E-Paper
Advertisement

దేవాదాయ శాఖ చరిత్రలోనే ఇదో కీలక అడుగు.. ఇక ఆ సమస్యకు చెక్..!

దేవాదాయ శాఖ చరిత్రలోనే ఇదో కీలక అడుగు.. ఇక ఆ సమస్యకు చెక్..!
Advertisement

Temple Lands: స్వేచ్ఛ బ్యూరో: రాష్ట్రంలో దేవుడు మాన్యాల పరిరక్షణ దేయంగా ప్రభుత్వం త్వరలోనే సంచలన నిర్ణయం తీసుకోబోతుంది. ఏళ్ల తర్వాత కోర్టు కేసుల్లో చిక్కుకొని అన్యకాంతం అవుతున్న ఆలయ భూములను కాపాడేందుకు జిల్లాకు లీగల్ అడ్వైజర్ వ్యవస్థను తీసుకురాబోతుంది. దేవాదాయ శాఖ చరిత్రలో ఇలాంటి ఒక ప్రత్యేక న్యాయ విభాగం ఏర్పాటు అవుతుండడం ఇదే తొలిసారి. రాష్ట్రవ్యాప్తంగా 87,235.39 ఎకరాల భూములు ఉండగా.. అందులో సుమారు 25 వేల ఎకరాలకు పైగా భూమి కబ్జాదారుల చేతుల్లో ఉండటంతో ప్రభుత్వం ఈ కఠిన నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం.

ఆదాయానికి భారీగా గండి..

రాష్ట్రంలో ధూప, దీప నైవేద్యాల కోసం పూర్వం కేటాయించిన భూములు కబ్జాదారుల పాలవుతున్నాయి. అధికారుల లెక్కల ప్రకారం.. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం ఆలయ భూములు 87,235.39 ఎకరాలు ఉండగా.. 20,124.03 ఎకరాలు ఆక్రమణదారుల చెరలో ఉన్నాయి. 5,569.35 ఎకరాలు లిటిగేషన్​ లేకుండా కబ్జాలో ఉన్నాయి. అయితే, కోర్టు వివాదాలు, స్థానిక బలవంతుల కబ్జాల కారణంగా ఆలయాలకు రావాల్సిన ఆదాయానికి భారీగా గండి పడుతోంది. కొన్ని చోట్ల రెవెన్యూ రికార్డుల్లో స్పష్టత లేకపోవడాన్ని ఆసరాగా చేసుకుని భూ మాఫియా తప్పుడు పత్రాలు సృష్టిస్తోంది. ఇప్పటివరకు ఏదైనా న్యాయపరమైన చిక్కులు వస్తే జిల్లా అధికారులు రాష్ట్రస్థాయి కార్యాలయంపై లేదా ఏజీ ఆఫీసుపై ఆధారపడాల్సి వచ్చేది. ఇకపై ఆ అవసరం లేకుండా జిల్లా స్థాయిలోనే లీగల్ అడ్వైజర్లు అందుబాటులో ఉంటారు. పెండింగ్‌లో ఉన్న కేసులపై ప్రత్యేక దృష్టిసారించి, కౌంటర్ అఫిడవిట్లు దాఖలు చేయడం, బలంగా వాదనలు వినిపించడం వీరి బాధ్యత. ఈ లీగల్ అడ్వైజర్లకు విశ్వాసనీయ సమాచారం. ఆక్రమణదారులకు నోటీసులు పంపడం, ‘ఎన్​క్రోచ్​మెంట్ యాక్ట్’ కింద కేసులు నమోదు చేయించడంలో అధికారులకు దిశానిర్దేశం చేస్తారు. రెవెన్యూ శాఖతో కలిసి భూముల టైటిల్స్ క్లియర్ అయ్యేలా చూడటం, ఆలయ భూములను నిషేధిత జాబితాలో చేర్పించే ప్రక్రియను వేగవంతం చేయబోతున్నట్లు సమాచారం.

Advertisement

Also Read: రక్తంలో హిమోగ్లోబిన్ లోపం ఉందా? ఈ ఫుడ్స్ తింటే రక్తహీనత సమస్యకు చెక్

ఏదైనా లీగల్ సమస్య..

భూములు ఆక్రమణకు గురికాకుండా ఉండటానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? లీజు గడువు ముగిసిన వారిని ఎలా ఖాళీ చేయించాలి? వంటి అంశాలపై ఆలయ ఈఓలకు లీగల్ అడ్వైజర్లు దిశానిర్దేశం చేస్తారని అధికారులు తెలిపారు. ఇప్పటివరకు ఏదైనా లీగల్ సమస్య వస్తే రాష్ట్రస్థాయి కార్యాలయంపై లేదా ఏజీ కార్యాలయంపై ఆధారపడాల్సి వచ్చేది. దీనివల్ల సమయం వృథా అయ్యేది. అంతేకాకుండా ఏ భూమిపై ఏ కేసు విచారణకు వస్తుందని అంశాలు సైతం రాష్ట్రస్థాయి అధికారులకు తెలియడంలో కొంత జాతీయం జరుగుతుందనే సమాచారం. దీంతో ఆక్రమణదారులకు వరంగా మారుతుండడం, ఆలయ భూములు ఆక్రమణకు ఇది కారణం అవుతుండడంతోనే..ఇప్పుడు జిల్లాకో అడ్వొకేట్‌ను నియమించడం వల్ల స్థానిక కోర్టుల్లో, ట్రిబ్యునల్స్‌లో కేసులు వేగవంతం కానున్నాయి. స్థానిక పరిస్థితులపై అవగాహన ఉండటం వల్ల భూ మాఫియా ఎత్తులను సమర్థవంతంగా అడ్డుకునే అవకాశం ఉంటుందని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

జిల్లాల్లో భూముల ధరలు అధికం..

Advertisement

న్యాయ నిపుణుల పర్యవేక్షణలో భూముల రక్షణ జరిగితే.. ఆ భూముల ద్వారా వచ్చే ఆదాయం ఆలయాల అభివృద్ధికి, ధార్మిక కార్యక్రమాలకు దోహదం చేయనుందని పలువురు అధికారులు పేర్కొంటున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 20,124.03 ఎకరాలు ఆక్రమణలకు గురికాగా.. వితౌట్ లిటిగేషన్ తో మరో 5,569.35 ఎకరాలు కబ్జాకు గురైనట్లు ఎండోమెంట్​ అధికారులు గుర్తించి ఇప్పటికే ప్రభుత్వానికి నివేదిక అందజేశారు. ఆయా జిల్లాల్లో భూముల ధరలు అధికంగా ఉండటంతో భూములకు రక్షణ చర్యలు చేపట్టేకపోతే దేవాలయాల మనుగడే ప్రశ్నార్థకమవుతుందని భావించిన ప్రభుత్వం జిల్లాకు అడ్వైజర్‌ను నియమించాలని నిర్ణయం తీసుకున్నది. ఇది కార్యరూపం దాల్చితే జిల్లాలో దేవాదాయ శాఖకు చెందిన భూములను ఆక్రమణ గురికాకుండా కాపాడే అవకాశం ఉంటుంది.

Also Read: హైకోర్టు తీర్పుతో కాళేశ్వరం అవినీతి ఆరోపణలు పటాపంచలు: కేటీఆర్

Related News

రేవంత్ సర్కార్ కొత్త పథకం.. క్యూర్ పరిధిలో ఎల్ఐజి ఇళ్లకు శ్రీకారం, 10 అంతస్తుల టవర్ల నిర్మాణం

తెలంగాణలో బీజేపీ నెక్స్ట్ టార్గెట్ అదే.. కేడర్‌కు రాంచందర్ రావు రూట్ మ్యాప్!

Bandi Sanjay: తెలంగాణ పాలిటిక్స్‌లో సంచలనం.. కేంద్ర మంత్రి లలన్ సింగ్‌కు బండి సంజయ్ లేఖ!

Voter List Revision: డబుల్ ఓట్లకు చెక్ పెట్టేలా.. ఎన్నికల సంఘం కొత్త యాప్ ఇదే!

రైతులకు గుడ్ న్యూస్.. భూసేకరణ పరిహారంపై మంత్రి ఉత్తమ్ కీలక ఆదేశాలు!

భార్య ప్రైవేట్ వీడియో భర్తకే పంపి.. తోటి ఆఫీసర్‌పై ఐపీఎస్ ట్రైనీ లైంగిక వేధింపులు!

Jawaharnagar: ప్లాట్ల పేరుతో భారీ మోసం.. డబ్బులతో రాత్రికి రాత్రే పరార్..!

బండి, ఈటల రాజీపడితే రాజ్యం వచ్చేస్తుందా? బీజేపీపై రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×