E-Paper
Advertisement

New Passport Rules: పాస్‌ పోర్ట్ రూల్స్ ఛేంజ్, ఆ సర్టిఫికేట్ లేకపోతే ఇక అంతే సంగతులు!

New Passport Rules: పాస్‌ పోర్ట్ రూల్స్ ఛేంజ్, ఆ సర్టిఫికేట్ లేకపోతే ఇక అంతే సంగతులు!
Advertisement

Passport Rules Changed: భారతీయ పౌరులు విదేశాలకు వెళ్లాలంటే కచ్చితంగా పాస్ పోర్ట్ ఉండాల్సిందే. గతంలో పాస్ పోర్టు కావాలంటే చాలా సమయం పట్టేది. కానీ, ఇప్పుడు తక్కువ సమయంలోనే అందిస్తున్నారు. అయితే, తాజాగా కేంద్ర ప్రభుత్వం పాస్ పోర్టు నిబంధనలను సవరించింది. ఇకపై పాస్ పోర్టుకు అప్లై చేసుకునే వాళ్లు కొన్ని డాక్యుమెంట్స్ ను కచ్చితంగా పొందుపరచాలని సూచించింది. ఇంతకీ అవేంటే? తాజాగా తీసుకొచ్చిన మార్పులు ఏవి? అనేది ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..

పాస్ పోర్టు నిబంధనల్లో సవరణలు

కేంద్ర ప్రభుత్వం తాజాగా పాస్‌ పోర్ట్ నిబంధనలు 1980ని సవరించింది. పాస్‌పోర్ట్ కోసం దరఖాస్తు చేసుకునేటప్పుడు డేట్ ఆఫ్ బర్త్ కన్ఫర్మేషన్ కోసం కొత్త రూల్ తీసుకొచ్చింది. పాస్‌ పోర్ట్‌లు సవరణ 2025 ప్రకారం, అక్టోబర్ 1, 2023, ఆ తర్వాత జన్మించిన దరఖాస్తుదారులు తమ బర్త్ డేకు ఏకైక రుజువుగా జనన ధృవీకరణ పత్రాన్ని సమర్పించాల్సి ఉంటుందని కేంద్రం వెల్లడించింది. ఈ మేరకు అధికారిక గెజిట్‌ నోటిఫికేషన్ విడుదల చేసింది. దేశవ్యాప్తంగా పాస్‌ పోర్ట్ దరఖాస్తుల కోసం జనన రికార్డులను ధృవీకరించే ప్రక్రియను ప్రామాణీకరించడం లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకుంది.

కొత్త దరఖాస్తుదారుల కొత్త నియమం

Advertisement

తాజా సవరణ ప్రకారం, అక్టోబర్ 1, 2023న, ఆ తర్వాత జన్మించిన వ్యక్తులు జనన మరణాల రిజిస్ట్రార్, మునిసిపల్ కార్పొరేషన్, జనన మరణాల నమోదు చట్టం, 1969 కింద అధికారం పొందిన ఏదైనా ఇతర అధికారి జారీ చేసిన జనన ధృవీకరణ పత్రాన్ని కచ్చితంగా సమర్పించాలి. ఈ నియమం జనన ధృవీకరణ పత్రాన్నిపాస్‌పోర్ట్ దరఖాస్తుదారుల బర్త్ డేను కన్ఫర్మ్ చేసేందుకు చెల్లుబాటు అయ్యే ఒకేఒక్క డాక్యుమెంట్ గా గుర్తిస్తుంది. ఈ మార్పు అధికారికంగా నమోదు చేయబడిన జనన రికార్డుల వినియోగాన్ని బలోపేతం చేస్తుందని, ధృవీకరణ ప్రక్రియను క్రమబద్ధీకరిస్తుందని కేంద్రం భావిస్తుంది.

పాత దరఖాస్తుదారుల  పరిస్థితి ఏంటి?

అక్టోబర్ 1, 2023కి ముందు జన్మించిన దరఖాస్తుదారులకు, ఈ రూల్ వర్తించదు. వారు పుట్టిన తేదీకి రుజువుగా ప్రస్తుతం అమల్లో ఉన్న డాక్యుమెంట్స్ ను కన్సిడర్ చేస్తారు. వీటిలో జనన ధృవీకరణ పత్రం, స్కూల్ టీసీ, టెన్త్ క్లాస్ మార్క్స్ లిస్ట్,  పాన్ కార్డ్, డ్రైవింగ్ లైసెన్స్, ఓటరు గుర్తింపు కార్డు, ప్రభుత్వ ఉద్యోగుల కోసం సర్వీస్ రికార్డులు, లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, ఇతర ప్రభుత్వ సంస్థలు జారీ చేసిన బీమా పాలసీ బాండ్లలో ఏ ఒక్కటి ఉన్నా సరిపోతుంది.

Advertisement

Read Also: యుద్ధ సమయంలో సంపన్నులు తలదాచుకొనే దేశాలివే.. ఈ ప్రాంతాలు అంత సేఫా?

పాస్‌ పోర్ట్ సేవలలో డాక్యుమెంటేషన్ ప్రమాణాలను మెరుగుపరచడానికి ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నంలో ఈ సవరణ కీలక పాత్రపోషిస్తుందని అధికారులు భావిస్తున్నారు. పాస్‌ పోర్ట్ రూల్స్ 1980, మొదట డిసెంబర్ 1980లో నోటిఫై చేయబడ్డాయి. ఆ తర్వాత పలుమార్లు సవరించారు. సెప్టెంబర్ 2023తో పాటు 2025లోనూ సవరించారు.

Read Also:  నార్త్ కొరియాలో రైళ్ల స్పీడ్ మరీ అంత తక్కువా? వాటిలోనూ జనాలు వెళ్లరా?

Related News

ఈ తప్పులు చేస్తే తిరుమలలో రూమ్ దొరకదు.. టీటీడీ కొత్త గైడ్‌లైన్స్ ఇవే!

చివరి నిమిషంలోనూ కన్ఫర్మ్ సీట్.. రైల్వేలో సీక్రెట్ రూల్ గురించి తెలుసా?

12 రోజుల ఆధ్యాత్మిక యాత్ర.. అదీ EMIలో.. IRCTC ప్యాకేజ్ అదిరింది భయ్యా!

నల్లగొండ జిల్లాలో దాగిన ఉన్న అద్భుతాలు.. ఒక్కో చోట ఒక్కో విశేషం!

దుబాయ్ 5 ఏళ్ల మల్టిపుల్ ఎంట్రీ విజిట్ వీసా.. తక్కువ ధరలోనే.. భారతీయులకు అర్హత వివరాలు

హోటళ్లలో చెక్ ఇన్.. చెక్ అవుట్ ఆ సమయాల్లో ఎందుకు? దీని వెనుక అసలు కారణాలివే?

తాజ్ మహల్ కింద ఉన్న ఆ 22 గదులను ఎందుకు తెరవరు? నిజంగానే అక్కడ నిధులు, విగ్రహాలు ఉన్నాయా?

మాన్సూన్ రోడ్ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? ఈ క్రేజీ రివర్‌ సైడ్ స్పాట్స్ అస్సలు మిస్ అవ్వకండి!

Big Stories

Advertisement
×