E-Paper
Advertisement

BSNL ఐకానిక్ రీఛార్జ్ ప్లాన్.. కేవలం ఒక్క రూపాయికే.. నెలంతా అపరిమిత సేవలు!

BSNL ఐకానిక్ రీఛార్జ్ ప్లాన్.. కేవలం ఒక్క రూపాయికే.. నెలంతా అపరిమిత సేవలు!
Advertisement

BSNL Rs 1 Plan: ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ బీఎస్ఎన్ఎల్ సంచలన నిర్ణయం తీసుకుంది. మరోమారు తన పాత ఐకానిక్ రూ.1 ప్లాన్ ను తిరిగి అందుబాటులోకి తీసుకొచ్చింది. కేవలం ఒక్క రూపాయికే నెల రోజుల పాటు అపరిమిత సేవలను దీని ద్వారా యూజర్ పొందవచ్చు. ఇంతకీ ఈ ప్లాన్ వివరాలు ఏంటీ? ఎవరు దీనికి అర్హులు? వంటి వివరాలు ఈ కథనంలో పరిశీలిద్దాం.

రూ. 1 ప్లాన్ ప్రయోజనాలు..

ఈ రూపాయి ప్లాన్ ను నెల రోజుల వ్యాలిడిటీతో బీఎస్ఎన్ఎల్ తీసుకొచ్చింది. దీని కింద యూజర్ ప్రతీరోజూ 2GB హై స్పీడ్ డేటా పొందవచ్చు. అంటే నెల మొత్తం మీద 60GB డేటా వినియోగదారులకు లభిస్తుంది. ఇది కాకుండా ఏ నెట్ వర్క్ కైనా అపరిమిత కాల్స్ చేసుకోవచ్చు. రోజుకు 100 ఉచిత ఎస్ఎంఎస్ లు సైతం రూ.1 ప్లాన్ లో లభిస్తాయి.

ఎవరూ అర్హులు..!

Advertisement

అయితే కొత్తగా బీఎస్ఎన్ఎల్ సిమ్ తీసుకున్నవారికి మాత్రమే ఈ రూ.1 ప్లాన్ వర్తిస్తుంది. అలాగే ఇతర నెట్ వర్క్ (Jio, Airtel, Vi) నుండి బీఎస్‌ఎన్ఎల్‌కు పోర్ట్ (MNP) అయ్యే వారికి మాత్రమే లభిస్తుంది. పాత బీఎస్ఎన్ఎల్ కస్టమర్లకు ఇది అందుబాటులో ఉండదని టెలికాం వర్గాలు స్పష్టం చేశాయి. రూ.ప్లాన్ కింద ఉచిత సిమ్ కార్డు సైతం అందించనున్నట్లు తెలియజేశారు.

ఏప్రిల్ 30 వరకూ మాత్రమే..

బీఎస్ఎన్ఎల్ ఈ రూ.1 ప్లాన్ ను పరిమిత కాలానికి మాత్రమే తీసుకొచ్చింది. ఏప్రిల్ 30లోపు బీఎస్ఎన్ఎల్ కొత్త సిమ్ తీసుకునేవారికి మాత్రమే ఈ ప్లాన్ వర్తించనుంది. ఈ ప్లాన్ పొందాలంటే నేరుగా బీఎస్‌ఎన్ఎల్ కస్టమర్ సర్వీస్ సెంటర్ లేదా సంబంధిత రిటైలర్ వద్దకు వెళ్లి కేవైసీ పూర్తి చేయాల్సి ఉంటుంది.

Advertisement

Also Read: షావోమీ కొత్త ఏసీ లాంచ్.. ప్రకృతిలో ఉన్నంత చల్లదనం.. అదిరిపోయింది భయ్యా!

ఈ ఆఫర్ ఇప్పుడే ఎందుకు?

ఎయిర్ టెల్, జియో, వీఐ వంటి ప్రైవేటు టెలికాం సంస్థలు త్వరలోనే రీఛార్జ్ ప్లాన్స్ ను పెంచుతామంటూ సంకేతాలు ఇస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఎక్కువ మంది కస్టమర్లను ఆకర్షించేందుకు, తన 4G నెట్ వర్క్ సామర్థ్యాన్ని పరీక్షించుకునేందుకు జియో ఈ ఫ్రీడమ్ ప్లాన్ ను మళ్లీ తెరపైకి తీసుకొచ్చినట్లు తెలుస్తోంది. తక్కువ ఖర్చుతో సెకండరీ సిమ్ కావాలనుకునేవారికి ఇది బెస్ట్ ఛాన్స్ అని చెప్పవచ్చు. అలాగే ఎంతోకాలంగా బీఎస్ఎన్ఎల్ నెట్ వర్క్ కు మారాలని భావిస్తున్నవారికి సైతం ఇది మంచి అవకాశం.

Also Read: దుమ్మురేపే ప్లాన్.. ఏడాది పాటు రోజూ 2GB డేటా.. ఫ్రీగా హాట్‌స్టార్, అమెజాన్ ప్రైమ్!

Related News

అదే జరిగితే.. ఈ నగరాలన్నీ కనుమరుగు? వరద ఎన్ని ‘అంతస్తుల ఎత్తు’లో దూసుకెళ్తుందంటే?

స్టైలిష్ లుక్..అల్టిమేట్ సౌండ్,యూత్‌ను ఫిదా చేస్తున్న సౌండ్ బార్

పాకెట్ సైజ్ బడ్జెట్ పవర్ బ్యాంక్..రూ.898కే బెస్ట్ మోడల్

నీళ్లు, చెత్తను ఒకేసారి శుభ్రం చేసే..అద్భుతమైన టూల్!

రూ.10వేలకే.. శామ్‌సంగ్ వాషింగ్ మెషీన్,ఆఫర్ కొన్ని రోజులే!

రూ.5,290 ధరకే 30W బేస్ స్మార్ట్ టీవీ..ఇక ఇల్లు దద్దరిల్లిపోవాల్సిందే !

రూ.7,490 కే 7.5 కేజీల కెపాసిటీనా? ఇంతమంచి వాషింగ్ మెషీన్ అస్సలు మిస్సవ్వొద్దు

చార్జింగ్ టెన్షన్ లేదు, లుక్ అద్దిరిపోతుంది.. ఈ ట్రెండింగ్ స్మార్ట్‌వాచ్ మీకోసమే!

Big Stories

Advertisement
×