E-Paper
Advertisement

వేసవిలో కూడా పెరటి తోట పచ్చగా ఉండాలంటే.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి!

వేసవిలో కూడా పెరటి తోట పచ్చగా ఉండాలంటే.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి!
Advertisement

Summer Tips: ఎండలు ముదిరిపోతున్నాయి.. బయట అడుగు పెట్టాలంటేనే భయం వేస్తోంది. మనుషులకే ఇంతలా వేడిగా ఉంటే.. పాపం ఎండలోనే ఉండిపోయే ఈ మొక్కల పరిస్థితి ఏంటి? నోరు లేని ఆ జీవాలు కూడా ఈ సెగకు విలవిలలాడి పోతుంటాయి. మనం దాహం వేస్తే మంచి నీళ్లు తాగుతాం.. ఎండ ఎక్కువైతే ఏ ఫ్యాన్ కిందకో వెళ్తాం. కానీ మొక్కలు ఉన్నచోటే ఉండి ఆ తాపాన్ని భరించాలి. ఈ వేసవిలో మీ మిద్దె తోట లేదంటే పెరటి తోటలు వాడిపోకుండా ఉండాలంటే, మొక్కలు పచ్చగా కళకళలాడాలంటే ఈ చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకుంటే సరి.

నీళ్లు పోసే టైం చాలా ముఖ్యం..

మొక్కలకు నీళ్లు ఎప్పుడు పడితే అప్పుడు పోయకూడదు. ముఖ్యంగా ఎండలు మండిపోతున్న మధ్యాహ్నం వేళ అస్సలు నీళ్లు పట్టొద్దు. ఎందుకంటే.. ఆ సమయంలో నేల బాగా వేడిగా ఉంటుంది. ఈ క్రమంలో నీళ్లు పోయగానే అవి వెంటనే ఆవిరైపోతాయి. పైగా వేడి మట్టిలో చల్లటి నీళ్లు పోస్తే వేర్లకు దెబ్బ తగిలే ప్రమాదం ఉంది. అందుకే పొద్దున్నే ఎండ రాకముందే లేదంటే సాయంత్రం చల్లబడ్డాక నీళ్లు పట్టండి. వీలైతే ఆకులపై కూడా నీళ్లు చిలకరిస్తే మొక్కలకు కాస్త ఊరటగా ఉంటుంది.

మట్టి చల్లగా ఉండాలంటే..

Advertisement

కుండీల్లోని మట్టి త్వరగా ఎండిపోకుండా ఉండాలంటే ఈ ‘మల్చింగ్’ ట్రిక్ ఫాలో అవ్వండి. వినడానికి ఇదేదో వింత పదంలా ఉన్నా.. ఈ పని చేయడం చాలా సింపుల్. ఎండుటాకులు, కొబ్బరి పీచు లేదా ఎండిన గడ్డిని తీసుకుని మొక్క మొదలు చుట్టూ ఒక పొరలా వేయండి. ఇది మట్టికి ఒక దుప్పటిలా పనిచేస్తుంది. సూర్యరశ్మి నేరుగా మట్టి మీద పడదు కాబట్టి.. తేమ ఎక్కువ సేపు ఉంటుంది. దీనివల్ల మొక్క వేర్లు చల్లబడి, హాయిగా పెరుగుతాయి.

Also Read: ఏసీయే ఉండాలా ఏంటి.. కర్టెన్లు, ఇండోర్ ప్లాంట్స్‌తో ఇంటి ఉష్ణోగ్రతను తగ్గించుకోండిలా!

మొక్కలకూ నీడ అవసరం..

Advertisement

మరీ సున్నితమైన చిన్న మొక్కలు ఉన్నాయనుకోండి.. వాటికి ఈ ఎండను తట్టుకునే శక్తి ఉండదు. అలాంటి వాటి కోసం గ్రీన్ నెట్లు వాడటం మంచిది. ఒకవేళ అది కుదరకపోతే, మధ్యాహ్నం ఎండ తగలకుండా కుండీలను కాస్త నీడ ఉన్న చోటికి జరపండి. మిద్దె తోటలు ఉన్నవారు అన్ని కుండీలను విడివిడిగా కాకుండా ఒకే దగ్గర గుంపుగా చేర్చండి. ఇలా చేయడం వల్ల ఒక మొక్క నుంచి వచ్చే తేమను ఇంకో మొక్క గ్రహించి, చుట్టుపక్కల వాతావరణం చల్లగా ఉంటుంది.

ఎరువుల జోలికి ఇప్పుడే వెళ్లొద్దు..

వేసవిలో మొక్కలకు రసాయన ఎరువులు వేయకపోవడమే మంచిది. ఎందుకంటే.. ఆ ఎరువులు కూడా వేడిని పుట్టిస్తాయి. ఎండకు తోడు ఈ వేడి కూడా కలిస్తే మొక్క త్వరగా మాడిపోయే అవకాశం ఉంది. ఈ రెండు మూడు నెలలు కెమికల్స్ ఆపేసి.. సహజంగా దొరికే బియ్యం కడిగిన నీళ్లు, పప్పు కడిగిన నీళ్లు లాంటివి పోయండి. ఇవి మొక్కలకు బలాన్ని ఇస్తాయి. ఈ చిన్నపాటి జాగ్రత్తలు పాటిస్తే చాలు.. ఇంటి తోట ఈ ఎండాకాలాన్ని హాయిగా దాటేస్తుంది.

Also Read: అమ్మో, ఇన్ని రోజులు తెలియక పారేశామే.. సిలికా జెల్ ప్యాకెట్స్‌తో ఇన్ని బెనిఫిట్సా!

Related News

సండే స్పెషల్.. ఎప్పుడూ ఒకేలా కాకుండా మటన్‌ను ఇలా గ్రీన్‌గా వండి చూడండి.. వేళ్లు నాకేస్తారు!

అరకు ఫేమస్ బొంగు చికెన్.. తింటే జీవితంలో ఆ రుచిని మర్చిపోరు, ఎలా చేయాలో తెలుసా?

జంక్ ఫుడ్ తింటే క్యాన్సర్ రాదా? 4.6 లక్షల మందిపై జరిగిన అధ్యయనంలో షాకింగ్ విషయాలు!

మీ పిల్లాడు ఆలస్యంగా మాట్లాడుతున్నాడా? త్వరగా మాట్లాడేందుకు డాక్టర్ చెప్పిన టిప్స్ ఇవే

మీ జీవిత భాగస్వామిలో బలహీనతలే కాదు ఈ మంచి లక్షణాలు కూడా గమనించండి.. రిలేషన్‌షిప్‌లో చాలా ముఖ్యం

ఉదయం లేవగానే గర్ల్‌ఫ్రెండ్‌‌తో చాటింగ్ చేస్తున్నారా? ఈ 5 విషయాలు చెబితే బ్రేకప్ ప్రమాదం

52 ఏళ్ల వయసులో తల్లి కాబోతున్న ప్రముఖ నటి.. ఆ వయసులో గర్భం దాల్చడం ఆరోగ్యకరమేనా?

పిల్లల్లో డిప్రెషన్ ముప్పును తగ్గించే చిన్ననాటి అనుభవాలు ఇవే.. పేరెంట్స్ ఇవి తప్పక తెలుసుకోవాలి!

Big Stories

Advertisement
×