E-Paper
Advertisement

Crime News: విజయవాడలో దారుణం.. ప్రేమించానని వివాహితకు వేధింపులు.. చివరకు విషమిచ్చి

Crime News: విజయవాడలో దారుణం.. ప్రేమించానని వివాహితకు వేధింపులు.. చివరకు విషమిచ్చి
Advertisement

Crime News: దారుణం.. ప్రేమ పేరుతో వేధింపులు.. వివాహితపై యువకుడి ఘాతుకం.. అయితే పూర్తి వివరాల్లోకి వెళితే.. కృష్ణా జిల్లా పమిడిముక్కల మండలానికి చెందిన ఒక యువతికి గతేడాది ఏప్రిల్ నెలలో వివాహమైంది. అయితే, ఆమెకు పరిచయమున్న భవానీశంకర్ అనే వ్యక్తి ‘నిన్ను ప్రేమిస్తున్నాను’ అంటూ ఆమె వెంట పడటంతో సమస్యలు మొదలయ్యాయి. ఆమె కాపురంలో చిచ్చు పెట్టాలనే ఉద్దేశంతో, నిందితుడు ఆమె భర్తకు ఫోన్ చేసి తప్పుడు ఆరోపణలు చేశాడు. దీనివల్ల భార్యాభర్తల మధ్య మనస్పర్థలు ఏర్పడి, ఆ యువతి చివరకు పుట్టింటికి చేరుకోవాల్సి వచ్చింది.

అయితే విజయవాడలో నర్సింగ్ శిక్షణ పొందుతున్న సమయంలోనూ భవానీశంకర్ ఆమెను వదిలిపెట్టలేదు. పెళ్లి చేసుకోవాలంటూ నిరంతరం ఒత్తిడి చేయడంతో, కుమార్తెను రక్షించుకునేందుకు తల్లిదండ్రులు ఆమెను హైదరాబాద్‌లోని ఒక హాస్టల్‌లో ఉంచి చదివించారు. అయినప్పటికీ, నిందితుడు ఇన్‌స్టాగ్రామ్ ద్వారా ఆమె ఆచూకీ కనిపెట్టి, ఫోన్ కాల్స్‌తో తీవ్రంగా వేధిస్తూ మానసిక ఒత్తిడికి గురిచేశాడు. అతని మాటలు నమ్మిన యువతి, ఈ నెల 2వ తేదీన హైదరాబాద్ నుంచి విజయవాడకు వచ్చింది.

Advertisement

విజయవాడ చేరుకున్న ఆమెను భవానీశంకర్ దేవీనగర్‌లోని తన గదికి తీసుకెళ్లాడు. మరుసటి రోజు సాయంత్రం ఆమె ఫోన్ తనిఖీ చేయగా, మహేష్ అనే వ్యక్తి నంబర్ కనిపించడంతో నిందితుడు అనుమానంతో ఊగిపోయాడు. ఆమెపై దాడి చేసి గొడవకు దిగాడు. భయపడిపోయిన ఆ యువతి తిరిగి హైదరాబాద్ వెళ్లిపోయేందుకు రైల్వే స్టేషన్‌కు వెళ్లగా, నిందితుడు ఆమెను బలవంతంగా మళ్ళీ తన గదికి తీసుకొచ్చాడు.

గదికి తెచ్చిన తర్వాత కూడా అనుమానంతో మళ్ళీ గొడవ పడిన భవానీశంకర్, తీవ్రస్థాయిలో రెచ్చిపోయి ఆమె నోట్లో బలవంతంగా పురుగుల మందు పోశాడు. యువతి అపస్మారక స్థితిలోకి చేరుకోవడంతో భయపడిన నిందితుడు, ఆమెను ఆసుపత్రిలో చేర్పించి ఆమె తల్లికి సమాచారం అందించాడు. అనంతరం పోలీసులు వస్తారనే భయంతో అక్కడి నుండి పరారయ్యాడు.

Advertisement

Also Read: రీల్స్ పిచ్చా? అమాయకత్వమా? నోట్లో బ్యాటరీ పేలి బాలుడి పరిస్థితి..

ప్రస్తుతం బాధితురాలు ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. కోలుకున్న తర్వాత ఆమె ఇచ్చిన ఫిర్యాదు మేరకు అజిత్ సింగ్ నగర్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ దారుణానికి ఒడిగట్టిన భవానీశంకర్ కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టి, దర్యాప్తును వేగవంతం చేశారు.

Related News

ఇరుముడి ఎఫెక్ట్.. ‘తులాభారం’ కోసం రవితేజ భారీ రెమ్యూనరేషన్..

సాయికృష్ణ మిస్టరీ కేసు సంఘటన.. మళయాల క్రైం థ్రిల్లర్‌ మూవీలో ప్రధాన కథనం..! ఇన్విస్టిగేషన్‌ ఆఫీసర్‌ని బురిడీ కొట్టించే సీన్లు..!

‘కంచె చేను మేస్తున్న’ దారుణ హత్యలు! పని మనుషుల ముసుగులో నరరూప హంతకులు!

పెను విషాదం.. 40 మందితో వెళుతోన్న ప‌డ‌వ బోల్తా

మధ్యప్రదేశ్‌లో విషాదం.. ఎద్దును రక్షించబోయి ముగ్గురు మృతి!

ఘోర బస్సు ప్రమాదం.. క్షణాల వ్యవధిలో తగలబడిన బస్సు.. స్పాట్‌లో!

ఘట్‌కేసర్‌లో ఘోర విషాదం.. రైలు కింద పడి దంపతుల ఆత్మహత్య!

ఈగల్ ఫోర్స్ ‘మరో’ సక్సెస్ ఆపరేషన్.. 180 కిలోల గంజాయి సీజ్!

Big Stories

Advertisement
×