E-Paper
Advertisement

సీన్ రివర్స్.. 40 గంటల బ్యాటరీ లైఫ్‌తో మ్యాక్‌బుక్‌లకు చుక్కలు చూపిస్తున్న కొత్త విండోస్ లాప్‌టాప్స్!

సీన్ రివర్స్.. 40 గంటల బ్యాటరీ లైఫ్‌తో మ్యాక్‌బుక్‌లకు చుక్కలు చూపిస్తున్న కొత్త విండోస్ లాప్‌టాప్స్!
Advertisement

Windows Laptops 2026: లాప్‌టాప్ మార్కెట్‌లో ఒకప్పుడు బ్యాటరీ బ్యాకప్ అనగానే అందరికీ గుర్తొచ్చేది యాపిల్ మ్యాక్‌బుక్ మాత్రమే. కానీ 2026 నాటికి ఈ పరిస్థితి పూర్తిగా మారిపోయింది. సరికొత్త టెక్నాలజీ, ఆధునిక చిప్‌సెట్లతో వస్తున్న కొత్త తరం విండోస్ లాప్‌టాప్‌లు ఏకంగా 40 గంటల వరకు బ్యాటరీ లైఫ్‌ను అందిస్తూ యాపిల్ సంస్థకు గట్టి పోటీనిస్తున్నాయి. పనితీరు, ధరల పరంగా విండోస్ లాప్‌టాప్‌లు ఇప్పుడు మ్యాక్‌బుక్‌లకు దీటుగా నిలుస్తున్నాయి.

విండోస్ లాప్‌టాప్స్‌లో సరికొత్త విప్లవం:

ఒకప్పుడు విండోస్ లాప్‌టాప్ వాడుతున్నామంటే ఛార్జర్ ఎప్పుడూ కనెక్ట్ చేసి ఉంచేవాళ్లం. కనీసం 10 గంటలు కూడా బ్యాటరీ రాకపోయేది. కానీ స్నాప్‌డ్రాగన్ ఎక్స్ ఎలైట్, ఇంటెల్ పాంథర్ లేక్ లాంటి సరికొత్త ప్రాసెసర్లు వచ్చాక కథ మారిపోయింది. ఈ కొత్త చిప్స్ తక్కువ బ్యాటరీతోనే సూపర్ స్పీడ్‌గా పనిచేస్తాయి. దీనికి తోడు విండోస్ 11 కూడా బ్యాక్‌గ్రౌండ్‌లో అనవసరమైన యాప్స్ రన్ అవ్వకుండా చూసుకుంటోంది. అందుకే ఛార్జింగ్ పెట్టకుండానే పనులు చకచకా జరిగిపోతున్నాయి.

మ్యాక్‌బుక్ హవా ఇంకా తగ్గలేదు:

Advertisement

విండోస్ నుంచి ఎంత పోటీ వచ్చినా, యాపిల్ బ్రాండ్ వాల్యూ మాత్రం తగ్గలేదు. ముఖ్యంగా వీడియో ఎడిటర్స్, సాఫ్ట్‌వేర్ డెవలపర్స్, కాలేజీ స్టూడెంట్స్ ఇప్పటికీ మ్యాక్‌బుక్ ఎయిర్, ప్రో మోడల్స్‌నే తెగ ఇష్టపడుతున్నారు. చేతిలో ఐఫోన్, ఐప్యాడ్ ఉన్నవాళ్లకైతే మ్యాక్‌బుక్ వాడటం చాలా ఈజీగా ఉంటుంది. పైగా వీటి లుక్, డిజైన్, స్క్రీన్ క్వాలిటీతో పాటు 15 నుంచి 22 గంటల దాకా వచ్చే బ్యాటరీ లైఫ్ ఎప్పుడూ వీటికి ప్లస్ పాయింట్సే.

మ్యాక్‌బుక్‌లలో ఉన్న కొన్ని ఇబ్బందులు:

మ్యాక్‌బుక్స్ చూడటానికి క్లాస్‌గా ఉన్నా, అందరికీ సెట్ అవ్వవు. ముఖ్యంగా వీటి రేట్లు సామాన్యుడికి అందుబాటులో ఉండవు. ఒకవేళ RAM లేదా స్టోరేజ్ పెంచుకుందామన్నా కూడా బాగా డబ్బులు పెట్టాల్సిందే. అయితే గేమ్స్ ఎక్కువగా ఆడేవారికి మ్యాక్‌బుక్ సెట్ కాదు. అలాగే వీటిలో కనెక్ట్ చేసుకోవడానికి పోర్టులు తక్కువగా ఉంటాయి కాబట్టి.. ఎక్కడికెళ్లినా అదనంగా అడాప్టర్లు, కన్వర్టర్లు మోసుకుంటూ తిరగాలి.

Advertisement

Also Read: అమెజాన్ బంపర్ ఆఫర్.. రూ.25వేల లోపు 4K QLED టీవీలు.. శాంసంగ్, షావోమీల మోడల్స్‌పై కళ్లుచెదిరే ఆఫర్స్!

బడ్జెట్ పరంగా విండోస్‌దే పైచేయి:

విండోస్ లాప్‌టాప్‌ల బలం ఏమిటంటే.. సామాన్యుల బడ్జెట్‌కి తగ్గట్టు దొరకడమే. కాలేజీ స్టూడెంట్స్ తక్కువ బడ్జెట్ నుంచి మొదలుపెడితే.. ప్రొఫెషనల్స్ వాడే హైఎండ్ లాప్‌టాప్స్ దాకా ఏసస్, హెచ్‌పీ, లెనోవో, డెల్ లాంటి బ్రాండ్లలో వందల ఆప్షన్లు ఉన్నాయి. ముఖ్యంగా గేమర్లకు విండోస్ లాప్‌టాప్స్ ఒక వరం. ఇంజనీరింగ్, అకౌంటింగ్ సాఫ్ట్‌వేర్‌లు కూడా ఇందులో బాగా రన్ అవుతాయి. ఒకవేళ పాడైనా రిపేర్ చేసుకోవడం, పార్ట్స్ మార్చుకోవడం చాలా సులువు.

వినియోగదారులకే లాభం:

వైరస్ భయాలు, కొన్ని అనవసరమైన అప్‌డేట్స్ లాంటి చిన్న చిన్న తలనొప్పులు విండోస్‌లో ఉన్నప్పటికీ, తాజా మార్పులు మాత్రం యూజర్లకు పెద్ద రిలీఫ్ ఇచ్చాయి. కేవలం బ్యాటరీ కోసమే లక్షల రూపాయలు పెట్టి మ్యాక్‌బుక్ కొనాల్సిన అవసరం లేకుండా ప్రస్తుత విండోస్ కంపెనీలు సరికొత్త రికార్డులు సృష్టిస్తున్నాయి. ఈ రెండు కంపెనీల పోటీ వల్ల చివరికి ల్యాప్‌టాప్ కొనే మనలాంటి కస్టమర్లకే మంచి మేలు జరుగుతోంది.

Also Read: ఛార్జింగ్ టెన్షన్‌కు ఎండ్ కార్డ్.. భారీ బ్యాటరీ, గేమింగ్ ఫీచర్లతో అమెజాన్‌లోకి వచ్చేసిన Redmi Turbo 5!

 

Related News

8,100mAh బ్యాటరీ, AI బటన్‌తో హానర్ నుంచి క్రేజీ ఫోన్.. ధరెంతో తెలిస్తే Buy Now నొక్కేస్తారు!

జియో, విఐ బెటర్ అంటున్న యూజర్లు.. ఎయిర్‌టెల్ 5G హాట్‌స్పాట్ బ్యాన్‌పై సోషల్ మీడియాలో ఆగ్రహం!

స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ ప్రాసెసర్, భారీ బ్యాటరీ.. గేమర్స్ కోసం నెక్ట్స్ లెవెల్ టాబ్లెట్ వచ్చేసింది!

కెమెరా పక్కనే మరో డిస్‌ప్లే.. ఇన్ఫినిక్స్ కొత్త బడ్జెట్ ఫోన్ లుక్ చూశారా?

రెడ్‌మీ నోట్ 17కు రీబ్రాండెడ్‌గా Poco X8, M8 పవర్.. ఫీచర్లు, ధరల వివరాలు ఇవే!

ఇంటిని థియేటర్‌గా మార్చే బెస్ట్ బడ్జెట్ పోర్టబుల్ ప్రొజెక్టర్లు.. ధరలు కూడా బడ్జెట్‌లోనే!

Facebook వాడే ప్రతి ఒక్కరూ మార్చాల్సిన 5 సీక్రెట్ సెక్యూరిటీ సెట్టింగ్స్ ఇవే!

iPhone 18 Pro Max లీక్స్.. ఫీచర్లు చూస్తే మైండ్ బ్లాకే, కానీ ఆ ఒక్కటే పెద్ద ట్విస్ట్!

Big Stories

Advertisement
×