Ola vs Uber vs Bharat Taxi | పెద్ద నగరాల్లో క్యాబ్ లేదా ఆటో బుక్ చేసేటప్పుడు ధర, పికప్, ప్రయాణ సమయం, యూజర్ ఎక్స్‌పీరియన్స్ చాలా ముఖ్యమైన అంశాలు. దేశంలో ప్రధాన నగరాలన్నింటిలో ప్రస్తుతం భారత్ టాక్సీ, ఓలా, ఉబర్, రాపిడో యాప్స్ ట్యాక్సీ సేవలు అందిస్తున్నాయి. అయితే ఒకే రూట్‌కు ధరలు పోల్చి చూస్తే చాలా తేడా కనిపిస్తుంది. ఇటీవల ఒకే సమయంలో, ఒకే పికప్ పాయింట్ నుంచి ఒకే గమ్యస్థానానికి ధరలు చెక్ చేశారు. ఆటో, బైక్, బేసిక్ క్యాబ్ కేటగిరీలలో ఈ పోలికను పరిశీలించారు.
ఒకే పికప్ పాయింట్, దాదాపు ఒకే గమ్యస్థానం ఎంచుకున్నారు. అన్ని యాప్‌లలో ఒకే సమయంలో ధరలు చూశారు. ఆటో, బైక్, బేసిక్ క్యాబ్ ఆప్షన్లపై దృష్టి పెట్టారు. ట్రాఫిక్, డిమాండ్ వల్ల ధరలు కొద్దిగా మారవచ్చు. ఇది రియల్-టైమ్ యాప్ డేటా పోలిక మాత్రమే.
భారత్ టాక్సీ కోఆపరేటివ్ రైడ్-హైలింగ్ మోడల్‌పై నడుస్తుంది. డ్రైవర్లు ఏ కమిషన్ చెల్లించాల్సిన అవసరం లేదు. భాగస్వాములుగా ఉంటారు. దీని వల్ల ప్రయాణికులకు చాలా తక్కువ ధరలోనే రైడ్ లభిస్తుంది. బైక్, ఆటో, ఎకానమీ క్యాబ్ ఆప్షన్లు ఉన్నాయి. ఈ పోలికలో భారత్ టాక్సీ అతి తక్కువ ధరలు చూపించింది. పీక్ అవర్స్‌లో సర్జ్ ప్రైసింగ్ (ధర పెంచడం) జరగదు. ధరలు స్థిరంగా ఉంటాయి. ప్రభుత్వ మద్దతు ఉండటం వల్ల కొందరికి నమ్మకం ఎక్కువ.
ఉబర్‌లో గో, సెడాన్, ఆటో, XL ఆప్షన్లు ఉన్నాయి. భారత్ టాక్సీ కంటే ధరలు చాలా ఎక్కువగా ఉన్నాయి. పికప్ టైమ్, డ్రైవర్ అందుబాటు బాగుంటాయి. నెట్‌వర్క్ పెద్దది, రిలయబుల్. కానీ పీక్ అవర్స్‌లో సర్జ్ ప్రైసింగ్ వల్ల ధరలు పెరుగుతాయి. డ్రైవర్ క్యాన్సిలేషన్లు కూడా ఎక్కువగా ఉంటాయి. స్పీడ్, స్కేల్ మీద ఉబర్ దృష్టి పెడుతుంది.
ఓలాలో ఆటో, మినీ, సెడాన్, బైక్ ఆప్షన్లు ఉన్నాయి. ఆటో ధరలు భారత్ టాక్సీ, రాపిడో కంటే ఎక్కువగా ఉన్నాయి. కనీస ఛార్జీ, క్యాన్సిలేషన్ ఛార్జీలు జోడిస్తారు. ఇవి ఫైనల్ ధరను పెంచుతాయి. చాలా ఏరియాల్లో వాహనాల అందుబాటు బాగుంటుంది. కవరేజ్ కోసం కొందరు ఓలాను ఇష్టపడతారు.
రాపిడో ప్రధానంగా బైక్, ఆటో రైడ్స్ మీద దృష్టి పెడుతుంది. ట్రాఫిక్ ఎక్కువగా ఉన్న చిన్న దూరాలకు బాగుంటుంది. ఆటో ధరలు.. భారత్ టాక్సీ కంటే కొంచెం ఎక్కువ, ఓలా, ఉబర్ కంటే తక్కువగా ఉన్నాయి. అయితే కొన్ని సార్లు డ్రైవర్లు యాప్‌లో చూపిన ధరకు రైడ్ అంగీకరించరనే ఫిర్యాదులున్నాయి. అదనంగా చెల్లించమని డిమాండ్ చేస్తారు. ఇది యూజర్ ఎక్స్‌పీరియన్స్‌ని ప్రభావితం చేస్తుంది.
Also Read: ఏఐతో భయపడాల్సిన అవసరం లేదు.. ఈ ఉద్యోగాలు పూర్తిగా సురక్షితం
యాప్‌లో చూపిన ధరలు ఫైనల్ కావు. ట్రాఫిక్, డిమాండ్, డ్రైవర్ అందుబాటు, సర్జ్ ప్రైసింగ్ వల్ల ధరలు మారతాయి. పీక్ అవర్స్‌లో ధరలు ఎక్కువగా ఉంటాయి. ధరతో పాటు రైడ్ క్యాన్సిలేషన్లు, పికప్ ఆలస్యం కూడా యూజర్ సంతృప్తిని ప్రభావితం చేస్తాయి.
ఈ పోలికలో భారత్ టాక్సీ అతి చౌక ధరలు ఇచ్చింది. కోఆపరేటివ్ మోడల్ వల్ల ధరలు తక్కువగా ఉంటాయి. సమయాన్ని బట్టి ధరలు పెంచే విధానం లేకపోవడం ప్రయాణికులకు బాగుంటుంది. ఓలా, ఉబర్, రాపిడో నెట్‌వర్క్ సైజు, వాహనాల అందుబాటులో ముందున్నాయి. చౌక ధర కావాలంటే భారత్ టాక్సీ, త్వరగా పికప్ కావాలంటే ఉబర్ లేదా ఓలా బెటర్. రోజూ ప్రయాణం చేసేవారు అన్ని యాప్‌లలో చెక్ చేసి బుక్ చేయడం బెస్ట్.