iPhone 16 Offers: ప్రముఖ దిగ్గజ సంస్థ యాపిల్ ఫోన్‌లకు మార్కెట్లో మొదటి నుంచే క్రేజీ డిమాండ్ ఉంటుంది. దీనిని దృష్టిలో ఉంచుకుని యాపిల్ ప్రతిఏటా కొత్త కొత్త మోడల్స్‌ను మార్కెట్లోకి దించుతుంటుంది. ఈ ఏడాది iPhone 17 మోడల్ అత్యుత్తమ అమ్మకాలతో దూసుకుపోయిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా iPhone 16 మోడల్ మీద ధర తగ్గిన విషయం తెలిసిందే. అయితే, తాగాజా ఐఫోన్ 16 కొనాలనుకునే వారికి ప్రముఖ ఇ-కామర్స్ వెబ్‌సైట్ ఫ్లిప్‌కార్ట్ మంచి ఆఫర్‌ను తీసుకొచ్చింది. ఆ వివరాలేంటో ఇప్పుడు చూద్దాం..
యాపిల్ iPhone 16 మోడల్ 128జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ వేరియంట్ అసలు ధర రూ.79900. కానీ, ఇప్పుడిదీ ఫ్లిప్‌కార్ట్‌లో రూ.62,999లకే లభిస్తోంది. మరో క్రేజీ ఆఫర్ ఏంటంటే.. ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్, ఫ్లిప్‌కార్ట్ ఎస్‌బీఐ క్రెడిట్ కార్డులు ఉన్న వినియోగదారులందరూ.. ఈ ఫోన్ కొనుగోలుపై రూ.2,500 తగ్గింపును పొందవచ్చు. ఐఫోన్ 16 మోడల్ బ్లాక్, పింక్, అల్ట్రామెరైన్, వైట్, టీల్ అనే ఐదు రంగుల్లో అందుబాటులో ఉంది.
యాపిల్ ఐఫోన్ 16.. 5-కోర్ గ్రాఫిక్స్ ప్రాసెసింగ్ యూనిట్‌తో జత చేయబడిన ఆపిల్ A18 ప్రాసెసర్‌తో వస్తుంది. వాటర్ అండ్ డస్ట్ నిరోధకత కోసం ఐపీ68 ధృవీకరణను పొందుతుంది. ఈ ఫోన్‌లో 48 మెగాపిక్సెల్ ప్రైమరీ షూటర్, 120 డిగ్రీల ఫీల్డ్ ఆఫ్ వ్యూతో 12MP అల్ట్రా వైడ్ యాంగిల్ షూటర్లతో డ్యూయల్ రియర్ కెమెరా సిస్టమ్ ఉంది. ఇక సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 12MP ఫ్రంట్ స్నాపర్‌ను పొందుతుంది. ఐఫోన్ 16 మోడల్ 3561mAh బ్యాటరీతో పాటు 25W వైర్‌లెస్ ఛార్జింగ్ సపోర్ట్‌తో పనిచేస్తుంది.
గమనిక: ఫోన్లపై ఆఫర్లు, ధరలు ప్రతిరోజూ మారవచ్చు. కొత్త ఆఫర్స్‌ను ఎప్పటికప్పుడు చెక్ చేసుకోండి. ఆఫర్లకు సంబంధించిన సమాచారం ఎప్పటికప్పుడు మారుతుంటాయని గమనించగలరు.