Apple Trade In Old Phones| స్మార్ట్ ఫోన్స్‌లో ఆపిల్ బ్రాండ్ కు చెందిన ఐఫోన్స్ కు ప్రత్యేక స్థానం ఉంది. భారతదేశంలో చాలామంది ఐఫోన్ కొనాలనుకుంటారు. కానీ ధర చాలా ఎక్కువగా ఉండడంతో ఆర్థికంగా ఇబ్బంది పడుతుంటారు. ఈ సమస్యను కొంతవరకు తగ్గించడానికి ఆపిల్ కొత్తగా ‘ట్రేడ్-ఇన్’ ప్రోగ్రామ్‌ను తీసుకొచ్చింది. మీ పాత స్మార్ట్‌ఫోన్‌ను (ఐఫోన్ లేదా ఆండ్రాయిడ్) ఇస్తే, కొత్త ఆపిల్ పరికరం కొనేటప్పుడు డిస్కౌంట్ లభిస్తుంది. ఈ ఆఫర్ లో గరిష్ఠంగా రూ.64,000 వరకు తిరిగి పొందవచ్చు.
ట్రేడ్-ఇన్ సర్వీస్ చాలా సులభం. మీ పాత ఫోన్‌ను ఆపిల్‌కు ఇవ్వండి. వారు దాని పనితీరును పరీక్షించి విలువ నిర్ణయిస్తారు. ఆ విలువను కొత్త ఐఫోన్, ఐప్యాడ్ లేదా మ్యాక్‌బుక్ కొనుగోలులో డిస్కౌంట్‌గా ఉపయోగించవచ్చు. ఆన్‌లైన్ లేదా స్టోర్‌లో ఈ ట్రేడ్-ఇన్ సర్వీస్ అందుబాటులో ఉంది.
పాత ఐఫోన్ మోడల్స్ విలువ
ట్రేడ్-ఇన్ సర్వీస్‌లో పాత మోడళ్లకూ మంచి ధర లభిస్తుంది.
ఐఫోన్ 7 ప్లస్: రూ.4,350
ఐఫోన్ 8: రూ.5,850
ఐఫోన్ 8 ప్లస్: రూ.7,050
ఐఫోన్ X: రూ.8,800
ఐఫోన్ XR: రూ.9,400
ఐఫోన్ XS: రూ.10,900
ఐఫోన్ XS మాక్స్: రూ.11,900
ఐఫోన్ 11 సిరీస్‌కు రూ.12,500 నుంచి రూ.19,300 వరకు డిస్కౌంట్ వస్తుంది. ఐఫోన్ 12 సిరీస్‌కు రూ.13,700 నుంచి రూ.28,100 వరకు లభిస్తుంది. ఐఫోన్ 13 సిరీస్‌తో రూ.22,900 నుంచి రూ.38,200 వరకు ఆదా చేయవచ్చు.
కొత్త మోడల్స్ ఎక్కువ విలువ
ఇటీవలి విడుదలైన ఐఫోన్, ఐప్యాడ్ మోడల్స్‌కు ఎక్కువ విలువ నిర్ణయించింది.
ఐఫోన్ 14: రూ.27,900
ఐఫోన్ 14 ప్లస్: రూ.31,400
ఐఫోన్ 14 ప్రో: రూ.48,000
ఐఫోన్ 14 ప్రో మాక్స్: రూ.50,000
ఐఫోన్ 15: రూ.31,500
ఐఫోన్ 15 ప్లస్: రూ.36,500
ఐఫోన్ 15 ప్రో: రూ.54,500
ఐఫోన్ 15 ప్రో మాక్స్: రూ.58,000
తాజా ఐఫోన్ 16 సిరీస్‌తో రూ.39,900 నుంచి రూ.64,000 వరకు డిస్కౌంట్ లభిస్తుంది. ప్రో మాక్స్ మోడల్‌తో గరిష్ఠ లాభం పొందవచ్చు.
ఆండ్రాయిడ్ ఫోన్లు కూడా కొనుగోలు చేస్తున్న ఆపిల్
ఆపిల్ ఆండ్రాయిడ్ ఫోన్లను కూడా స్వీకరిస్తుంది. వాటి ధరలు ఇవిగో
శాంసంగ్ గెలాక్సీ S24 అల్ట్రా: రూ.41,540
గెలాక్సీ S24: రూ.23,500
గెలాక్సీ S23 అల్ట్రా: రూ.32,600
వన్‌ప్లస్ 12R: రూ.13,400
గూగుల్ పిక్సెల్ 8: రూ.19,000
వివో V29 ప్రో: రూ.12,170
షావోమీ రెడ్‌మీ నోట్ 11 ప్రో: రూ.4,360
ఆపిల్ అధికారిక వెబ్‌సైట్ లో చెక్ చేయండి.. లేదా ఆపిల్ స్టోర్‌కు వెళ్లిండి. నడవండి. మీరు కొనుగోలు చేయాలనుకున్న కొత్త ఐఫోన్య, ఐప్యాడ్, మ్యాక్ బుక్ లాంటి పరికరాన్ని ఎంచుకోండి. చెక్‌అవుట్ సమయంలో ట్రేడ్-ఇన్ ఆప్షన్ ఎంచుకోండి. పాత ఫోన్ వివరాలు ఇవ్వండి. తక్షణం విలువ అంచనా వస్తుంది. అలా మంచి సేవింగ్స్ తో తక్కువ ధరకే కొత్త ఆపిల్ డివైజ్ పొందండి. ఈ ప్రోగ్రామ్‌తో కొత్త ఐఫోన్ కొనడం సులభమవుతుంది.
Also Read: ప్రపంచంలోని అత్యంత సురక్షిత స్మార్ట్‌ఫోన్‌లు.. వీటిని హ్యాక్ చేయడం అసాధ్యమే?