ఈ రోజుల్లో మంచి ఉద్యోగం సంపాదించడం చాలా కష్టం అయిపోయింది. చదువు ఉన్నా, టాలెంట్ ఉన్నా కూడా చాలా మంది ఇంటర్వ్యూల్లో సక్సెస్ కాలేకపోతున్నారు. కొంతమందికి టెన్షన్, ఇంకొంతమందికి భయం, మరికొంతమందికి కాన్ఫిడెన్స్ లేకపోవడం వల్ల అవకాశాలు కోల్పోతున్నారు. ఇలాంటి సమయంలో జ్యోతిష్య శాస్త్రంలో ప్రసిద్ధి చెందిన లాల్ కితాబ్ కొన్ని సింపుల్ ఉపాయాలు సూచిస్తోంది. వీటిని పాటిస్తే ఇంటర్వ్యూలో మంచి ఫలితం పొందే అవకాశాలు పెరుగుతాయని నమ్మకం ఉంది.
మనసు ప్రశాంతంగా
లాల్ కితాబ్ ప్రకారం ఇంటర్వ్యూకి వెళ్లే ముందు మన మనసు ప్రశాంతంగా ఉండటం చాలా ముఖ్యం. ఇంటి నుంచి బయలుదేరే ముందు దేవుడిని కాసేపు ప్రార్థించాలి. ఇలా చేయడం వల్ల మనలోని భయం తగ్గి, ధైర్యం పెరుగుతుంది. అలాగే ఇంటి నుంచి బయటకు వెళ్లేటప్పుడు కుడి కాలుతో ముందుగా అడుగు వేయాలని చెబుతారు. ఇది శుభ సూచకంగా భావిస్తారు. చిన్న విషయమే అయినా, మనలో పాజిటివ్ ఫీలింగ్ తీసుకువస్తుంది.
Also read: Magic Drink: భోజనం తరువాత ఈ ఒక్క డ్రింక్ తాగితే చాలు, ఏ సమస్యా రాదు
తీపి తిని వెళ్లండి
ఇంటర్వ్యూకి వెళ్లే ముందు కొద్దిగా తీపి తినడం మంచిదట. ముఖ్యంగా పెరుగు, చక్కెర లేదా తీపి పదార్థం తింటే మన మైండ్ కూల్‌గా ఉంటుంది. మాట్లాడేటప్పుడు క్లారిటీ వస్తుంది. చాలా మంది పెద్దలు కూడా తీపి తిన్నాకే పని మొదలు పెట్టమని అని చెబుతుంటారు. ఇంటర్వ్యూకి వెళ్లేటప్పుడు మనం వేసుకునే దుస్తులు కూడా చాలా ముఖ్యమే. లాల్ కితాబ్ ప్రకారం లైట్ కలర్స్ లేదా శుభంగా కనిపించే రంగులు వేసుకోవడం మంచిది. ఉదాహరణకు తెలుపు, లైట్ బ్లూ, క్రీమ్ కలర్ వంటి దుస్తులు మనకు ప్రశాంతతను ఇస్తాయి. అలాగే అవి చూసేవారికి కూడా మంచి ఇంప్రెషన్ ఇస్తాయి. దుస్తులు ఎప్పుడూ క్లీన్‌గా, ఇస్త్రీ చేసి ఉండాలి. ఇది మన డిసిప్లిన్, మన వ్యక్తిత్వాన్ని చూపిస్తుంది.
జేబులో ఉండాల్సినవి
మరికొన్ని ఉపాయాల ప్రకారం జేబులో చిన్న శుభ సూచక వస్తువు పెట్టుకుని వెళ్లడం కూడా మంచిదని చెబుతారు. ఉదాహరణకు దేవుడి ఫోటో, చిన్న పూజా వస్తువు లేదా మనకు నమ్మకం ఉన్న ఏదైనా వస్తువు. ఇది మనకు మానసికంగా ధైర్యం ఇస్తుంది. మనం ఒంటరిగా లేమనే భావన కలుగుతుంది. ఇంటర్వ్యూలో ఎలా మాట్లాడాలో కూడా చాలా ముఖ్యం. మనకు తెలిసిన విషయాలను నమ్మకంగా చెప్పాలి. తెలియని ప్రశ్నలకి అర్థం లేని సమాధానాలు చెప్పకుండా, తెలియదు అని చెప్పడం కూడా మంచిదే.
బాడీ లాంగ్వేజ్
ఇంటర్వ్యూలో కూర్చునే విధానం, మాట్లాడే తీరు, ముఖంలో భావాలు ఇవన్నీ కూడా ప్రభావం చూపుతాయి. కళ్ళలోకి చూసి మాట్లాడటం, చిరునవ్వుతో సమాధానం ఇవ్వడం, శాంతంగా ఉండటం ఇవన్నీ మంచి ఇంప్రెషన్ ఇస్తాయి. ఈ లాల్ కితాబ్ ఉపాయాలు మనకు మానసిక ధైర్యం ఇవ్వడానికి మాత్రమే. కానీ అసలు విజయానికి కారణం మన కష్టం, ప్రిపరేషన్, కాన్ఫిడెన్స్.