E-Paper
Advertisement

శాంసంగ్ ఏఐ స్మార్ట్ గ్లాసెస్.. కుర్రకారుకు పండుగే.. ఫొటోలు, వీడియోలు మీ ఇష్టం!

శాంసంగ్ ఏఐ స్మార్ట్ గ్లాసెస్..  కుర్రకారుకు పండుగే.. ఫొటోలు, వీడియోలు మీ ఇష్టం!
Advertisement

Galaxy AI Glasses: ఆధునిక సాంకేతిక యుగంలో ప్రతీది టెక్నాలజీతో అనుసంధానమవుతోంది. టీవీ, ఫ్యాన్, ఫ్రిడ్జ్, వాచెస్, కూలర్ ఇలా అన్నింటిలోనూ స్మార్ట్ ఫీచర్లు అందుబాటులోకి వచ్చాయి. ఈ క్రమంలోనే కళ్లకు ధరించే అద్దాలు సైతం.. ప్రస్తుతం సరికొత్త సాంకేతికతను అందిపుచ్చుకుంటున్నాయి. ఇటీవల మార్కెట్ లోకి వచ్చిన ‘రే-బాన్ మెటా’ (Ray-Ban Meta) అత్యాధునిక ఫీచర్లతో యూత్ ను ఫిదా చేస్తోంది. ఇప్పుడు దానికి గట్టి పోటీ ఇచ్చేందుకు శాంసంగ్ సిద్దమైంది. తన మార్క్ తో సరికొత్త ఏఐ స్మార్ట్ గ్లాసెస్ ను లాంచ్ చేసేందుకు కసరత్తు ప్రారంభించిది.

గెలాక్సీ ఏఐ స్మార్ట్ గ్లాసెస్

శాంసంగ్ తన కొత్త స్మార్ట్ గ్లాసెస్ ను గెలాక్సీ సిరీస్ నుంచి ఏఐ సపోర్ట్ తో తీసుకురాబోతోంది. ఈ ఏడాది ద్వితీయార్థంలో ఈ వాచ్ మార్కెట్ లోకి అందుబాటులోకి వచ్చే ఛాన్స్ ఉన్నట్లు శాంసంగ్ వర్గాలు పేర్కొంటున్నాయి. శాంసంగ్ ఫ్లాగ్ షిప్ గ్యాడ్జెట్స్.. గెలాక్సీ జెడ్ ఫోల్డ్ 8 (Galaxy Z Fold 8), జెడ్ ఫ్లిప్ 8 (Z Flip 8) తో పాటు ఇది కూడా విడుదల కానున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం మార్కెట్ లో దూసుకుపోతున్న ‘రే-బాన్ మెటా’ (Ray-Ban Meta) గట్టిపోటీ ఇచ్చేలా శాంసంగ్ వీటిలో క్రేజీ ఫీచర్లు తీసుకురాబోతున్నట్లు టెక్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

ఏఐ గ్లాసెస్ క్రేజీ ఫీచర్లు..!

Advertisement

గెలాక్సీ ఏఐ స్మార్ట్ గ్లాసెస్ కు సంబంధించిన ఫీచర్లను శాంసంగ్ అధికారికంగా ప్రకటించినప్పటికీ.. కొన్ని మాత్రం ఆన్ లైన్ లో లీకయ్యాయి. టెక్ వెబ్ సైట్స్ కథనాల ప్రకారం.. ఈ స్మార్ట్ గ్లాసెస్ లో 12MP కెమెరా ఉండనుంది. దీని సాయంతో ఫొటోలు, వీడియోలు తీయడమే కాకుండా.. వినియోగదారుడు తాను చూసే వస్తువులను స్కాన్ చేసి వాటి సమాచారాన్ని తెలుసుకునేందుకు వీలు ఉంటుంది. ఇందుకోసం గూగుల్ జెమిని (Gemini AI)తో ఈ గ్లాస్ ను శాంసంగ్ లింకప్ చేసింది.

ఆండ్రాయిడ్ ఎక్స్ఆర్ (Android XR)

గూగుల్ తో కలిసి శాంసంగ్ అభివృద్ధి చేసిన.. ఆండ్రాయిడ్ ఎక్స్ఆర్ సాఫ్ట్ వేర్ తో ఇది పనిచేయననున్నట్లు లీకైన సమాచారాన్ని బట్టి తెలుస్తోంది. క్వాల్ కామ్ ఏఆర్ (Qualcomm AR) చిప్ సెట్ ప్రాసెసర్, నాణ్యమైన ఏఆర్ డిస్ ప్లే, 155mAh బ్యాటరీని సైతం ఈ స్మార్ట్ గ్లాసెస్ కు అందించారు. ఇన్ని అధునాతన ఫీచర్లను ఈ గ్లాసెస్ లో పొందుపరిచినప్పటికీ.. డైలీ యూసేజ్ కు ఇది ఏమాత్రం భారంగా ఉండదని శాంసంగ్ వర్గాలు చెబుతున్నాయి. ఇది కేవలం 50 గ్రాముల బరువు మాత్రమే ఉంటూ.. రోజూవారి అవసరాలకు ఉపయోగపడనుంది. అంతేకాకుండా వార్బీ పార్కర్ (Warby Parker) వంటి ప్రముఖ బ్రాండ్ల సహకారంతో స్టైలిష్ డిజైన్లలో ఈ శాంసంగ్ స్మార్ట్ గ్లాసెస్ రానున్నట్లు తెలుస్తోంది.

Advertisement

Also Read: Regina cassandra : లెహంగాలో క్యూట్ లుక్ లో రెజీనా.. ఏముంది రా బాబు..

రే-బాన్ మెటా కంటే బెటరేనా?

ప్రస్తుతం ఉన్న రే-బాన్ మెటా గ్లాసెస్ ప్రధానంగా ఫోటోలు, వీడియోలు, ఆడియోపై దృష్టి పెట్టింది. కానీ శాంసంగ్ గ్లాసెస్ గూగుల్ ఎకోసిస్టమ్‌తో (Maps, Gemini, Translate) లోతుగా అనుసంధానించబడి ఉండటం వల్ల ఇవి రోజువారీ పనుల్లో మరింత సహాయకారిగా మారతాయని టెక్ నిపుణులు భావిస్తున్నారు. మెుత్తం మీద వేరబుల్ టెక్నాలజీలో శాంసంగ్ తీసుకువస్తున్న ఈ సరికొత్త మార్పు.. స్మార్ట్ గ్లాసెస్ రంగాన్ని మరో స్థాయికి తీసుకెళ్లడం ఖాయమని ధీమా వ్యక్తం చేస్తున్నారు.

Also Read: Ramya Moksha : పచ్చళ్ళ పాప నెలకు ఎంత సంపాదిస్తుందో తెలుసా..? హీరోయిన్ల కన్నా ఎక్కువే..

Related News

స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ ప్రాసెసర్, భారీ బ్యాటరీ.. గేమర్స్ కోసం నెక్ట్స్ లెవెల్ టాబ్లెట్ వచ్చేసింది!

కెమెరా పక్కనే మరో డిస్‌ప్లే.. ఇన్ఫినిక్స్ కొత్త బడ్జెట్ ఫోన్ లుక్ చూశారా?

రెడ్‌మీ నోట్ 17కు రీబ్రాండెడ్‌గా Poco X8, M8 పవర్.. ఫీచర్లు, ధరల వివరాలు ఇవే!

ఇంటిని థియేటర్‌గా మార్చే బెస్ట్ బడ్జెట్ పోర్టబుల్ ప్రొజెక్టర్లు.. ధరలు కూడా బడ్జెట్‌లోనే!

Facebook వాడే ప్రతి ఒక్కరూ మార్చాల్సిన 5 సీక్రెట్ సెక్యూరిటీ సెట్టింగ్స్ ఇవే!

iPhone 18 Pro Max లీక్స్.. ఫీచర్లు చూస్తే మైండ్ బ్లాకే, కానీ ఆ ఒక్కటే పెద్ద ట్విస్ట్!

గేమర్స్‌కు పూనకాలు తెప్పిస్తున్న Oppo K15.. నీళ్లలో పడినా, రఫ్ అండ్ టఫ్ వాడినా తగ్గేదే లేదంట!

సోషల్ మీడియాలో వైరల్ అయ్యే వీడియో రియలా,ఫేకా? తెలుసుకోండిలా!

Big Stories

Advertisement
×