E-Paper
Advertisement

BSNL Prepaid Plan: తక్కువ ధరలో సూపర్ స్పీడ్ ఇంటర్నెట్.. BSNL తీసుకొచ్చిన ఈ కొత్త ప్లాన్ అదిరిపోయింది!

BSNL Prepaid Plan: తక్కువ ధరలో సూపర్ స్పీడ్ ఇంటర్నెట్.. BSNL తీసుకొచ్చిన ఈ కొత్త ప్లాన్ అదిరిపోయింది!
Advertisement

BSNL Prepaid Plan: ప్రభుత్వరంగ టెలికం సంస్థ BSNL తన కస్టమర్లకు గుడ్‌న్యూస్‌ చెప్పింది. అటు మొబైల్ వినియోగదారుల కోసం ఒక లాంగ్ టర్మ్ ప్లాన్‌ను, ఇటు బ్రాడ్‌బ్యాండ్ యూజర్ల కోసం అదిరిపోయే డిస్కౌంట్‌ను ప్రకటించింది. ప్రైవేట్ టెలికాం సంస్థలు ధరలు పెంచుతున్న తరుణంలో.. ప్రభుత్వ రంగ సంస్థ అయిన బీఎస్‌ఎన్ఎల్ తీసుకున్న ఈ నిర్ణయం సామాన్యులకు ఊరటనిస్తోంది.

రోజుకు 2.6GB డేటా..

మొబైల్ యూజర్ల కోసం BSNL ‘భారత్ కనెక్ట్’ పేరుతో ఒక కొత్త లాంగ్ టర్మ్ ప్రీపెయిడ్ ప్లాన్‌ను తీసుకొచ్చింది. దీని ధర రూ.2,626గా నిర్ణయించారు. దీనిలో భాగంగా ఒక్కసారి రీఛార్జ్ చేసుకుంటే.. ఏడాది పొడవునా టెన్షన్ ఉండదు. దీనిలో రోజుకు 2.6GB హై స్పీడ్ డేటాతో పాటు అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్, రోజుకు 100 ఎస్ఎంఎస్‌లు లభిస్తాయి. అయితే, ఇది పరిమిత కాల ఆఫర్ మాత్రమే. జనవరి 24 నుండి ఫిబ్రవరి 24 మధ్య రీఛార్జ్ చేసుకున్న వారికి మాత్రమే ఈ ప్రయోజనం అందుతుంది.

Advertisement

Also Read: 200MP కెమెరాతో రియల్‌మీ 16 ప్రో ఎంట్రీ.. ఫ్లాగ్‌షిప్ ఫోన్లకు గట్టి పోటీ తప్పదేమో!

సూపర్ స్టార్ ప్రీమియం ధర తగ్గింపు..

ఈ ఆఫర్ కేవలం మొబైల్ మాత్రమే కాదు.. బ్రాడ్‌బ్యాండ్ రంగంలోనూ BSNL సంచలన నిర్ణయం తీసుకుంది. గతంలో రూ.999గా ఉన్న ‘సూపర్ స్టార్ ప్రీమియం’ ప్లాన్ ధరను ఇప్పుడు రూ.799కి తగ్గించింది. తద్వారా 200Mbps స్పీడ్‌తో నెలకు 5,000GB డేటా లభిస్తుంది. అంతేకాదు.. ఒకేసారి 12 నెలలకు చెల్లిస్తే అదనంగా మరో 20% డిస్కౌంట్ కూడా పొందొచ్చు. ఈ ఆఫర్ మార్చి 31 వరకు అందుబాటులో ఉంటుంది.

ఓటీటీ సబ్‌స్క్రిప్షన్స్ ఫ్రీ..

Advertisement

ఈ బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్ తీసుకునే వారికి Sony LIV, Lionsgate, JioHotstar, Hungama వంటి ప్రముఖ OTT ప్లాట్‌ఫామ్స్ ద్వారా ఫ్రీగా మూవీస్, వెబ్‌సిరీస్ చూసుకోవచ్చు. కొత్తగా ప్లాన్ తీసుకోవాలనుకునే వారు లేదా పాత ప్లాన్ నుండి అప్‌గ్రేడ్ అవ్వాలనుకునే వారు బీఎస్‌ఎన్ఎల్ అఫీషియల్ వెబ్‌సైట్ లేదా వాట్సాప్ చాట్‌బాట్ ద్వారా రీఛార్జ్ చేసుకోవచ్చు.

Also Read: ఒక్కసారి ఛార్జ్ చేస్తే 4 రోజులు వాడొచ్చు.. వివో Y31d షాకింగ్ ఫీచర్లు ఇవే!

Related News

ట్రాయ్ దెబ్బకు దిగొచ్చిన Airtel.. కేవలం కాల్స్, ఎస్‌ఎంఎస్‌ల కోసం కొత్త రీఛార్జ్ ప్లాన్లు!

పిక్సెల్ ఫ్యాన్స్‌కు పూనకాలు తెప్పించే న్యూస్.. దీపావళి సేల్‌లో భారీ తగ్గింపులు, నవంబర్ 8 వరకే ఛాన్స్!

ఫ్లిప్‌కార్ట్‌లో iPhone 17పై ఊహించని భారీ తగ్గింపు.. ఇంత తక్కువ ధరకు ఎప్పుడూ చూడలేదు!

వెదర్ రిపోర్ట్స్ ఇకపై వంద శాతం పక్కా.. మైక్రోసాఫ్ట్ సంచలన ప్రయోగం!

ఆకాశంలో ఓ అరుదైన నక్షత్రాన్ని కనిపెట్టిన సైంటిస్టులు.. ఇది ఎరంగులో ఉందంటే..?

సెకండ్ హ్యాండ్ మొబైల్ కొంటున్నారా? మోసపోకూడదంటే ఈ 5 విషయాలు కచ్చితంగా చెక్ చేయండి!

ఓటీపీ షేర్ చేసి పొరపాటు చేశారా? మీ డబ్బు కాపాడుకోవడానికి.. వెంటనే ఈ 5 పనులు చేయండి!

స్మార్ట్‌వాచ్‌ vs ఫిట్‌నెస్ బ్యాండ్.. రెండింటిలో ఫీచర్లు ఒకటేనా? ఏది కొంటే మన డబ్బులు వృధా కావు?

Big Stories

Advertisement
×