E-Paper
Advertisement

జస్ట్.. రూ.30 వేలకే రౌండ్ ట్రిప్.. ఈ 3 దేశాలు భలే చీప్!

జస్ట్.. రూ.30 వేలకే రౌండ్ ట్రిప్.. ఈ 3 దేశాలు భలే చీప్!
Advertisement

Cheapest International Destinations: విదేశీ ప్రయాణం అనగానే చాలా మంది ఖర్చుతో కూడుకున్న వ్యవహారంగా భావిస్తారు. కానీ, అందులో ఏమాత్రం నిజం లేదు. జస్ట్ రూ. 30 వేల లోపే విదేశాలను చుట్టి రావచ్చు. నమ్మడం లేదా? అయితే, ముంబై నుంచి రౌండ్ ట్రిప్ విమాన టికెట్లు రూ.18,697 నుంచి అందుబాటులోనే ఉన్నాయి. తక్కువ ఖర్చులో ఏ దేశాలకు వెళ్లొచ్చు అనేది ఇప్పుడు తెలుసుకుందాం..

థాయ్‌లాండ్.. అక్టోబర్‌ లో సూపర్ ఎక్స్ పీరియెన్స్!  

అక్టోబర్‌ లో థాయ్‌ లాండ్‌ లో వర్షాకాలం క్రమంగా తగ్గుముఖం పడుతుంది. ఉష్ణోగ్రతలు కూడా కొద్దిగా తగ్గుతాయి. అదే సమయంలో నవంబర్ నుంచి మొదలయ్యే పర్యాటక రద్దీ ఇంకా పూర్తిగా మొదలుకాదు. చియాంగ్ మాయి, పాయ్ ప్రాంతాల్లో పచ్చని ప్రకృతి అందాలను ఆస్వాదించవచ్చు. బ్యాంకాక్‌లోని ప్రముఖ ప్రదేశాలను కూడా పెద్దగా రద్దీ లేకుండా చూడొచ్చు. ఫూకెట్‌ లో ఈ సమయంలో ‘థెట్సకన్ కిన్ జే’ పండుగ ప్రత్యేక ఆకర్షణగా ఉంటుంది. ముంబై–బ్యాంకాక్ రౌండ్ ట్రిప్ విమాన టికెట్ ధరలు సుమారు రూ.18,697 నుంచి ఉంటాయి. భారతీయులకు వీసా ఫ్రీ ఎంట్రీ కూడా ఉంటుంది.

ప్రశాంతమైన ట్రిప్‌కు శ్రీలంక బెస్ట్!

Advertisement

అక్టోబర్‌ లో శ్రీలంక వాతావరణం బాగుంటుంది. రుతుపవనాల ప్రభావం ఉండటంతో కొన్ని ప్రాంతాల్లో వర్షాలు పడే అవకాశం ఉంటుంది. అయితే ఇదే సమయంలో పర్యాటకుల సంఖ్య తక్కువగా ఉండటంతో ఖర్చులు కూడా కొంత తగ్గే అవకాశం ఉంటుంది. సిగిరియా, దంబుల్లా వంటి ప్రాంతాలను సందర్శించేందుకు అక్టోబర్ మంచి సమయంగా చెప్పొచ్చు. టీ తోటలు ఉన్న కొండ ప్రాంతాలు చల్లని వాతావరణంతో పచ్చగా కనిపిస్తాయి. ముంబై–కొలంబో రౌండ్ ట్రిప్ టికెట్ ధరలు సుమారు రూ.23,108 ఉంటాయి. 30 రోజులు, అంతకంటే తక్కువ కాలం ఉండే భారతీయులకు ఉచిత ఎంట్రీ ఉంటుంది.

వియత్నాం.. నార్త్ వైపు వెళ్తే బెస్ట్!

అక్టోబర్‌లో వియత్నాం వెళ్లాలనుకునేవారు ఉత్తర ప్రాంతాలకు వెళ్లడం మంచిది. వేసవి వేడి, వర్షాలు తగ్గడంతో హనోయ్, సాపా ప్రాంతాల్లో ప్రయాణం సౌకర్యంగా ఉంటుంది. హనోయ్ ఓల్డ్ క్వార్టర్‌ లో వీధుల్లో తిరగడం, స్థానిక ఆహారాన్ని రుచి చూడటం, హోన్ కీమ్ సరస్సును సందర్శించడం మంచి అనుభూతిని ఇస్తాయి. సాపాలో పర్వతాలు, గ్రామీణ ప్రాంతాలు, హైకింగ్ ట్రైల్స్‌ తో పాటు ఫాన్సిపాన్ పర్వతానికి కేబుల్ కార్ ప్రయాణం చేయొచ్చు. అయితే అక్టోబర్‌ లో మధ్య వియత్నాంలోని హోయ్ ఆన్, డా నాంగ్, హ్యూ ప్రాంతాల్లో భారీ వర్షాలు, తుఫానుల ప్రభావం ఉండే అవకాశం ఉంది. అందుకే ట్రిప్ ప్లాన్ చేసుకునే ముందు వాతావరణ పరిస్థితులను పరిశీలించడం మంచిది. ముంబై–హో చి మిన్ సిటీ రౌండ్ ట్రిప్ విమాన టికెట్ ధరలు సుమారు రూ.23,973 ఉంటాయి. భారతీయులకు వియత్నాం ఈ-వీసా సౌకర్యం అందుబాటులో ఉంది.

బడ్జెట్ ట్రావెలర్లకు మంచి అవకాశం

Advertisement

అక్టోబర్‌లో విదేశీ ట్రిప్ ప్లాన్ చేసేవారికి థాయ్‌లాండ్, శ్రీలంక, వియత్నాం తక్కువ బడ్జెట్‌ లో బెస్ట్ ఆప్షన్స్ గా చెప్పుకోవచ్చు. అయితే విమాన టికెట్ ధరలు, వీసా నిబంధనలు ఎప్పటికప్పుడు మారే అవకాశం ఉన్నందున బుకింగ్‌కు ముందు అధికారిక సమాచారం చెక్ చేసుకోవాలి.

Read Also: ప్రకృతి అందాల నడుమ రైలు ప్రయాణం.. జీవితంలో ఒక్కసారైనా చేయాల్సిన జర్నీస్ ఇవే!

Tags

Related News

నదిని క్లీన్ గా మార్చేశాడు, తన తలరాత మార్చే జాబ్ ఆఫర్ కొట్టేశాడు!

ప్రకృతి అందాల నడుమ రైలు ప్రయాణం.. జీవితంలో ఒక్కసారైనా చేయాల్సిన జర్నీస్ ఇవే!

హైదరాబాద్ దగ్గరల్లోనే బెస్ట్ వీకెండ్ స్పాట్స్.. ఫ్రెండ్స్ తో వెళ్తే సూపరో సూపరు!

తీరొక్క గణనాథులకు కేరాఫ్.. ధూల్ పేట్ లో అడుగు పెడితే ధూమ్ ధామే!

వినాయకుడి నిమజ్జనమే కాదు.. ఆగమనమూ రచ్చే! తెలంగాణలో వైరల్ అవుతున్న కొత్త ట్రెండ్!

11 రాష్ట్రాలు.. 4,000 కిలో మీటర్లు.. దేశంలో అత్యంత పొడవైన జాతీయ రహదారి ఇదే!

భారీ వర్షాలకు దెబ్బతిన్న ట్రాక్.. రైళ్ల రాకపోకలకు బ్రేక్!

Big Stories

Advertisement
×