E-Paper
Advertisement

మార్కెట్లోకి వచ్చేసిన OnePlus Pad 4.. రూ. 5,000 డిస్కౌంట్.. ధర, ఫీచర్ల వివరాలివే!

మార్కెట్లోకి వచ్చేసిన OnePlus Pad 4.. రూ. 5,000 డిస్కౌంట్.. ధర, ఫీచర్ల వివరాలివే!
Advertisement

OnePlus Pad 4: ప్రముఖ టెక్ బ్రాండ్ వన్ ప్లస్ (OnePlus) సంస్థ.. తన లేటెస్ట్ ఫ్లాగ్ షిప్ టాబ్లెట్ ను భారత మార్కెట్లో విడుదల చేసింది. ‘వన్ ప్లస్ ప్యాడ్ 4’ OnePlus Pad 4) పేరుతో దీనిని అందుబాటులోకి తీసుకొచ్చింది. అంతేకాకుండా దీనిపై పలు ఆఫర్లను సైతం ప్రకటించింది. వాస్తవానికి ఏప్రిల్ 30వ తేదీనే ఈ ప్యాడ్ ను వన్ ప్లస్ లాంచ్ చేసింది. అయితే అవి ఇవాళ నుంచి మార్కెట్లో అందుబాటులోకి వచ్చాయి. ఈ నేపథ్యంలో రాయితీ వివరాలు, ప్యాడ్ కు సంబంధించి క్రేజీ ఫీచర్ల గురించి ఈ కథనంలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

మే 5 నుంచే సేల్స్..

OnePlus Pad 4 సేల్స్ నేటి (మే 5వ తేదీ) నుంచి భారత్ లో ప్రారంభమయ్యాయి. రెండు వేరియంట్లలో దీనిని కొనుగోలు చేయవచ్చు. 8జీబీ ర్యామ్ + 256 జీబీ స్టోరేజ్ కలిగిన బేసిక్ వేరియంట్ ధరను రూ. 59,999గా వన్ ప్లస్ నిర్ణయించింది. అలాగే ప్రీమియం మోడల్ (12జీబీ ర్యామ్ + 512జీబీ స్టోరేజ్) ను రూ.64,999కు సేల్ లో అందుబాటులో ఉంటుంది. అమెజాన్, ఫ్లిప్ కార్ట్ తో పాటు వన్ ప్లస్ అధికారిక వెబ్ సైట్ (OnePlus.in) దీనిని కోలుగు చేయవచ్చు. ఇది డ్యూన్ గ్లో (Dune Glow), సాగె మిస్ట్ (Sage Mist) కలర్ ఆప్షన్ లో లభిస్తోంది.

లాంచ్ ఆఫర్లు

Advertisement

OnePlus Pad 4 సేల్స్ మెుదలైన నేపథ్యంలో ఇంట్రస్టింగ్ లాంచ్ ఆఫర్లనువన్ ప్లస్ ప్రకటించింది. ఎంపిక చేసిన బ్యాంక్ కార్డులపై రూ.5,000 వరకు ఇన్ స్టంట్ డిస్కౌంట్ ను అందిస్తోంది. ఫలితంగా రూ.54,999కే (బేసిక్ వేరియంట్) ప్యాడ్ 4ను సొంతం చేసుకోవచ్చు. లాంచ్ ఆఫర్ లో భాగంగా రూ.5.499 విలువైన వన్ ప్లస్ స్టైలో ప్రో (OnePlus Stylo Pro)ను ఉచితంగా కస్టమర్లు సొంతం చేసుకోవచ్చు. దీంతో పాటు 6 నెలల వరకు నో కాస్ట్ ఈఎంఐ (No Cost EMI) సౌకర్యం కూడా దీనిపై లభిస్తుంది.

ప్యాడ్ 4.. హైలెట్ ఫీచర్లు

వన్ ప్లస్ ప్యాడ్ 4 ఫీచర్ల విషయానికి వస్తే.. ఇది 13.2 అంగుళాల 3.4K LCD స్క్రీన్ కలిగి ఉంది. దీనికి 144Hz రిఫ్రెష్ రేట్, 1000 నిట్స్ గరిష్ట బ్రైట్‌నెస్‌ అంచారు. స్నాప్ డ్రాగన్ 8 ఎలైట్ జెన్ 5 (Snapdragon 8 Elite Gen 5) చిప్‌సెట్‌, ఆండ్రాయిడ్ 16 ఆధారిత ఆక్సిజన్ ఓఎస్ 16 (OxygenOS 16) తో ఇది వర్క్ చేయనుంది. ఇందులో ఏఐ రైటర్, ఏఐ సమ్మరీ వంటి సరికొత్త AI ఫీచర్లను సైతం పొందుపరిచాయి.

Advertisement

Also Read: లెనిన్ మూవీ నుండి భాగ్యశ్రీ బర్తడే స్పెషల్ పోస్టర్.. గెటప్ చూస్తే అనుమానం గ్యారంటీ!

13,380mAh బిగ్ బ్యాటరీ

వన్ ప్లస్ ప్యాడ్ 4ను 13,380mAh బిగ్ బ్యాటరీతో తీసుకొచ్చారు. ఇది 80W సూపర్ వుక్ ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. ఒక్కసారి ఛార్జ్ చేస్తే 20 గంటల వీడియో ప్లేబ్యాక్ వస్తుందని కంపెనీ వర్గాలు ప్రకటించాయి. మరోవైపు వీడియో కాల్స్ కోసం వెనుక వైపు 13ఎంపీ కెమెరా, ముందువైపు 8ఎంపీ సెల్ఫీ కెమెరాను అమర్చారు. దీనిలోని 8 స్పీకర్ల సెటప్ (Spatial Audio) మంచి సౌండింగ్ అనుభవాన్ని ఇస్తుందని వన్ ప్లస్ వర్గాలు చెబుతున్నాయి.

Also Read: నిర్మాత ఆర్.బి చౌదరి మృతి.. సంతాపం తెలిపిన ప్రముఖ స్టార్ హీరో టీమ్!

Related News

గేమర్స్‌కు పూనకాలు తెప్పిస్తున్న Oppo K15.. నీళ్లలో పడినా, రఫ్ అండ్ టఫ్ వాడినా తగ్గేదే లేదంట!

సోషల్ మీడియాలో వైరల్ అయ్యే వీడియో రియలా,ఫేకా? తెలుసుకోండిలా!

బడ్జెట్ ధరలో బెస్ట్ 3-డోర్ ఫ్రిజ్.. వర్ల్‌పూల్ ప్రోటాన్ రివ్యూ

రూ.1,599 కే బెస్ట్ ఇయర్‌బడ్స్..హెవీ బేస్‌తో మార్కెట్ షేక్!

మార్కెట్‌ను షేక్ చేస్తున్న 43 ఇంచుల టీవీ.. ఫీచర్స్ నెక్స్ట్ లెవెల్!

కేవలం రూ. 999 కే హెడ్‌ఫోన్స్..సౌండ్ క్వాలిటీ చూస్తే పిచ్చెక్కిపోవాల్సిందే!

రూ.6వేలలోపు టాప్ క్లాస్.. బ్రాండెడ్ వాషర్ ..మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్‌కి పండగే

బిగ్ డిస్‌ప్లే స్మార్ట్‌వాచ్.. బ్లూటూత్ కాలింగ్ ఫీచర్లతో దుమ్మురేపుతోంది!

Big Stories

Advertisement
×