E-Paper
Advertisement

రామాయణంలోకి అమీర్ ఖాన్ కూతురు.. ఆ 5 నిమిషాలే కీలకమట!

రామాయణంలోకి అమీర్ ఖాన్ కూతురు.. ఆ 5 నిమిషాలే కీలకమట!
Advertisement

Ramayana : బాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో అత్యంత ప్రతిష్టాత్మకంగా.. రూ.4000 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కుతున్న రామాయణ (Ramayana ) మూవీ గురించి పరిచయం ప్రత్యేకంగా అవసరం లేదు. ముఖ్యంగా పౌరాణిక దృశ్య కావ్యంగా 2 భాగాలుగా రాబోతున్న ఈ సినిమా నుంచి విడుదల చేస్తున్న ప్రతి అప్డేట్ కూడా ప్రపంచవ్యాప్తంగా సినిమాపై అంచనాలను పెంచుతోంది. ఇప్పటికే ఈ సినిమా నుండి విడుదల చేసిన ట్రైలర్ సినిమాపై ఊహించని అంచనాలను పెంచేసింది. ఇలాంటి సమయంలో తాజాగా ఈ సినిమా నుంచి మరో అప్డేట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

రామాయణ చిత్రంలో అమీర్ ఖాన్ డాటర్..

ఈ మేరకు తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. అమీర్ ఖాన్ (Aamir Khan) ప్రధాన పాత్రలో బాక్సాఫీస్ వద్ద 2వేల కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టి.. మార్క్ సెట్ చేసిన దంగల్ (Dangal) చిత్రంలో.. అమీర్ ఖాన్ కూతురిగా నటించిన సన్యా మల్హోత్ర (Sanya Malhotra) ఈ సినిమాలో ఒక కీలకమైన పాత్ర పోషిస్తున్నట్లు సమాచారం. కథ ప్రకారం.. శాపం వల్ల రాయిగా మారిన అహల్య పాత్రలో సన్యా మల్హోత్రా నటించనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. శ్రీరాముడి పాద స్పర్శతో అహల్యకు శాప విముక్తి లభించే ఘట్టంలో ఈమె స్క్రీన్ ప్రెజెన్స్ ఉండబోతుందని సమాచారం.

ఆ 5 నిమిషాలే కీలకం..

Advertisement

ముఖ్యంగా సినిమాలో ఈ సన్నివేశం నిడివి 5 నిమిషాలు మాత్రమే ఉన్నప్పటికీ.. కథలో ఇది చాలా ప్రాధాన్యత ఉన్న ఘట్టం కావడంతో దర్శకుడు నితీష్ తివారి ఈ పాత్ర సన్యా మల్హోత్రాను ప్రత్యేకంగా ఎంపిక చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.. సినిమాలోని ప్రధాన హైలెట్స్ లో ఈ 5 నిమిషాల పాత్ర కూడా ఒకటిగా నిలుస్తుందని.. రామాయణం ప్రాముఖ్యతను తెలిపేలా చాలా అద్భుతంగా ఈ పాత్రను రాసుకున్నట్లు ఒక వార్త హల్చల్ చేస్తోంది. త్వరలోనే దీనిపై అఫీషియల్ గా అనౌన్స్మెంట్ ఇవ్వనున్నట్లు సమాచారం.

also read: మాధురి కేసులో బిగ్ ట్విస్ట్.. సంచలన నిజాలు బయటపెట్టిన ఈశ్వర్ సాయి భార్య!

రెండు భాగాలుగా రామాయణ..

Advertisement

ఇకపోతే రూ.4వేల కోట్ల బడ్జెట్తో ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేయబోతున్న ఈ సినిమాను రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు. ఇందులో మొదటి భాగాన్ని 2026 దీపావళి సందర్భంగా విడుదల చేస్తుండగా.. రెండవ భాగాన్ని వచ్చే ఏడాది దీపావళి కానుకగా రిలీజ్ చేయబోతున్నట్లు మేకర్స్ ప్రకటించారు.. నితీష్ తివారి డ్రీమ్ ప్రాజెక్టులో రణబీర్ కపూర్ శ్రీరాముడిగా , లేడీ పవర్ స్టార్ సాయి పల్లవి సీతగా నటిస్తుండగా.. రావణాసురుడిగా రాకింగ్ స్టార్ యశ్, మండోదరి పాత్రలో కాజల్ అగర్వాల్, శూర్పణఖ పాత్రలో రకుల్ ప్రీత్ సింగ్ , హనుమంతుడిగా సన్నీడియోల్, లక్ష్మణుడిగా రవి దుబే వంటి నటీనటులు కీలకపాత్రలు పోషిస్తున్నారు.

Related News

ఎన్టీఆర్ ఫ్యాన్స్ కు పూనకాలు తెప్పించే న్యూస్.. ఆ రూమర్స్ కు చెక్..

మమిత బైజుకు ఏమైంది..? సినిమాలకు గుడ్ బై..?

టాక్సిక్ ..500కోట్లు అయ్యే పనేనా ?

మా ఆయన కోసమే గాయమైనట్టుంది… పెళ్లి తర్వాత మూడు నెలలు కలవలేదంటూ!

శ్రీకృష్ణుడిగా రౌడీ హీరో విజయ్ దేవరకొండ.. దిల్ రాజు క్రేజీ రీమేక్ ప్లాన్

బన్నీ ట్రిపుల్ రోల్‌పై కొత్త ట్విస్ట్.. ‘రాకా’ కథ మొత్తం మారిపోయిందా?

డెనిమ్‌లో మాల్వి మల్హోత్రా.. బ్లూ బ్యూటీని చూస్తే చూపు తిప్పుకోవడం కష్టమే!

Big Stories

Advertisement
×