E-Paper
Advertisement

వాషింగ్ మిషన్ ఒక గంట పనిచేస్తే.. ఎంత కరెంటు బిల్లు వస్తుందో తెలుసా?

వాషింగ్ మిషన్ ఒక గంట పనిచేస్తే.. ఎంత కరెంటు బిల్లు వస్తుందో తెలుసా?
Advertisement

Washing Machine: ప్రస్తుతం ప్రతీ ఇంట్లోనూ వాషింగ్ మిషన్ తప్పనిసరిగా మారిపోయింది. అయితే దీని వాడకం వల్ల కరెంట్ బిల్లు భారీగా పెరుగుతుందనే ఆందోళన చాలా మందిలో ఉంది. ఈ నేపథ్యంలో అసలు వాషింగ్ మిషన్ ఒక గంటకు లేదా ఒక వాష్ సైకిల్‌కు ఎంత విద్యుత్‌ను వినియోగిస్తుందో ఈ ప్రత్యేక కథనంలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

గంటకు వాడే కరెంటు ఎంత?

సాధారణంగా వాషింగ్ మిషన్లు 400 వాట్ల నుండి 2000 వాట్ల వరకు సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి. కేవలం సాధారణ లేదా చల్లటి నీటితో (కోల్డ్ వాష్) బట్టలు ఉతికితే.. మిషన్ గంటకు కేవలం 0.3 నుండి 0.5 యూనిట్ల (kWh) కరెంట్‌ను మాత్రమే తీసుకుంటుంది. అదే ఇన్ బిల్ట్ హీటర్ ఆన్ చేసి వేడి నీటితో (హాట్ వాష్) ఉతికితే మాత్రం.. అది గంటకు 1.5 నుండి 2 యూనిట్ల వరకు కరెంట్‌ను లాగేస్తుంది.

ఖర్చు ఎంతంటే?

Advertisement

సాధారణంగా ఒక పూర్తి వాష్ సైకిల్ (ఉతకడం, పిండడం కలిపి) టైమ్.. వాషింగ్ మిషన్ మోడ్‌ను బట్టి 45 నిమిషాల నుండి గంటన్నర వరకు ఉంటుంది. ఈ లెక్కన కోల్డ్ వాష్ అయితే ఒక సైకిల్‌కు సుమారు 0.5 యూనిట్ల కంటే తక్కువ విద్యుత్ ఖర్చు చేస్తుంది. అలా కాకుండా హాట్ వాష్ అయితే నీటిని వేడి (60 డిగ్రీలు లేదా అంతకంటే ఎక్కువ) చేయడానికి 80 శాతానికి పైగా విద్యుత్ అవసరమవుతుంది. అందువల్ల ఒకే సైకిల్‌కు 1 నుండి 2 యూనిట్ల కరెంట్ ఖర్చవుతుంది. ఈ లెక్కన ప్రస్తుతం యూనిట్ విద్యుత్ ధర రూ.7 అనుకుంటే.. కోల్డ్ వాష్ కు రూ.3.5, హాట్ వాష్ కు రూ.7-14 ఖర్చు అవుతుందని చెప్పవచ్చు.

టాప్ లోడ్ వర్సెస్ ఫ్రంట్ లోడ్

సాధారణంగా టాప్ లోడ్ కంటే ఫ్రంట్ లోడ్ వాషింగ్ మిషన్లు ఎక్కువ సామర్థ్యం కలిగి ఉంటాయి. ఇవి తక్కువ నీటిని, తక్కువ విద్యుత్‌ను (సుమారు సైకిల్‌కు 0.5 – 1 యూనిట్) వాడుకుంటాయి. అదే టాప్ లోడ్ మెషీన్లు కొంచెం ఎక్కువ విద్యుత్‌ను (సైకిల్‌కు 1 – 2 యూనిట్లు) వినియోగిస్తాయి. విద్యుత్ ఆదా పరంగా చూస్తే ఫ్రంట్ లోడ్ బెస్ట్ అని చెప్పవచ్చు.

Advertisement

Also Read: AC Side Effects: అతిగా ఏసీలో ఉంటే.. మీ శరీరంలో జరిగే మార్పులు ఇవే.. ఏ క్షణమైనా..!

కరెంట్ ఆదా చిట్కాలు

వాషింగ్ మిషన్ ద్వారా కరెంటును ఆదా చేసే చిట్కాలను నిపుణులు సూచిస్తున్నారు. ఇందుకోసం బట్టలను సాధారణ చల్లని నీటిలోనే ఉతకడం మంచిదని పేర్కొంటున్నారు. దీనివల్ల దాదాపు 40 శాతం కరెంట్ ఆదా అవుతుందని స్పష్టం చేస్తున్నారు. అలాగే మిషన్ పూర్తిగా నిండినప్పుడు మాత్రమే వాష్ సైకిల్ రన్ చేయడం మంచిదని పేర్కొంటున్నారు. 5 స్టార్ ఎనర్జీ రేటింగ్ ఉన్న ఇన్వర్టర్ మోడళ్లను ఎంచుకోవడం ద్వారా కూడా కరెంట్ బిల్లును భారీగా తగ్గించుకోవచ్చని హితవు పలుకుతున్నారు.

Also Read: సముద్ర తీర జిల్లాల్లో ఏసీ కొంటున్నారా? జాగ్రత్త భయ్యో.. ఈ తప్పులు అస్సలు చేయకండి!

Related News

ఈ సీక్రెట్ ట్రిక్స్ తెలిస్తే.. రోజంతా ఏసీ, ఫ్రిజ్ వాడినా కరెంట్ బిల్లు సగమే!

ట్రెండింగ్ vs యూజ్‌ఫుల్.. గ్యాడ్జెట్స్ కొనేముందు ఈ క్లారిటీ లేకపోతే డబ్బులు వేస్టే!

ఫోన్ ధర రూ.1.68 లక్షలు.. అయినా తగ్గదేలే అంటున్న జనాలు, iPhone Duoలో అంతలా ఏముంది?

చేతిలో ఇమిడిపోయే ప్రింటర్‌ తెచ్చిన షావోమీ.. దీని స్మార్ట్ ఫీచర్లు చూస్తే ఎవరైనా వావ్ అనాల్సిందే!

మన మాటల్ని సీక్రెట్‌గా రికార్డ్ చేసే AI డివైజ్‌లు.. అమెజాన్ కొత్త ప్రయోగం ఇదే!

ఒక్క రూపాయి ఖర్చు లేకుండా క్రెడిట్ కార్డ్ పాయింట్లను క్యాష్‌గా మార్చడం ఎలా?

నకిలీ QR కోడ్‌లను స్కాన్ చేసే ముందే ఇలా కనిపెట్టండి.. ఈ చిన్న ట్రిక్ తెలిస్తే మీ డబ్బు సేఫ్!

గూగుల్ ప్లేస్టోర్‌లో ఫేక్ వాట్సప్ యాప్.. అసలైనదో కాదో ఎలా గుర్తించాలి?

Big Stories

Advertisement
×