Motorola Edge 70 Max: టెక్ ప్రియుల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్న మోటరోలా కంపెనీ.. తాజాగా తమ కొత్త ఫ్లాగ్‌షిప్ మోడల్ Edge 70 Max విక్రయాలను భారతదేశంలో ప్రారంభించింది. ప్రీమియం ఫీచర్లు, అద్భుతమైన లుక్స్, భారీ బ్యాటరీతో వస్తున్న ఈ ఫోన్‌పై తొలి సేల్ సందర్భంగా భారీ ఆఫర్లను అందిస్తోంది. బ్యాంకు డిస్కౌంట్లు, ఎక్స్ఛేంజ్ బోనస్‌లు కలిపి వినియోగదారులు దాదాపు రూ.10,000 వరకు ప్రయోజనం పొందొచ్చు. ఇప్పటికే ఈ ఫోన్ ఫ్లిప్‌కార్ట్, మోటరోలా అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులోకి వచ్చింది.
ఈ స్మార్ట్‌ఫోన్ ప్రారంభ ధరను 8GB ర్యామ్, 256GB స్టోరేజ్ వేరియంట్‌కు రూ.54,999గా నిర్ణయించారు. అలాగే 12GB ర్యామ్ వేరియంట్ రూ.59,999కి లభిస్తోంది. అయితే లాంచ్ ఆఫర్లలో భాగంగా HDFC లేదా యాక్సిస్ బ్యాంక్ కార్డులతో కొనుగోలు చేస్తే రూ.5,000 తక్షణ డిస్కౌంట్ లభిస్తుంది. దీనికి తోడు పాత ఫోన్ ఎక్స్ఛేంజ్‌పై మరో రూ.5,000 వరకు బోనస్ ఇస్తున్నారు. ఈ రెండు ఆఫర్లను ఉపయోగించుకుంటే.. బేస్ వేరియంట్‌ను కేవలం రూ.44,999కే సొంతం చేసుకోవచ్చు. ప్యాంటోన్ ఆక్వా గ్రే, డార్క్ షాడో, ఐస్ మెల్ట్ రంగుల్లో మెటల్ బాడీతో ఈ ఫోన్ చాలా లగ్జరీగా కనిపిస్తుంది.
Also Read: కన్నుల పండుగే.. ఏకంగా రూ.18,000 తగ్గింది, ఫ్లిప్‌కార్ట్‌లో రియల్‌మీ బంపర్ డిస్కౌంట్!
ఈ ఫోన్‌లో 6.8 అంగుళాల QHD ప్లస్ ఎక్స్‌ట్రీమ్ AMOLED డిస్‌ప్లేను అందించారు. 144Hz రిఫ్రెష్ రేట్, 7000 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్ వల్ల ఎండలో కూడా స్క్రీన్ చాలా స్పష్టంగా కనిపిస్తుంది. చేతులు తడిగా ఉన్నా స్క్రీన్ సులభంగా పనిచేసేలా ‘వాటర్ టచ్’ ఫీచర్ ఇచ్చారు. ఇక మెరుగైన పనితీరు కోసం.. ఇందులో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 5 ప్రాసెసర్ వాడారు. హెవీ గేమింగ్ ఆడేటప్పుడు ఫోన్ వేడెక్కకుండా ఉండేందుకు పెద్ద వేపర్ ఛాంబర్ కూలింగ్ సిస్టమ్‌ను అమర్చారు. ఆండ్రాయిడ్ 16 ఆపరేటింగ్ సిస్టమ్‌తో వచ్చే ఈ ఫోన్‌కు 3 ఏళ్ల వెర్షన్ అప్‌డేట్లు, 5 ఏళ్ల సెక్యూరిటీ అప్‌డేట్లను మోటరోలా హామీ ఇస్తోంది.
ఈ ఫోన్ ప్రధాన ఆకర్షణ దీని 7100mAh భారీ బ్యాటరీ. దీనికి తోడు 90W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్, 25W వైర్‌లెస్ ఛార్జింగ్ సపోర్ట్ ఉన్నాయి. ఈ సెగ్మెంట్‌లో అల్ట్రా ఫాస్ట్ మ్యాగ్నెటిక్ వైర్‌లెస్ ఛార్జింగ్‌తో వచ్చిన మొదటి ఫోన్ ఇదే కావడం విశేషం. ఫోన్ వెనుక వైపు OIS సపోర్ట్‌తో కూడిన 50 మెగాపిక్సెల్ సోనీ ప్రైమరీ కెమెరా, 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ కెమెరా ఉన్నాయి. సెల్ఫీల కోసం 32 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఇచ్చారు. ఇది 4K వీడియోలను కూడా స్పష్టంగా రికార్డ్ చేయగలదు.
పెద్ద బ్యాటరీ ఉన్నప్పటికీ ఫోన్ మందం కేవలం 8.29 మిల్లీమీటర్లు, బరువు 221 గ్రాములు మాత్రమే ఉంటుంది. మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్‌తో పాటు IP68, IP69 వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెన్స్ వల్ల నీటిలో పడినా ఫోన్‌కు ఏమీ కాదు. తక్కువ ధరలో ప్రీమియం ఫీచర్లు, మంచి బ్యాటరీ లైఫ్ మరియు శక్తివంతమైన కెమెరా కోరుకునే వారికి ఈ మొదటి సేల్ ఆఫర్లు ఎంతగానో ఉపయోగపడతాయి.
Also Read: గూగుల్ డ్రైవ్‌లో ఫైళ్లు వెతకలేక విసుగొస్తుందా? ఈ సూపర్ ట్రిక్స్ వాడితే క్షణాల్లో పని పూర్తి!