E-Paper
Advertisement

రంగులు మార్చే బ్యాక్ ప్యానెల్‌తో Infinix Hot 70.. లుక్స్ మాత్రం అదిరిపోయాయ్ బాసూ!

రంగులు మార్చే బ్యాక్ ప్యానెల్‌తో Infinix Hot 70.. లుక్స్ మాత్రం అదిరిపోయాయ్ బాసూ!
Advertisement

Infinix Hot 70 Series: బడ్జెట్ ధరలో మంచి ఫోన్లని పరిచయం చేసే ఇన్ఫినిక్స్ బ్రాండ్.. ఇప్పుడు మార్కెట్లోకి సరికొత్త సిరీస్‌ను తీసుకురావడానికి రెడీ అయిపోయింది. Infinix Hot 70 Series పేరుతో వస్తున్న ఈ ఫోన్లను మే 25న గ్లోబల్‌గా లాంచ్ చేయబోతున్నారు. ఇందులో Hot 70, Hot 70 Pro అనే రెండు మోడల్స్ ఉండే అవకాశం ఉంది. తక్కువ బడ్జెట్‌లో ప్రీమియం లుక్, అదిరిపోయే ఫీచర్లు కోరుకునే కాలేజ్ స్టూడెంట్స్, యువతను దృష్టిలో పెట్టుకుని కంపెనీ వీటిని తీసుకొస్తోంది.

లైటింగ్‌ను బట్టి రంగులు మారే డిజైన్:

ఈ ఫోన్లలో అందరినీ బాగా ఆకట్టుకుంటున్న విషయం ఏంటంటే దీని డిజైన్. వెలుతురు పడినప్పుడు, చూసే యాంగిల్‌ను బట్టి కలర్ మారే గ్లోసీ బ్యాక్ ప్యానెల్‌ను దీనికి ఇస్తున్నారు. ప్రీమియం ఫ్లాగ్‌షిప్ ఫోన్లలా కనిపించే కెమెరా సెటప్, స్టైలిష్ లుక్ ఉండటంతో సోషల్ మీడియాలో ఈ ఫోన్లపై అప్పుడే తెగ డిస్కషన్స్ నడుస్తున్నాయి.

50 మెగాపిక్సల్ కెమెరా:

Advertisement

ఇక ఫోన్‌లో సినిమాలు చూసేవారికి, గేమర్స్‌కి నచ్చేలా స్మూత్‌గా సాగిపోయే హై రిఫ్రెష్ రేట్ డిస్‌ప్లేను ఇస్తున్నారు. అలాగే ఫొటోల విషయానికి వస్తే.. AI సపోర్ట్ ఉన్న 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా ఉండబోతోంది. నైట్ మోడ్‌ను కూడా బాగా అప్‌డేట్ చేయడంతో, చీకట్లో లేదా తక్కువ వెలుతురులో కూడా ఫొటోలు చాలా క్లారిటీగా వస్తాయి.

Also Read: రూ.9 వేలకే మిలిటరీ గ్రేడ్ డిజైన్.. ఐటెల్ నుంచి కింద పడినా చెక్కుచెదరని కొత్త మొబైల్ లాంచ్!

భారీ బ్యాటరీ సామర్థ్యం:

Advertisement

ఇన్ఫినిక్స్ ఫోన్లంటేనే బ్యాటరీ లైఫ్ చాలా బాగుంటుంది. ఆ నమ్మకాన్ని నిలబెడుతూ ఈ సిరీస్‌లో ఏకంగా 6000mAh పెద్ద బ్యాటరీని ఇస్తున్నారు. పొద్దున్నుంచి రాత్రి దాకా ఫోన్‌ను రఫ్ అండ్ టఫ్‌గా వాడేసే వాళ్లకు కూడా ఇది ఈజీగా ఒక రోజు మొత్తం వచ్చేస్తుంది. దీనికి తోడు ఫోన్ ఫాస్ట్‌గా ఛార్జ్ అవ్వడానికి మంచి ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా ఉండనుంది.

స్మార్ట్ ఏఐ ఫీచర్లు:

ఇప్పుడు ఎక్కడ చూసినా ఏఐ ట్రెండ్ నడుస్తోంది కదా.. అందుకే ఇన్ఫినిక్స్ కూడా తమ లేటెస్ట్ XOS సాఫ్ట్‌వేర్ ద్వారా కొన్ని క్రేజీ ఏఐ ఫీచర్లను ఇస్తోంది. ఇక ఫొటోలను అందంగా మార్చడం, బ్యాటరీ సేవ్ చేయడం లాంటివి ఇవి చూసుకుంటాయి. తక్కువ ధరలో స్టైలిష్ ఫోన్ కొనాలనుకునే మిడిల్ క్లాస్ ఆడియన్స్‌కు ఈ ఇన్ఫినిక్స్ హాట్ 70 సిరీస్ ఒక మంచి ఆప్షన్ కానుంది.

Also Read: ఫ్లిప్‌కార్ట్‌లో కాక రేపుతున్న Motorola Edge 70 Pro Plus.. డిజైన్ చూస్తే పిచ్చెక్కిపోవాల్సిందే!

Related News

అదే జరిగితే.. ఈ నగరాలన్నీ కనుమరుగు? వరద ఎన్ని ‘అంతస్తుల ఎత్తు’లో దూసుకెళ్తుందంటే?

స్టైలిష్ లుక్..అల్టిమేట్ సౌండ్,యూత్‌ను ఫిదా చేస్తున్న సౌండ్ బార్

పాకెట్ సైజ్ బడ్జెట్ పవర్ బ్యాంక్..రూ.898కే బెస్ట్ మోడల్

నీళ్లు, చెత్తను ఒకేసారి శుభ్రం చేసే..అద్భుతమైన టూల్!

రూ.10వేలకే.. శామ్‌సంగ్ వాషింగ్ మెషీన్,ఆఫర్ కొన్ని రోజులే!

రూ.5,290 ధరకే 30W బేస్ స్మార్ట్ టీవీ..ఇక ఇల్లు దద్దరిల్లిపోవాల్సిందే !

రూ.7,490 కే 7.5 కేజీల కెపాసిటీనా? ఇంతమంచి వాషింగ్ మెషీన్ అస్సలు మిస్సవ్వొద్దు

చార్జింగ్ టెన్షన్ లేదు, లుక్ అద్దిరిపోతుంది.. ఈ ట్రెండింగ్ స్మార్ట్‌వాచ్ మీకోసమే!

Big Stories

Advertisement
×