E-Paper
Advertisement

ICC- Mohsin Naqvi: ఇండియాకు రాబోతున్న మొహ్సిన్ నఖ్వీ…మోడీ ప‌క్క‌నే సిట్టింగ్ ?

ICC- Mohsin Naqvi: ఇండియాకు రాబోతున్న మొహ్సిన్ నఖ్వీ…మోడీ ప‌క్క‌నే సిట్టింగ్ ?
Advertisement

ICC- Mohsin Naqvi : ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ (Indian Premier League 2026 Tournament) ఉత్కంఠ భరితంగా సాగుతున్న నేపథ్యంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఐపీఎల్ 2026 ఫైనల్ మ్యాచ్ నేపథ్యంలో పాకిస్తాన్ క్రికెట్ బోర్డు చైర్మన్ మొహ్సీన్ న‌ఖ్వీకి (Mohsin Naqvi) ఐసీసీ నుంచి ఆహ్వానం అందింది. అహ్మదాబాద్ నగరంలో ఐసీసీ (ICC) సమావేశాలు, అదే సమయంలో ఇండియన్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్ 2026 ఫైనల్ మ్యాచ్ ఉండనుంది. ఈ క్రమంలోనే ఈ రెండు కార్యక్రమాలకు రావాలని మొహ్సిన్ నఖ్వీకి ఐసీసీ నుంచి పిలుపు వెళ్ళింది. దీంతో భారత పర్యటనకు మొహ్సీన్ న‌ఖ్వీ వస్తారా ? లేదా? అనేది హాట్ టాపిక్ గా మారింది.

Also Read: రాజీవ్ శుక్లా భాగోతం బ‌య‌ట‌పెట్టిన ల‌లిత్ మోడీ…ఐపీఎల్ లో ఛాన్స్ ఇస్తామ‌ని డ‌బ్బులు వ‌సూళ్లు, ప్రైవేట్ వీడియోలు చూపించి !

అహ్మదాబాద్ లో ఐసీసీ సమావేశాలు.. మొహ్సీన్ న‌ఖ్వీకి పిలుపు

Advertisement

ఐసీసీ బోర్డు సమావేశాలు మే 30, 31 తేదీలలో అహ్మదాబాద్ నగరంలో జరగనున్నాయి. దోహాలో జరగాల్సిన ఈ సమావేశాన్ని గల్ఫ్ లో నెలకొన్న ఉద్రిక్తతల కారణంగా అహ్మదాబాద్ నగరానికి మార్చేసింది ICC. అదే సమయంలో మే 31వ తేదీన ఐపీఎల్ ఫైనల్ కూడా అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియంలో (Narendra Modi Stadium in Ahmedabad) జరగనుంది. ఈ కార్యక్రమానికి కూడా అన్ని క్రికెట్ బోర్డుల చైర్మన్ లకు పిలుపు వెళ్ళింది. ఇటు మొహ్సిన్ నఖ్వీని కూడా ఐపీఎల్ ఫైనల్ కు ఆహ్వానించింది ఐసీసీ. ఐసీసీ పిలుపుమేరకు మొహ్సిన్ నఖ్వీ.. ఐపీఎల్ ఫైనల్ చూడడానికి వస్తే.. కీలక పరిణామాలు చోటు చేసుకుంటాయి. ప్రధాని నరేంద్ర మోడీ పక్కనే అహ్మదాబాద్ స్టేడియంలో మొహ్సిన్ నఖ్వీకి కుర్చీ ఏర్పాటు చేయనుంది ఐసీసీ. ఐపీఎల్ ఫైనల్ వ్యూయర్ షిప్ పెంచుకునేందుకు అయినా మోడీ పక్కన మొహ్సిన్ నఖ్వీ కూర్చోబెట్టే ప్రయత్నాలు జరుగుతున్నట్లు వార్తలు వస్తున్నాయి.

మొహ్సిన్ నఖ్వీ ఇండియా పర్యటనకు పాకిస్తాన్ సర్కార్ అడ్డంకులు ?

ఐసీసీ పిలుపుమేరకు ఇండియాలో మొహ్సిన్ నఖ్వీ అడుగు పెట్టాలంటే కచ్చితంగా పాకిస్తాన్ ప్రభుత్వం అనుమతి తీసుకోవాలి. ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మధ్య పరిస్థితులు ఏ మాత్రం బాగాలేవు. ఐసీసీ మ్యాచ్ లు తప్ప ద్వైపాక్షిగా సిరీస్ లు కూడా రద్దు అయ్యాయి. ఇలాంటి క్రమంలో ఇండియాకు మొహ్సిన్ నఖ్వీ రావాలంటే, పాకిస్తాన్ ప్రధాని షాబాజ్ షరీఫ్ అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మధ్య ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో మొహ్సిన్ నఖ్వీకి పర్మిషన్ దక్కకపోవచ్చు అని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అయితే ఐసీసీ ఆదేశాల ప్రకారం కచ్చితంగా మొహ్సిన్ న‌ఖ్వీ ఇండియాకు రావాల్సి ఉంటుంది. ఒకవేళ అలా ఇండియా పర్యటనను స్కిప్ చేస్తే.. పాకిస్తాన్ క్రికెట్ బోర్డుపై ఐసీసీ చర్యలు తీసుకునే అవకాశాలు ఉన్నాయని కూడా అంటున్నారు. మరి మొహ్సిన్ న‌ఖ్వీ పర్యటనలో ఏం జరుగుతుందో చూడాలి.

Advertisement

Also Read: జాకబ్ బెథెల్ గోల్డ్ చైన్ దొంగిలించిన RCB ఫ్యాన్స్ ? పాకిస్తాన్ వెధ‌వ‌ల్లాగా త‌యారు అవుతున్నారంటూ ట్రోల్స్!

 

Related News

మాతో అంతా ఈజీగా ఉండదు.. టీమిండియాకు పీడకల మిగుల్చుతాం…జింబాబ్వే కెప్టెన్ వార్నింగ్

టీమిండియా-పాక్ మ‌ధ్య ఓ సిరీస్ నిర్వ‌హించండి..ICCకి షాహిద్ అఫ్రిది సంచ‌ల‌న లేఖ

పీక‌ల్లోతు అప్పుల్లో కూరుకుపోయిన PCB…మోడీ కాళ్ల ద‌గ్గ‌ర‌కు న‌ఖ్వీ ?

పాకిస్తాన్ వాళ్లు అంద‌రూ చేత‌కానీ వెధ‌వ‌లే..నాకు న‌ర‌కం చూపించారు

“ప్లాస్టిక్ క‌వ‌ర్” లో ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్…అంగంట్లో స‌రుకు కంటే దారుణం, స్పెయిన్ ప‌త‌నం మొద‌లైందంటూ

ఇమామ్ ఉల్ హక్ పెద్ద ద‌ద్ద‌మ్మ‌…త‌న‌ మామ ఇంజ‌మామ్ లాగా బ‌ద్ధ‌క‌స్తుడే

టీమిండియా ఓట‌మిని శాసించిన‌ సామ్‌ కర్రన్..అత‌ను వేసిన మూన్ బాల్స్ కొంప‌ముంచాయి

లార్డ్స్ వన్డేలో బాల్ టాంపరింగ్…శ్రేయస్ అయ్యర్ పై బ్యాన్?

Big Stories

Advertisement
×