E-Paper
Advertisement

Budget gaming phones: ఐకూ నుంచి రెడ్‌మీ వరకు.. రూ.30వేల బడ్జెట్‌లో పవర్‌ఫుల్ గేమింగ్ ఫోన్లు!

Budget gaming phones: ఐకూ నుంచి రెడ్‌మీ వరకు.. రూ.30వేల బడ్జెట్‌లో పవర్‌ఫుల్ గేమింగ్ ఫోన్లు!
Advertisement

Budget gaming phones: నేటి యువత స్మార్ట్‌ఫోన్‌ను కేవలం కాల్స్ మాట్లాడుకోవడానికి మాత్రమే కాకుండా.. ఆన్‌లైన్ గేమింగ్‌కు ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. ఈ నేపథ్యంలో మంచి గేమింగ్ ఫోన్ కావాలంటే లక్షలు తగలేయాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం మార్కెట్‌లో రూ.30,000 లోపు టాప్ పెర్ఫార్మెన్స్ ఇచ్చే ఫోన్లు బోలెడు ఉన్నాయి. మీరు కూడా పక్కా గేమర్ అయితే.. ఈ ఫోన్లపై ఓ లుక్కేయండి.

OnePlus Nord CE 5

వన్‌ప్లస్ నుంచి వస్తున్న ఈ ఫోన్ గేమర్లకు మెరుగైన పనితీరును అందిస్తుంది. దీనిలో ఉన్న మీడియాటెక్ డైమెన్సిటీ 8350 Apex చిప్‌సెట్ వల్ల గేమ్ ఆడుతున్నప్పుడు ఎక్కడా లాగ్ అవ్వదు. 6.77 అంగుళాల పెద్ద స్క్రీన్, 120Hz రిఫ్రెష్ రేట్ ఉండటంతో విజువల్స్ చాలా స్మూత్‌గా ఉంటాయి. అలాగే ఈ ఫోన్ 7100mAh భారీ బ్యాటరీని కలిగి ఉంది. ఇది 80W SUPERVOOC ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది.

Advertisement

Also Read: 200MP కెమెరాతో రియల్‌మీ 16 ప్రో ఎంట్రీ.. ఫ్లాగ్‌షిప్ ఫోన్లకు గట్టి పోటీ తప్పదేమో!

Redmi Note 15 Pro 5G

చాలామంది కోరుకునేది ఏమిటంటే.. గేమ్ ఆడుతున్నప్పుడు మంచి క్లారిటీ ఉండాలి అని. అలాంటి వారికి రెడ్‌మీ నోట్ 15 ప్రో 5G బెస్ట్ ఛాయిస్. ఇది 1.5K AMOLED డిస్‌ప్లే 3200 నిట్స్ బ్రైట్‌నెస్‌తో వస్తుంది. దీంతో ఎండలోనూ స్క్రీన్ చాలా స్పష్టంగా కనిపిస్తుంది. మీడియాటెక్ డైమెన్సిటీ 7400 అల్ట్రా ప్రాసెసర్‌తో వచ్చే ఈ ఫోన్ ధర రూ.26,999 నుండి ప్రారంభం అవుతుంది. దీనిలో 6580mAh బ్యాటరీ, 45W టర్బో ఛార్జింగ్ సదుపాయం కూడా ఇచ్చారు.

iQOO Neo 10R

Advertisement

గేమింగ్ ఫోన్లు అంటేనే అందరికీ ముందుగా iQOO ఫోన్లు గుర్తుకొస్తాయి. ఈ ఐకూ నియో 10Rలో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 8s Gen 3 ప్రాసెసర్‌ను వాడారు. ఇది సూపర్ ఫాస్ట్ పెర్ఫార్మెన్స్ ఇస్తుంది. ఇక ఫోన్ హీట్ ఎక్కకుండా ఉండటానికి.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్ కూడా ఉంది. 144Hz రిఫ్రెష్ రేట్ ఉన్న స్క్రీన్ వల్ల గేమింగ్ అనుభవం నెక్ట్స్ లెవల్‌లో ఉంటుంది. దీని ధర రూ.26,999 నుండి రూ.30,999 మధ్యలో ఉండవచ్చు.

Oppo F31 Pro 5G

ఒప్పో F31 ప్రో కేవలం కెమెరా కోసమే కాదు.. గేమింగ్‌కు కూడా అదిరిపోతుందని నిరూపిస్తోంది. 72 నెలల పాటు ఫోన్ స్లో కాకుండా ఉండేలా దీనిలో ఫ్లూయెన్సీ సర్టిఫికేషన్ ఇచ్చారు. దీంతో చాలాకాలం పాటు ఫోన్ కొత్తదానిలా పనిచేస్తుందన్నమాట. 7000mAh బ్యాటరీ, 80W SUPERVOOC ఛార్జింగ్ దీనికి ప్లస్ పాయింట్స్. దీని‌లో కూడా ఫోన్ చల్లబరచడానికి వేపర్ ఛాంబర్ టెక్నాలజీని ఉపయోగించారు.

మరిన్ని గేమింగ్ ఫోన్లు..

పైన చెప్పుకున్న ఫోన్లే కాకుండా.. Vivo T4 Pro, Realme 15T, Nothing కంపెనీ నుంచి వచ్చిన CMF Phone 2 Pro వంటివి కూడా రూ.30,000 లోపు మంచి ఆప్షన్లే. వీటిని అవసరానికి తగ్గట్టుగా.. మీకు నచ్చిన బ్రాండ్‌ని బట్టి వీటిలో ఏదో ఒకదానిని ఎంపిక చేసుకోవచ్చు.

Also Read: శాంసంగ్ గెలాక్సీ S25 ప్లస్‌పై ఏకంగా రూ.30వేలు తగ్గింపు.. అమెజాన్‌లో బెస్ట్ డీల్ ఇదే!

Related News

సోషల్ మీడియాలో వైరల్ అయ్యే వీడియో రియలా,ఫేకా? తెలుసుకోండిలా!

బడ్జెట్ ధరలో బెస్ట్ 3-డోర్ ఫ్రిజ్.. వర్ల్‌పూల్ ప్రోటాన్ రివ్యూ

రూ.1,599 కే బెస్ట్ ఇయర్‌బడ్స్..హెవీ బేస్‌తో మార్కెట్ షేక్!

మార్కెట్‌ను షేక్ చేస్తున్న 43 ఇంచుల టీవీ.. ఫీచర్స్ నెక్స్ట్ లెవెల్!

కేవలం రూ. 999 కే హెడ్‌ఫోన్స్..సౌండ్ క్వాలిటీ చూస్తే పిచ్చెక్కిపోవాల్సిందే!

రూ.6వేలలోపు టాప్ క్లాస్.. బ్రాండెడ్ వాషర్ ..మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్‌కి పండగే

బిగ్ డిస్‌ప్లే స్మార్ట్‌వాచ్.. బ్లూటూత్ కాలింగ్ ఫీచర్లతో దుమ్మురేపుతోంది!

ప్రీమియం వాషింగ్ ఎక్స్‌పీరియన్స్..క్షణాల్లోనే బట్టలు తెల్లగా మెరిసిపోవాల్సిందే!

Big Stories

Advertisement
×