E-Paper
Advertisement

BSNL నమ్మశక్యం కాని ఆఫర్.. 330 రోజుల పాటు.. అపరిమిత కాల్స్, డేటా!

BSNL నమ్మశక్యం కాని ఆఫర్.. 330 రోజుల పాటు.. అపరిమిత కాల్స్, డేటా!
Advertisement

BSNL Plans: ప్రైవేట్ కంపెనీల రీఛార్జ్ ధరల పెంపుతో అల్లాడుతున్న సామాన్యులకు.. ప్రభుత్వ రంగ సంస్థ బీఎస్‌ఎన్‌ఎల్ (BSNL) వరుసగా తీపి కబురు అందిస్తోంది. తక్కువ ధరలో ఎక్కువ వ్యాలిడిటీ కోరుకునే కస్టమర్ల కోసం బీఎస్‌ఎన్‌ఎల్ ఎప్పటికప్పుడు సరికొత్త చౌకైన ప్లాన్స్ ను అందిస్తోంది. ఈ క్రమంలోనే తీసుకొచ్చిన ఓ వార్షిక ప్లాన్.. బీఎస్ఎన్ఎల్ యూజర్లను విశేషంగా ఆకట్టుకుంటోంది. నెలకు కేవలం రూ. 182 ఖర్చుతో ఏకంగా 330 రోజుల పాటు ఎలాంటి టెన్షన్ లేకుండా మొబైల్ సేవలను ఉపయోగించుకునే అవకాశాన్ని ఈ ప్లాన్ ద్వారా బీఎస్ఎన్ఎల్ కల్పిస్తోంది. ఇంతకి ఈ ప్లాన్ ధర ఎంత? దీనిని రీఛార్జ్ చేసుకోవడం వల్ల యూజర్ కు కలిగే లాభాలేంటి? ఈ కథనంలో పరిశీలిద్దాం.

రూ.1999 వార్షిక ప్లాన్..

బీఎస్‌ఎన్‌ఎల్ తీసుకొచ్చిన ఈ రూ.1999 ప్లాన్.. ఏకంగా 330 రోజుల వ్యాలిడిటీని కలిగి ఉంది. అంటే దాదాపు 11 నెలల పాటు మళ్లీ రీఛార్జ్ చేసుకోనే అవసరమే యూజర్ కు ఉండదు. ఈ ప్లాన్ కింద వినియోగదారులు దేశవ్యాప్తంగా ఏ నెట్‌వర్క్‌కైనా అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్ మాట్లాడుకోవచ్చు. దీంతో పాటు ఇంటర్నెట్ అవసరాల కోసం ప్రతిరోజూ 2GB హై-స్పీడ్ డేటా లభిస్తుంది. రోజువారీ డేటా లిమిట్ పూర్తయిన తర్వాత కూడా 40 Kbps వేగంతో ఇంటర్నెట్ బ్రౌజ్ చేసుకోవచ్చు. అలాగే రోజుకు 100 ఉచిత ఎస్ఎంఎస్‌లు కూడా లభిస్తాయి.

కేవలం రూ. 182 మాత్రమే!

Advertisement

ఈ ప్లాన్ మొత్తం ధర రూ. 1,999 గా ఉన్న సంగతి తెలిసిందే. దీన్ని 330 రోజుల వ్యాలిడిటీతో లెక్కించి చూస్తే, వినియోగదారునికి నెలకు అయ్యే ఖర్చు కేవలం రూ. 181.72 (సుమారు రూ. 182) మాత్రమే. అదే రోజుల్లోకి తీసుకుంటే కస్టమర్ కు దాదాపు రూ.6 ఖర్చు అవుతుంది. ప్రస్తుత రోజుల్లో ప్రైవేట్ కంపెనీల్లో కనీస రీఛార్జ్ ప్లాన్లే రూ. 200 నుంచి రూ. 300 దాటేసిన తరుణంలో ఇంత తక్కువ ధరకే అన్‌లిమిటెడ్ కాల్స్, రోజువారీ డేటా లభించడం నిజంగా బీఎస్‌ఎన్‌ఎల్ వినియోగదారులకు పండగే అని చెప్పాలి.

Also Read: Jio సూపర్ ప్లాన్.. ఫ్రీ కాల్స్, 28 రోజుల వ్యాలిడిటీ.. ఇంత తక్కువ ధరకా..!

BSNLపై కస్టమర్ల మెుగ్గు

Advertisement

ఇటీవల కాలంలో జియో, ఎయిర్‌టెల్, వోడాఫోన్ ఐడియా వంటి ప్రైవేట్ సంస్థలు తమ ప్లాన్ల ధరల్లో మార్పులు చేయడం లేదా పెంచడం వంటివి చేస్తున్నాయి. దీంతో చాలా మంది మెుబైల్ యూజర్లు బీఎస్‌ఎన్‌ఎల్ వైపు మళ్లుతున్నట్లు టెలికాం వర్గాలు చెబుతున్నాయి. దానికి తోడు బీఎస్‌ఎన్‌ఎల్ తన 4G సేవలను దేశవ్యాప్తంగా వేగంగా విస్తరిస్తుండటం, ఇలాంటి బడ్జెట్ ఫ్రెండ్లీ ప్లాన్లను ప్రవేశపెడుతుండటంతో ప్రభుత్వ టెలికాం సంస్థకు అడ్వాంటేజ్ గా మారిందని అంటున్నారు.

Also Read: BSNL కొత్త ప్లాన్ చూశారా? రూ.225 చెల్లిస్తే చాలు.. నెలంతా ఇక జాతరే!

Related News

చార్జింగ్ టెన్షన్ లేదు, లుక్ అద్దిరిపోతుంది.. ఈ ట్రెండింగ్ స్మార్ట్‌వాచ్ మీకోసమే!

రూ.34,999 ధరకే హై-ఎండ్ ఫీచర్లా? ఈ లేటెస్ట్ ఫిలిప్స్ టీవీ అదుర్స్!

ఒకసారి ఛార్జ్ చేస్తే రోజుల తరబడి నాన్‌స్టాప్ మ్యూజిక్.. ధర వింటే ఆశ్చర్యపోతారు!

8 గంటలకు పైగా బ్యాకప్ ఇచ్చే.. టాప్ 5 ల్యాప్‌టాప్‌లు ఇవే!

ఆన్‌లైన్ క్లాసులు, నోట్స్ కోసం తక్కువ ధరలో బెస్ట్ ట్యాబ్‌లు

సౌండ్ నెక్స్ట్ లెవెల్ అంతే! బడ్జెట్‌లో.. బెస్ట్ 4K డాల్బీ ఆడియో టీవీలు!

ఇంట్లో Wi-Fi డెడ్ జోన్స్‌కు సింపుల్ సొల్యూషన్.. పాత ఆండ్రాయిడ్ ఫోన్‌తో ఇలా చేయండి!

వాషింగ్ మెషీన్‌ను ఎన్ని రోజులకు ఒకసారి క్లీన్ చేయాలి? ఈ విషయం తెలుసా?

Big Stories

Advertisement
×