలం డెడ్ లైన్లు మారుస్తూ కాలయాపన చేస్తున్నారని ధ్వజమెత్తారు. గోదావరి జలాలపై అసెంబ్లీలో చర్చకు తాము సిద్ధమని.. అయితే కెమెరా తిప్పకుండా.. మైక్ కట్ చేయకుండా చర్చించే దమ్ము ముఖ్యమంత్రికి ఉందా అని సవాల్ విసిరారు. సాక్షాత్తు నీటిపారుదల శాఖ మంత్రినే మాట్లాడనీయని రేవంత్ రెడ్డి.. ప్రతిపక్షాలకు అవకాశం ఇస్తారా అని ప్రశ్నించారు. గోదావరిపై ఎనిమిది బ్యారేజీలు కట్టి నీటిని పొలాలకు మళ్లించిన ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వానిదేనని స్పష్టం చేశారు.

ప్రభుత్వ వైఖరిని రెండేళ్లుగా ఓపికగా గమనిస్తున్నామని.. ఇకపై ప్రజా సమస్యలపై గల్లా పట్టి నిలదీస్తామని హరీష్ రావు హెచ్చరించారు. అభివృద్ధి పనుల్లో నిర్లక్ష్యం వహిస్తే బీఆర్ఎస్ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్త నిరసన దీక్షలు చేపడతామని స్పష్టం చేశారు. పేదల సంక్షేమం పట్ల ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని.. కేవలం ప్రచారానికే పరిమితమైందని విమర్శించారు. దేవాదుల ప్రాజెక్టు మిగిలిన 10 శాతం పనులను తక్షణమే పూర్తి చేయాలని.. వరంగల్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని పూర్తిస్థాయిలో అందుబాటులోకి తీసుకురావాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో ప్రజల తరపున పెద్ద ఎత్తున పోరాటం చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.

Read Also: Cm Revanth : బీసీలకు వాగ్దానం.. కేంద్రంతో సీఎం రేవంత్ ‘ఢీ’..!

Related News

Promotion Scam: డీహెచ్ ఆఫీస్‌లో ఘోరం.. ప్రమోషన్ల కోసం కులాన్నే మార్చేసిన అధికారులు..?

సీఎం రేవంత్ రెడ్డి విజన్‌కు జర్మనీ ప్రతినిధులు జేజేలు.. ఎందుకో తెలుసా..?

ఎస్పీడీసీఎల్ డైరెక్టర్‌కు బిగ్ షాక్.. రిటైర్మెంట్ బెనిఫిట్స్ అన్ని బంద్..?

చెరువులో చెట్ల దందా.. ప్రశ్నించిన మహిళా లీడర్‌పై దాడి.. ఫోన్లు లాక్కొని సర్పంచ్ భర్త రౌడీయిజం!

Stubble Burning: రైతు చేసిన చిన్న తప్పుకి.. లక్షల రూపాయల కష్టం నిమిషాల్లో బుగ్గిపాలు..!

కాంగ్రెస్ సర్కార్‌ పై.. నాగం జనార్దన్ రెడ్డి ఫైర్..?

Palamuru: రెండు రోజుల పాటు పాలమూరులోనే సీఎం రేవంత్!

రైతులకు జూన్ 2 కానుక మిస్!: పనులన్నీ పూర్తి చేసినా సాంకేతిక అడ్డంకులు!

Big Stories

×