boAt Chrome Horizon smartwatch: చేతికి అదిరిపోయే లుక్ తీసుకురావడంతో.. పాటు లేటెస్ట్ టెక్నాలజీని అందించే సరి కొత్త స్మార్ట్‌వాచ్ కోసం చూస్తున్నారా? ప్రముఖ ఆడియో, వేరబుల్స్ బ్రాండ్ బోట్ మార్కెట్లోకి తీసుకొచ్చిన సరికొత్త ‘boAt Chrome Horizon’ టెక్ లవర్స్‌ను విశేషంగా ఆకట్టుకుంటోంది. ప్రీమియం మెటాలిక్ బాడీ, అద్భుతమైన 1.51 ఇంచుల డిస్‌ప్లే, కోకో బ్రౌన్ స్ట్రాప్, సరికొత్త వీడియో వాచ్ ఫేసెస్ ఫీచర్‌తో.. వస్తున్న ఈ స్టైలిష్ స్మార్ట్‌వాచ్ ధర రూ. 3,599 మాత్రమే.ఈ వాచ్ పూర్తి ప్రత్యేకతలు, ఫీచర్లను ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం!
1. ప్రీమియం మెటాలిక్ బాడీ & 1.51 ఇంచుల డిస్‌ప్లే:
ఈ స్మార్ట్‌వాచ్ మెయిన్ హైలైట్ దీని డిజైన్ , డిస్‌ప్లే అనే చెప్పాలి. దీనికి ఇచ్చిన మెటాలిక్ బాడీ వాచ్‌కు ఒక లగ్జరీ లుక్‌ను ఇస్తుంది. దీనికి తోడు 1.51 ఇంచుల (3.83 సెం.మీ) పెద్ద AMOLED డిస్‌ప్లేను అందించారు. దీనివల్ల స్క్రీన్ పై ఉన్న నోటిఫికేషన్లు, మెసేజ్‌లు మరియు టైమ్ ఎండ్‌లో కూడా చాలా స్పష్టంగా, ప్రకాశవంతంగా కనిపిస్తాయి. ఆకర్షణీయమైన కోకో బ్రౌన్ స్ట్రాప్ (Coco Brown Strap) ఈ వాచ్ అందాన్ని మరింత పెంచుతుంది.
2. ట్రెండీ వీడియో వాచ్ ఫేసెస్:
ఈ స్మార్ట్ వాచ్‌లో బోట్ ఒక సరికొత్త ఫీచర్‌ను పరిచయం చేసింది. అదే .. వీడియో వాచ్ ఫేసెస్. మీరు మీ ఫోన్ గ్యాలరీలోని చిన్న వీడియోలను వాచ్ ఫేస్ లాగా సెట్ చేసుకునే.. అద్భుతమైన అవకాశం ఇందులో ఉంది. దీనివల్ల మీ వాచ్ ఎప్పుడూ అత్యంత ట్రెండ్‌గా, ప్రత్యేకంగా కనిపిస్తుంది.
వాచ్‌ను నావిగేట్ చేయడానికి ఇందులో.. యూజర్ ఫ్రెండ్లీ అయిన ‘ఫంక్షనల్ క్రౌన్ అందించారు. దీనిని.. తిప్పడం ద్వారా మెనూస్, యాప్స్‌ను చాలా ఈజీగా స్క్రోల్ చేయవచ్చు. అలాగే.. అడ్వాన్స్‌డ్ బ్లూటూత్ కాలింగ్ సపోర్ట్ ఉండటం వల్ల ఫోన్ తీయకుండానే వాచ్‌లోనే నేరుగా కాల్స్ మాట్లాడొచ్చు.
ఆరోగ్యాన్ని ఎప్పటికప్పుడు పర్యవేక్షించడానికి.. ఇందులో లేటెస్ట్ సెన్సార్లు ఉన్నాయి. హార్ట్ రేట్, SpO2 (బ్లడ్ ఆక్సిజన్) లెవెల్స్, స్లీప్ మోనిటరింగ్ తో.. పాటు HRV (హార్ట్ రేట్ వేరియబిలిటీ), VO2 Max ట్రాకింగ్ వంటి హెల్త్ ఫీచర్లు ఇందులో లభిస్తాయి. ఇవి మీ వర్కవుట్ సామర్థ్యాన్ని , స్ట్రెస్ లెవెల్స్‌ను అంచనా వేయడంలో ఇవి ఎంతగానో సహాయపడతాయి. ఆటో-యాక్టివిటీ డిటెక్షన్ ద్వారా మీ రన్నింగ్, వాకింగ్ వంటి వ్యాయామాలు ఆటోమేటిక్‌గా రికార్డ్ అవుతాయి.
ఎలక్ట్రానిక్ గాడ్జెట్లలో బ్యాటరీ బ్యాకప్ చాలా ముఖ్యం. బోట్ క్రోమ్ హారిజన్ వాచ్‌లో ASAP ఛార్జ్ టెక్నాలజీ ఉంటుంది. ఇది కేవలం.. 45 నిమిషాల్లో పూర్తిగా ఛార్జ్ అవుతుంది. ఒక్కసారి.. ఫుల్ ఛార్జ్ చేస్తే సాధారణ వాడకంలో ఇది అప్ టూ 7 రోజుల వరకు బ్యాటరీ బ్యాకప్ ఇస్తుంది. అలాగే.. IP68 వాటర్ , డస్ట్ రెసిస్టెన్స్ సపోర్ట్ ఉండటం వల్ల చెమట పడినప్పుడు లేదా నీటి బిందువులు పడినప్పుడు వాచ్‌కు ఎలాంటి సమస్య ఉండదు.
Also Read: ఫ్రిజ్,మొబైల్ బడ్జెట్‌లో అదిరిపోయే 43 ఇంచుల టీవీ..డోంట్ మిస్
6. ధర:
ఇన్ని ప్రీమియం ఫీచర్లు, మెటాలిక్ లుక్,డిస్‌ప్లే, వీడియో వాచ్ ఫేసెస్ సపోర్ట్ ఇస్తూ మార్కెట్లో దీని ధర రూ.3,599 వరకు అందుబాటులో ఉంది. బడ్జెట్ ధరలో.. ఒక స్టైలిష్ , స్మార్ట్ వాచ్ కొనుగోలు చేయాలనుకునే.. వారికి ఇది నిజంగా సూపర్ ఛాయిస్.
మీ చేతికి ప్రీమియం లుక్ తీసుకురావడంతో.. పాటు, అడ్వాన్స్‌డ్ హెల్త్ ట్రాకింగ్ , వీడియో వాచ్ ఫేస్ వంటి లేటెస్ట్ ఫీచర్లు అందించే బెస్ట్ స్మార్ట్‌వాచ్ కోసం చూస్తుంటే.. ఈ మోడల్ మీకు చాలా బాగా ఉపయోగపడుతుంది. మెటాలిక్ బాడీ, 1.51 ఇంచుల డిస్‌ప్లే , రూ. 3,599 ధరతో వస్తున్న ఈ వాచ్‌ను మీరు కూడా ఆన్‌లైన్‌లో ట్రై చేసి మీ టెక్ లైఫ్‌స్టైల్‌ను మరింత అప్‌గ్రేడ్ చేసుకోండి!