E-Paper
Advertisement

మీ ఇంట్లో బోరు నీళ్లు వాడుతున్నారా? ఉప్పుదనం, బ్యాక్టీరియాకు చెక్ పెట్టే బెస్ట్ ప్యూరిఫైయర్లు ఇవే!

మీ ఇంట్లో బోరు నీళ్లు వాడుతున్నారా? ఉప్పుదనం, బ్యాక్టీరియాకు చెక్ పెట్టే బెస్ట్ ప్యూరిఫైయర్లు ఇవే!
Advertisement

Best Water Purifiers: ప్రస్తుతం చాలా నగరాలు, గ్రామాల్లో బోరుబావి, ట్యాంకర్ నీటిని వాడే కుటుంబాలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య.. నీటిలో TDS స్థాయిలు ఎక్కువగా ఉండటం వల్ల నీరు ఉప్పగా, చేదుగా అనిపించడం. దీంతో ఈ నీటిని తాగడం వల్ల ఆరోగ్యం పాడవుతుందనే ఆందోళనతో చాలామంది ఇళ్లలో అడ్వాన్స్‌డ్ RO వాటర్ ప్యూరిఫైయర్లను ఏర్పాటు చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం మార్కెట్లో ఉన్న బెస్ట్ వాటర్ ప్యూరిఫైయర్లు గురించి తెలుసుకుందాం.

పెరుగుతున్న డిమాండ్:

మార్కెట్లో ఇప్పుడు రకరకాల ఆటోమేటిక్ ప్యూరిఫైయర్లు అందుబాటులోకి వచ్చాయి. వీటిలో ‘ఆక్వాగార్డ్ ఎన్రిచ్ రిట్జ్’ వంటి ప్రీమియం మోడళ్లకు మంచి డిమాండ్ ఉంది. ఇది 9 స్టేజ్ ప్యూరిఫికేషన్‌తో పాటు కాపర్ గుణాలను అందిస్తుంది. అలాగే, నీటి వృధాను తగ్గించాలనుకునే వారికి ‘ప్యూర్ ఇట్ రెవిటో ప్రైమ్’ మంచి ఆప్షన్‌గా నిలుస్తోంది. ఇది నీటిని శుభ్రం చేయడమే కాకుండా.. సాధారణ ఆర్‌ఓల కంటే తక్కువ నీటిని వృధా చేస్తుంది.

బడ్జెట్ ఫ్రెండ్లీ ఆప్షన్స్:

Advertisement

మధ్యతరగతి కుటుంబాలకు ‘కెంట్ గ్రాండ్ ఆర్‌ఓ’ ఎప్పటినుంచో నమ్మకమైన ఎంపికగా ఉంది. దీనిలోని టీడీఎస్ కంట్రోలర్ వల్ల మన ప్రాంతాన్ని బట్టి నీటి రుచిని మార్చుకోవచ్చు. కొంచెం తక్కువ బడ్జెట్‌లో చూసేవారికి ‘ప్యూర్ ఇట్ వేవ్ ప్రైమ్’, ‘ధన్వి ఆక్వా ఫ్రెష్’ వంటివి అందుబాటులో ఉన్నాయి. ఇవి తక్కువ ధరలోనే బోరు నీటిలోని బ్యాక్టీరియా, కెమికల్స్ వంటి ప్రమాదకరమైన వ్యర్థాలను తొలగిస్తాయి.

Also Read: 6000mAh బ్యాటరీ, 7 ఏళ్ల అప్‌డేట్స్‌తో Motorola Razr Fold విడుదల.. ధర ఎంతంటే?

స్మార్ట్ టెక్నాలజీ:

Advertisement

ఇక టెక్నాలజీ ఇష్టపడే వారి కోసం ‘ఆటంబర్గ్ ఇంటెల్లాన్’ సరికొత్త అడాప్టివ్ టెక్నాలజీతో వచ్చింది. ఇది నీటి క్వాలిటీని బట్టి ఆర్‌ఓ ఫిల్ట్రేషన్ ఎప్పుడు అవసరమో అదే నిర్ణయించుకుని.. ఫిల్టర్ల ఆయుష్షును పెంచుతుంది. మొబైల్ యాప్ ద్వారా దీని పనితీరును కూడా ట్రాక్ చేయవచ్చు.

నిపుణులు ఏమంటున్నారంటే?

నీటిలో టీడీఎస్ స్థాయి 500 PPM కంటే ఎక్కువ ఉంటే కచ్చితంగా ఆర్‌ఓ ప్యూరిఫైయర్ వాడాలని నిపుణులు చెబుతున్నారు. అయితే, నీటిని మరీ ఎక్కువగా ఫిల్టర్ చేయడం వల్ల శరీరానికి కావాల్సిన కాల్షియం, మెగ్నీషియం వంటి ఖనిజాలు కోల్పోయే ప్రమాదం ఉంది. అందుకే సరైన సర్వీసింగ్, సమయానికి ఫిల్టర్లు మార్చడం ద్వారానే స్వచ్ఛమైన, ఆరోగ్యకరమైన నీటిని పొందగలమని వారు సూచిస్తున్నారు.

Also Read: రంగులు మార్చే బ్యాక్ ప్యానెల్‌తో Infinix Hot 70.. లుక్స్ మాత్రం అదిరిపోయాయ్ బాసూ!

Related News

ట్రాయ్ దెబ్బకు దిగొచ్చిన Airtel.. కేవలం కాల్స్, ఎస్‌ఎంఎస్‌ల కోసం కొత్త రీఛార్జ్ ప్లాన్లు!

పిక్సెల్ ఫ్యాన్స్‌కు పూనకాలు తెప్పించే న్యూస్.. దీపావళి సేల్‌లో భారీ తగ్గింపులు, నవంబర్ 8 వరకే ఛాన్స్!

ఫ్లిప్‌కార్ట్‌లో iPhone 17పై ఊహించని భారీ తగ్గింపు.. ఇంత తక్కువ ధరకు ఎప్పుడూ చూడలేదు!

వెదర్ రిపోర్ట్స్ ఇకపై వంద శాతం పక్కా.. మైక్రోసాఫ్ట్ సంచలన ప్రయోగం!

ఆకాశంలో ఓ అరుదైన నక్షత్రాన్ని కనిపెట్టిన సైంటిస్టులు.. ఇది ఎరంగులో ఉందంటే..?

సెకండ్ హ్యాండ్ మొబైల్ కొంటున్నారా? మోసపోకూడదంటే ఈ 5 విషయాలు కచ్చితంగా చెక్ చేయండి!

ఓటీపీ షేర్ చేసి పొరపాటు చేశారా? మీ డబ్బు కాపాడుకోవడానికి.. వెంటనే ఈ 5 పనులు చేయండి!

స్మార్ట్‌వాచ్‌ vs ఫిట్‌నెస్ బ్యాండ్.. రెండింటిలో ఫీచర్లు ఒకటేనా? ఏది కొంటే మన డబ్బులు వృధా కావు?

Big Stories

Advertisement
×