E-Paper
Advertisement

KYC సేవలు నిలిపివేత.. 24 గంటల్లో BSNL సిమ్ బ్లాక్.. ఈ ప్రచారంలో నిజమెంత?

KYC సేవలు నిలిపివేత.. 24 గంటల్లో BSNL సిమ్ బ్లాక్.. ఈ ప్రచారంలో నిజమెంత?
Advertisement

BSNL SIM Block Scam: ట్రాయ్ ఆదేశాలంటూ సోషల్ మీడియాలో జరుగుతున్న ఓ ప్రచారం.. ప్రస్తుతం బీఎస్ఎన్ఎల్ యూజర్లను భయాందోళనకు గురిచేస్తుంది. ఇకపై KYC సేవలు అందుబాటులో ఉండవని, 24 గంటల్లో సిమ్ బ్లాక్ అవుతుందని కొందరు BSNL కస్టమర్లకు సందేశాలు వెళ్లడం గందరగోళానికి దారితీసింది. ట్రాయ్ హెచ్చరించినట్లుగా అర్ధం వచ్చేలా ఈ మెసేజ్ లు ఉండటంతో చాలా మంది కంగారు పడుతున్నారు. తమ సిమ్స్ బ్లాక్ లిస్ట్ లోకి వెళ్లిపోతాయన్న భయంతో బీఎస్ఎన్ఎల్ కస్టమర్ కేర్ కు పెద్ద ఎత్తున కాల్స్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఫ్యాక్ట్ చెక్ టీమ్.. ఈ ప్రచారానికి సంబంధించి కీలక విషయాలు బయటపెట్టింది. అదేంటో ఇప్పుడు చూద్దాం.

అదంతా ఫేక్ న్యూస్..

24 గంటల్లో BSNL సిమ్ బ్లాక్ అంటూ జరుగుతున్న ప్రచారం పూర్తి అవాస్తవమని ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (PIB) ఫ్యాక్ట్ చెక్ టీమ్ స్పష్టం చేసింది. అందులో ఏమాత్రం వాస్తవం లేదని కొట్టిపారేసింది. ఆన్ లైన్ మోసాల కోసం సైబర్ కేటుగాళ్లు పన్నిన వలగా దీనిని ధ్రువీకరించింది. కాబట్టి మీ సిమ్ బ్లాక్ అవుతుందని.. దీని నుంచి బయటపడాలంటే ఇలా చేయండి అని ఏమైనా సందేశాలు వస్తే ఎవరూ నమ్మవద్దని ఫ్యాక్ట్ చెక్ టీమ్ అప్రమత్తం చేసింది. పొరపాటున నమ్మి వారు చెప్పినట్లు చేస్తే.. డబ్బులు పోవచ్చని హెచ్చరించింది.

Advertisement

ట్రాయ్ అలా చెప్పదు

అంతేకాకుండా ట్రాయ్ (టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా) అలాంటి సందేశాలు.. వ్యక్తిగతంగా పంపదని PIB ఫ్యాక్ట్ చెక్ టీమ్ తెలియజేసింది. కస్టమర్ల కేవైసీ వివరాలను నిలిపివేయాలని, సిమ్‌లను బ్లాక్ చేయమని ట్రాయ్ నేరుగా ఆదేశించదని స్పష్టం చేసింది. నేరగాళ్లు BSNL లోగోను వాడుతూ అధికారిక లేఖలాంటి నోటీసును పంపిస్తారని.. అందులో ఒక మొబైల్ నంబర్ ఇచ్చి వెంటనే సంప్రదించమని కోరుతున్నట్లు తెలిపింది. ఆ నంబర్‌కు కాల్ చేస్తే ఆధార్, బ్యాంకు వివరాలు అడుగుతారని పేర్కొంది. ఏదైనా థర్డ్ పార్టీ యాప్ డౌన్‌లోడ్ చేయమని సూచిస్తారని చెప్పింది. తద్వారా మీ ఫోన్ లేదా బ్యాంకు అకౌంట్‌ను వారి ఆధీనంలోకి తీసుకుని డబ్బు దోచుకుంటారని హెచ్చరించింది.

Advertisement

Also Read: ఇంట్లో ఏసీ ఉందా? రిమోట్లో ఈ ఒక్క బటన్ నొక్కండి.. తర్వాత జరిగే మ్యాజిక్కే వేరు!

ఈ జాగ్రత్తలు తప్పనిసరి..

బీఎస్ఎన్ఎల్ యూజర్లు తమకు వచ్చే అనుమానాస్పద మెసేజ్‌లలోని లింక్స్‌ను ఎట్టిపరిస్థితుల్లో ఓపెన్ చేయవద్దని ఫ్యాక్ట్ చెక్ టీమ్ స్ఫష్టం చేసింది. ఏదైనా KYC అప్‌డేట్ ఉంటే BSNL అధికారిక యాప్ లేదా నేరుగా BSNL కస్టమర్ సర్వీస్ సెంటర్‌కు వెళ్లి పూర్తి చేసుకోవాలని సూచించింది. అంతేగానీ ఫోన్ కాల్‌లో ఎవరికీ OTPలు లేదా పిన్ నంబర్లు చెప్పవద్దని హితవు పలికింది. ఇటువంటి ఫ్రాడ్ కాల్స్ లేదా మెసేజ్‌లు వస్తే ‘సంచార్ సాతి’ (Sanchar Saathi) పోర్టల్‌లో లేదా నేషనల్ సైబర్ క్రైమ్ హెల్ప్‌లైన్ నంబర్ 1930 కు ఫిర్యాదు చేయాలని పేర్కొంది.

Also Read: Window AC vs Desert Cooler: ఏసీ వాడాలా? కూలర్ వాడాలా? సామాన్యులకు ఏది బెస్ట్?

Related News

వివో మాస్టర్ ప్లాన్ అదిరింది.. మూడు 200 మెగాపిక్సల్ కెమెరాలతో Vivo X500 Ultra ఎంట్రీ!

ఐఫోన్, శాంసంగ్‌లకు దెబ్బ మీద దెబ్బ.. హువావే నుంచి మరో మైండ్ బ్లోయింగ్ ఫోన్, డిజైన్ లీక్!

సిమ్ కార్డుకు ఒక వైపు ఎందుకు కట్ చేసి ఉంటుందో తెలుసా? దీని వెనుక ఉన్న అసలు సీక్రెట్ ఇదే!

అమెజాన్‌లో దుమ్ములేపుతున్న..రెడ్‌మీ లేటెస్ట్ స్మార్ట్‌వాచ్!

వార్నీ.. ఇన్నాళ్లూ స్మార్ట్‌ఫోన్ పవర్ బటన్‌ను వేస్ట్‌గా వాడామా? ఇందులో ఇంత మ్యాజిక్ ఉందా!

బడ్జెట్ ధరలో ప్రీమియం లుక్.. సూపర్ ఏఐ ఫీచర్స్ రియల్‌మీ లేటెస్ట్ స్మార్ట్‌వాచ్

జియో క్యూ1 రిజల్ట్స్.. భారీగా పెరిగిన లాభాలు.. రికార్డు స్థాయిలో కస్టమర్లు!

బిగ్ బ్యాటరీ, క్రేజీ AI ఫీచర్లతో రంగంలోకి దిగనున్న iQOO Z11 Lite 5G.. రేటు కూడా బడ్జెట్‌లోనే!

Big Stories

Advertisement
×