E-Paper
Advertisement

Dishwashers Under Rs 25,000: తక్కువ బడ్జెట్‌లో.. అద్భుతమైన కదిలే డిష్ వాషర్లు.. మిడిల్ క్లాస్‌కు పండుగే!

Dishwashers Under Rs 25,000: తక్కువ బడ్జెట్‌లో.. అద్భుతమైన కదిలే డిష్ వాషర్లు.. మిడిల్ క్లాస్‌కు పండుగే!
Advertisement

Dishwashers Under Rs 25,000: కిచెన్ లో వంట పాత్రలను కడిగే అత్యాధునిక డిష్ వాషర్లు ప్రస్తుతం మార్కెట్ లో చాలానే అందుబాటులో ఉన్నాయి. అయితే వీటిలో ప్రీమియం మోడల్ కొనాలంటే రూ.50,000-60,000 ఖర్చు చేయాల్సిందే. అంత మెుత్తంలో ఖర్చు చేసి డిష్ వాషర్ కొనేంత స్తోమత చాలామందికి ఉండకపోవచ్చు. అటువంటి వారికోసమే పోర్టబుల్ టేబుల్ టాప్ (Countertop) డిష్‌వాషర్‌లు అందుబాటులోకి తీసుకొచ్చారు. ప్రస్తుతం రూ.16,000-25,000 మధ్య ఉన్న టాప్ – 5 మోడల్స్, వాటి ఫీచర్లు ఏంటో ఈ కథనంలో పరిశీలిద్దాం.

Voltas Beko 8 Place Settings

వోల్టాస్ బెకో మోడల్.. దేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన టేబుల్ టాప్ డిష్‌వాషర్లలో ఒకటిగా నిలిచింది. ఇది చిన్న కుటుంబాలకు (2-3 సభ్యులు) సరిగ్గా సరిపోతుంది. ఇందులో 6 రకాల వాష్ ప్రోగ్రామ్‌లు (Intensive, Normal, Eco వంటివి) ఉన్నాయి. ఇది 8 లీటర్ల నీటిని మాత్రమే వినియోగిస్తుంది. ఇందులో ‘ఇంటెన్సివ్’ మోడ్ ను సైతం అందించారు. ఇది జిడ్డు, మొండి మరకలను సైతం సమర్థవంతంగా తొలగిస్తుంది. ప్రస్తుతం ఫ్లిప్ కార్ట్ లో ఈ డిష్ వాషర్.. రూ.16,990కి అందుబాటులో ఉంది.

Midea 8 Place Setting Countertop

Advertisement

తక్కువ బడ్జెట్ లో మంచి ప్రీమియం ఫీచర్లు అందించే బ్రాండ్ గా మిడియాకు గుర్తింపు ఉంది. ఈ డిష్ వాషర్.. కాంపాక్ట్ డిజైన్‌తో రూపొందింది. కాబట్టి కిచెన్ లో తక్కువ స్థలంలోనే దీనిని అడ్జస్ట్ చేయవచ్చు. ఇందులో 6 వాష్ సైకిల్స్, 70°C హై-టెంపరేచర్ వాష్ ఫీచర్ ఉన్నాయి. ఇది బ్యాక్టీరియాను చంపడంతో పాటు గిన్నెలను హైజీనిక్‌గా ఉంచుతుంది. ఇందులో ప్రత్యేకంగా గ్లాస్ కేర్ ఆప్షన్ ఉండటం వల్ల గాజు పాత్రలను సైతం ధైర్యంగా ఇందులో వాషింగ్ కు వేయవచ్చు.

Godrej Eon Countertop Dishwasher

గోద్రెజ్ ఇయాన్ సిరీస్ కింద వచ్చిన ఈ టేబుల్ టాప్ మోడల్.. వినియోగదారుల నుంచి పాజిటివ్ ఫీడ్ బ్యాక్ అందుకుంటోంది. ఇది 8 ప్లేస్ సెట్టింగ్‌లతో పనిచేస్తుంది. ఇందులో ఆటో-డ్రై ఫీచర్ ఉండటం వల్ల వాషింగ్ తర్వాత గిన్నెలు త్వరగా ఆరిపోతాయి. దీనిలోని ‘యాంటీ-బాక్టీరియల్ ఫిల్టర్’ ఫీచర్.. నీటిలోని మలినాలను తొలగించి గిన్నెల ద్వారా ఎటువంటి ఇన్ఫెక్షన్లు సోకకుండా కాపాడుతుంది. ఈ డిష్ వాషర్ రూ.15,400 నుంచి రూ.16,500 మధ్య ధర పలుకుతోంది.

Faber 8 Place Setting Ace

Advertisement

ఫాబర్ కంపెనీకి చెందిన ఈ డిష్ వాషర్.. స్టైలిష్ లుక్ తో మెరుగైన పనితీరును కనబరుస్తుంది. ఇందులో 6 వాష్ ప్రోగ్రామ్‌లు ఉన్నాయి. సుమారు 8-10 లీటర్ల నీటితోనే గిన్నెలను శుభ్రంగా కడిగేస్తుంది. ఇది కూడా 65-70 డిగ్రీల వద్ద నీటిని వేడి చేసి.. పాత్రలపై ఉన్న బ్యాక్టీరియాలు, మరకనలు తొలగించేస్తుంది. దీనిలోని ‘డిలే స్టార్ట్’ (Delay Start) ఫీచర్ ద్వారా మనకు కావాల్సిన సమయంలో వాషింగ్ మొదలయ్యేలా సెట్ చేసుకోవచ్చు. ఇది రూ.26,000-27,500 మధ్య సేల్ అవుతోంది.

Also Read: LPG vs PNG: మధ్యతరగతి ఇంటికి.. PNG బెటరా? లేదంటే LPG మంచిదా?

Sharp 8 Place Setting Countertop

షార్ప్ కంపెనీ తన జపాన్ టెక్నాలజీతో ఈ పోర్టబుల్ డిష్‌వాషర్‌ను రూపొందించింది. ఇందులో 7 వాష్ మోడ్స్ ఉన్నాయి. సెల్ఫ్-క్లీన్ ఆప్షన్ ఉండటం వల్ల మెషిన్ దానంతట అదే లోపలి భాగాన్ని క్లీనింగ్ చేసుకుంటుంది. దీనికి అందించిన అల్ట్రా హైజీన్ టెక్నాలజీ.. 99.9 శాతం వరకూ క్రిములను నిర్మూలిస్తుందని కంపెనీ వర్గాలు తెలిపాయి. దీని స్టైలిష్ డిజైన్, డిజిటల్ డిస్ ప్లే.. వినియోగదారుడ్ని ఆకట్టుకుంటాయని పేర్కొన్నాయి.

Also Read: Sony Bravia 8 II OLED: ఓరి దేవుడా.. సూపర్ క్లాస్ సోనీ టీవీపై.. ఎగిరిగంతేసే డిస్కౌంట్!

Related News

బడ్జెట్ ధరలో.. బెస్ట్ వాషింగ్ మెషీన్ హయర్ 6.5 కేజీ టాప్ లోడ్ రివ్యూ?

రూ.20వేలలోపు శామ్‌సంగ్ గెలాక్సీ M36 5G.. ఫోన్ అంటే ఇలా ఉండాలి బాస్

స్టూడెంట్స్ అండ్ యూత్‌కి పండగే..తక్కువ ధరలో ఎక్కువ ఫీచర్లు

వివో మాస్టర్ ప్లాన్ అదిరింది.. మూడు 200 మెగాపిక్సల్ కెమెరాలతో Vivo X500 Ultra ఎంట్రీ!

ఐఫోన్, శాంసంగ్‌లకు దెబ్బ మీద దెబ్బ.. హువావే నుంచి మరో మైండ్ బ్లోయింగ్ ఫోన్, డిజైన్ లీక్!

సిమ్ కార్డుకు ఒక వైపు ఎందుకు కట్ చేసి ఉంటుందో తెలుసా? దీని వెనుక ఉన్న అసలు సీక్రెట్ ఇదే!

అమెజాన్‌లో దుమ్ములేపుతున్న..రెడ్‌మీ లేటెస్ట్ స్మార్ట్‌వాచ్!

వార్నీ.. ఇన్నాళ్లూ స్మార్ట్‌ఫోన్ పవర్ బటన్‌ను వేస్ట్‌గా వాడామా? ఇందులో ఇంత మ్యాజిక్ ఉందా!

Big Stories

Advertisement
×