ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో లైకులు, వ్యూస్ కోసం కొందరు చేసే పనులు లిమిట్స్ దాటి పోతున్నాయి. తాజాగా వెలుగులోకి వచ్చిన ఒక వీడియో నెటిజన్లను విస్మయానికి గురి చేస్తోంది. ఒక మహిళ తన చంటి బిడ్డను స్కూటర్ స్టోరేజ్ డిక్కీ లో పడుకోబెట్టి బండి నడుపుకుంటూ వెళ్లడం సోషల్ మీడియాలో తీవ్ర చర్చకు దారి తీసింది. ఈ అమానవీయ ఘటన పట్ల సోషల్ మీడియాలో నెటిజన్లు తెగ ఫైర్ అవుతున్నారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
ముందుగా ఒక మహిళ స్కూటీ పక్కన నిలబడి ఉంటుంది. తర్వాత ఆ లేడీ స్కూటీ డిక్కీని తెరిచి అందులో ఒక మెత్తటి దిండును పొందు పరుస్తోంది. అనంతరం తన చేతిలో ఉన్న పసిపాపను అత్యంత అజాగ్రత్తగా ఆ చిన్నపాటి ప్లేస్ లో పడుకోబెడుతుంది. ఏమాత్రం కనికరం లేకుండా డిక్కీని మూసివేసి వెంటనే బండి స్టార్ట్ చేసి అక్కడి నుంచి వెళ్లిపోతుంది. అంతటితో ఆ వీడియో క్లోజ్ అవుతోంది. అయితే ఈ వీడియో చూసిన నెటిజన్లు ఆ మహిళా ప్రవర్తనపై తీవ్ర స్థాయిలో ఫైర్ అవుతున్నారు.
A woman puts her infant child inside the storage carrier below the seat in scorching heat and drives off.
In any other country, This woman would be arrested and her child would be taken in protective care.
Some people don’t deserve to be parents.pic.twitter.com/pesac1LGse
— Roshan Rai (@RoshanKrRaii) March 12, 2026
ముఖ్యంగా ఎండల తీవ్రత ఎక్కువగా ఉన్న సమయంలో ఇలాంటి పనులు చేయడం ప్రాణాల మీదకు తెస్తుందని తెగ హెచ్చరిస్తున్నారు. స్కూటర్ డిక్కీ లోపల గాలి ఆడే అవకాశం తక్కువగా ఉంటుంది. ఇంజిన్ వేడి వల్ల ఆ ప్లేస్ అంతా మరింత హీట్ ఎక్కే ఛాన్స్ ఉంటుంది. ఊపిరాడక పసిపాప ప్రాణాలు పోయే ప్రమాదం ఉందని తెలిసి కూడా ఆ మహిళ ఇలాంటి సాహసానికి ఒడిగట్టడం దారుణమని నెటిజన్లు దుమ్మెత్తి పోస్తున్నారు.
సోషల్ మీడియాలో వీడియో చూసిన కొంత మంది పలు విధాలుగా ట్వీట్ చేస్తున్నారు. ‘వ్యూస్ కోసం కన్నబిడ్డ ప్రాణాలను పణంగా పెడుతున్నారా?’ అంటూ కొందరు ప్రశ్నిస్తుంటే.. మరికొందరు ఆమెను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. ఇలాంటి వ్యక్తులకు పిల్లలను పెంచే అర్హత లేదని కామెంట్లు చేస్తున్నారు. ఇది కేవలం పబ్లిసిటీ కోసం చేసిన స్టంట్ అని కొందరు భావిస్తున్నప్పటికీ.. అది ఎలాంటి స్టంట్ అయినా సరే పసిపాప ప్రాణాలతో చెలగాటం ఆడటం క్షమించరాని నేరమని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఇలా కావాలనే వీడియో చేసి ఉండొచ్చని…. అంటే కేవలం జనాలకు కోపం తెప్పించి వీడియోను వైరల్ చేసుకోవడానికి ప్లాన్ చేసినట్లుగా ఉందని మరికొందరు చెబుతున్నారు. ఎవరు రికార్డ్ చేస్తున్నారు..? ఎందుకు ఆమె ఆపుతలేరు..? అనే సందేహాలు కూడా వ్యక్తమవుతున్నాయి. కారణం ఏదైనప్పటికీ సోషల్ మీడియా పిచ్చి పరాకాష్టకు చేరిందనడానికి ఈ ఘటనే నిదర్శనం అని చెప్పవచ్చు. ఇలాంటి ప్రమాదకరమైన ధోరణులను అరికట్టకపోతే మున్ముందు మరిన్ని ప్రాణనష్టాలు జరిగే అవకాశం ఉంది.
చట్టాన్ని అమలు చేసే అధికారులు ఇలాంటి వీడియోలను స్వయంగా గుర్తించి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు. సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్స్ కూడా ఇలాంటి హింసాత్మక లేదా ప్రమాదకరమైన కంటెంట్‌ను ప్రోత్సహించకుండా వెంటనే తొలగించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
ALSO READ: NIC Recruitment 2026: రూ.లక్షల జీతంతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం.. ఈ అర్హత ఉంటే ఎనఫ్, పూర్తి వివరాలివే