E-Paper
Advertisement

వైర్‌లెస్ ఇయర్ బడ్స్ Vs వైర్డ్ ఇయర్‌ఫోన్స్.. ఏది బెస్ట్ చాయిస్?

వైర్‌లెస్ ఇయర్ బడ్స్ Vs వైర్డ్ ఇయర్‌ఫోన్స్.. ఏది బెస్ట్ చాయిస్?
Advertisement

Wireless Earbuds: ప్రస్తుత డిజిటల్ యుగంలో స్మార్ట్‌ఫోన్ వాడే ప్రతి ఒక్కరికీ ఇయర్‌ఫోన్స్ నిత్యజీవితంలో ఒక భాగమైపోయాయి. ఆఫీస్ మీటింగ్‌లు, ఆన్‌లైన్ క్లాసులు, ప్రయాణాల్లో పాటలు వినడం, సినిమాలు చూడడం.. ఇలా దేనికైనా ఇవి తప్పనిసరి. అయితే, మార్కెట్లో ట్రెండ్‌లో ఉన్న వైర్‌లెస్ ఇయర్ బడ్స్ కొనాలా? లేక సాంప్రదాయ వైర్డ్ ఇయర్‌ఫోన్స్ వైపు వెళ్ళాలా? అనే గందరగోళం చాలామందిలో ఉంటుంది. ఈ రెండింటిలో ఏది బెటరో ఈ పూర్తి విశ్లేషణలో తెలుసుకుందాం.

Read also-ఇల్లే ఏసీలా మారుతుంది! లివింగ్ రూమ్ కోసం.. తక్కువ ధరలో సీలింగ్ ఫ్యాన్లు

వైర్‌లెస్ ఇయర్ బడ్స్ గురించి అయితే..

Advertisement

బ్లూటూత్ టెక్నాలజీతో పనిచేసే ఇయర్ బడ్స్ నేటి యువతను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. వీటికి ఎలాంటి వైర్లు ఉండవు కాబట్టి, జేబులో వేసుకున్నప్పుడు ముడులు పడిపోతాయనే టెన్షన్ ఉండదు. ముఖ్యంగా జిమ్, రన్నింగ్, వాకింగ్ వంటి ఫిట్‌నెస్ యాక్టివిటీస్ చేసేవారికి మరియు నిరంతరం ప్రయాణాలు చేసేవారికి ఇవి అద్భుతమైన ప్రీడమ్ ను ఇస్తాయి. ఫోన్ టేబుల్‌పై ఉంచి, మనం గదిలో ఎక్కడికైనా తిరుగుతూ మాట్లాడుకోవచ్చు. అదనంగా, వీటిలో వచ్చే యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ (ANC) ఫీచర్ చుట్టుపక్కల ఉండే రోడ్డు ట్రాఫిక్ సౌండ్స్‌ను ఫిల్టర్ చేసి, ప్రశాంతమైన ఆడియో అనుభూతిని అందిస్తుంది. అయితే, వీటికి క్రమం తప్పకుండా ఛార్జింగ్ పెట్టాల్సి ఉంటుంది. ఛార్జింగ్ అయిపోతే ఇవి అస్సలు పనిచేయవు. అలాగే, చిన్నగా ఉండటం వల్ల చెవిలోంచి జారిపడినా, ఎక్కడైనా మర్చిపోయినా వెతకడం కష్టం. వీటి ధర కూడా వైర్డ్ వాటితో పోలిస్తే ఎక్కువే ఉంటుంది.

వైర్డ్ ఇయర్‌ఫోన్స్..

దశాబ్దాలుగా వాడుకలో ఉన్న వైర్డ్ ఇయర్‌ఫోన్స్‌కు నేటికీ ప్రత్యేకమైన ఆదరణ ఉంది. సాంకేతికంగా చూస్తే, వైర్డ్ ఇయర్‌ఫోన్స్ అందించే ప్యూర్ ఆడియో క్వాలిటీని అందుకోవడం బ్లూటూత్ డివైజ్‌లకు కాస్త కష్టమే. వైర్ ద్వారా నేరుగా ఆడియో సిగ్నల్స్ అందుతాయి కాబట్టి సౌండ్ ఏమాత్రం డ్రాప్ అవ్వదు. వీటికి బ్యాటరీతో పనిలేదు కాబట్టి ఛార్జింగ్ పెట్టుకోవాలనే తిప్పలు ఉండవు. గంటల తరబడి నిరంతరాయంగా వాడుకోవచ్చు. ముఖ్యంగా గేమర్స్, వీడియో ఎడిటర్లకు ఇవి ప్రాణప్రదం. ఎందుకంటే బ్లూటూత్‌లో ఉండే ఆడియో లాగ్ సమస్య వైర్డ్ వాటిలో అస్సలు ఉండదు. పైగా, వందల రూపాయల బడ్జెట్‌లోనే మంచి బ్రాండెడ్ వైర్డ్ ఇయర్‌ఫోన్స్ లభిస్తాయి. అయితే, వీటి వైర్లు చిక్కుపడిపోవడం, వైర్ లోపల కట్ అయి ఒకవైపే సౌండ్ రావడం వంటి మైనస్ పాయింట్లు ఉన్నాయి. ప్రస్తుతం వస్తున్న లేటెస్ట్ ఫోన్లలో 3.5mm ఆడియో జాక్ తీసేస్తుండటం వల్ల వీటికి ప్రత్యేకంగా కన్వర్టర్ వాడాల్సి వస్తోంది. అంతే కాకుండా టైప్ సీ తో వైర్డ్ ఇయర్ ఫోన్స్ వస్తున్నాయి. ప్రస్తుతం సెలబ్రిటీలు మొత్తం ఇవే వాడుతున్నారు.

Advertisement

Read alsoJio Plans: జియో మైండ్ బ్లోయింగ్ ప్లాన్.. ఒక్క రీఛార్జ్‌తో 13 ఓటీటీ యాప్స్ ఫ్రీ!

ఏది ఎంచుకోవాలి?

ముగింపుగా చెప్పాలంటే.. మీ ప్రాధాన్యత కంఫర్ట్, స్టైల్, వైర్లు లేని స్వేచ్ఛ ప్రయాణాలు అయితే కాస్త బడ్జెట్ పెంచి మంచి ఇయర్ బడ్స్ కొనుక్కోవడం ఉత్తమం. అలా కాకుండా, మీ ప్రాధాన్యత కేవలం ప్యూర్ ఆడియో క్వాలిటీ, జీరో లాటెన్సీ గేమింగ్, తక్కువ బడ్జెట్ మరియు ఛార్జింగ్ పెట్టే ఓపిక లేకపోవడం అయితే వైర్డ్ ఇయర్‌ఫోన్స్ మీకు పర్ఫెక్ట్ ఛాయిస్. మీ రోజువారీ అవసరాలను బట్టి సరైన దాన్ని ఎంచుకోండి.

Related News

ఈ సీక్రెట్ ట్రిక్స్ తెలిస్తే.. రోజంతా ఏసీ, ఫ్రిజ్ వాడినా కరెంట్ బిల్లు సగమే!

ట్రెండింగ్ vs యూజ్‌ఫుల్.. గ్యాడ్జెట్స్ కొనేముందు ఈ క్లారిటీ లేకపోతే డబ్బులు వేస్టే!

ఫోన్ ధర రూ.1.68 లక్షలు.. అయినా తగ్గదేలే అంటున్న జనాలు, iPhone Duoలో అంతలా ఏముంది?

చేతిలో ఇమిడిపోయే ప్రింటర్‌ తెచ్చిన షావోమీ.. దీని స్మార్ట్ ఫీచర్లు చూస్తే ఎవరైనా వావ్ అనాల్సిందే!

మన మాటల్ని సీక్రెట్‌గా రికార్డ్ చేసే AI డివైజ్‌లు.. అమెజాన్ కొత్త ప్రయోగం ఇదే!

ఒక్క రూపాయి ఖర్చు లేకుండా క్రెడిట్ కార్డ్ పాయింట్లను క్యాష్‌గా మార్చడం ఎలా?

నకిలీ QR కోడ్‌లను స్కాన్ చేసే ముందే ఇలా కనిపెట్టండి.. ఈ చిన్న ట్రిక్ తెలిస్తే మీ డబ్బు సేఫ్!

గూగుల్ ప్లేస్టోర్‌లో ఫేక్ వాట్సప్ యాప్.. అసలైనదో కాదో ఎలా గుర్తించాలి?

Big Stories

Advertisement
×