E-Paper
Advertisement

క్రియేటర్లకు బంపరాఫర్.. 15 వీడియోలు పెట్టు, లక్షలు సొంతం చేసుకో! ‘ఎక్స్’ ఆఫర్ వెనుక..

క్రియేటర్లకు బంపరాఫర్.. 15 వీడియోలు పెట్టు, లక్షలు సొంతం చేసుకో! ‘ఎక్స్’ ఆఫర్ వెనుక..
Advertisement

Bumper Offer Creators: రోజు రోజుకూ తెరపైకి కొత్త కొత్త సోషల్ మీడియాలు పుట్టు కొస్తున్నాయి. ఫలితంగా పాత వాటికి ఫాలోవర్స్ తగ్గుతున్న సందర్భాలు కనిపిస్తున్నాయి. ఈ క్రమంలో ఆయా సంస్థల నుంచి కొత్త కొత్త ఆఫర్లు వస్తున్నాయి. క్రియేటర్లకు బంపరాఫర్ ఇచ్చిది ఎక్స్. తమ ప్లాట్‌ఫామ్‌పై ఒరిజినల్ వీడియోలను పోస్ట్ చేసే క్రియేటర్లకు 3 వేల డాలర్లు అంటే సుమారు రూ. 2.85 లక్షలు ఇవ్వాలని డిసైడ్ అయ్యింది. ఇందులో ఓ మెలిక ఉంది.

క్రియేటర్లకు ఎక్స్ బంపరాఫర్

సోషల్ మీడియా ఎక్స్‌.. క్రియేటర్లకు బంపరాఫర్ ఇచ్చింది. టిక్‌టాక్, ఇన్‌స్టాగ్రామ్ వంటి ప్లాట్‌ఫామ్‌లకు గట్టి పోటీ నేపథ్యంలో వీడియో కిక్‌స్టార్ట్ బోనస్ పేరిట పైలట్ ప్రోగ్రామ్‌ ప్రవేశ పెట్టింది. ఈ ప్రోగ్రామ్‌లో ఎంపికైన క్రియేటర్లకు ఏకంగా 3000 డాల‌ర్లు ఇవ్వనుంది. అంటే ఇండియా కరెన్సీలో అక్షరాలా సుమారు రూ. 2.85 లక్షలు అన్నమాట. ఇప్పుడొస్తున్న యువతను ఆకట్టుకునేందుకు కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది.

15 వీడియోలు పెట్టు, లక్షలు సొంతం చేసుకో

Advertisement

కాన్సెఫ్ట్ ఏంటని అనుకుంటున్నారా? అక్కడికే వచ్చేద్దాం. ఈ ప్రోగ్రామ్‌ కింద అర్హత సాధించాలంటే కొన్ని నిబంధనలు పాటించాలి. క్రియేటర్లు 30 రోజుల వ్యవధిలో కనీసం 15 వీడియోలను పోస్ట్ చేయాలి. ప్రతి వీడియో కనీసం మూడు నిమిషాల లోపు ఉండాలి. అయితే కంటెంట్ పూర్తిగా ఒరిజినల్ అయి ఉండాలి. సొంత క్రియేటివిటీ కచ్చితంగా ఉండాలి. ఇతర ప్లాట్‌ఫామ్‌ల నుంచి డౌన్‌లోడ్ చేసి వాటర్‌ మార్క్‌ వీడియోలను పరిగణనలోకి తీసుకోరు.

వీడియోల వ్యూస్ ఎలాంటి సంబంధం ఉండదు. ఎక్స్ చెప్పినట్టుగా అర్హత కలిగిన వీడియోలను పోస్ట్ చేస్తే చాలు. ఏకంగా రూ. 2.85 లక్షలు అందుకోవచ్చు. క్రియేటర్లకు ఆదాయంపై కచ్చితమైన భరోసా. ఎక్స్‌ సంస్థ నేరుగా క్రియేటర్లను ఎంపిక చేసి వారికి ఆహ్వానాలు పంపించనుంది. అలా ఎంపికైన వారు తమ క్రియేటర్ స్టూడియో ద్వారా చేరవచ్చు. ఈ ప్రోగ్రామ్‌లో చేరడానికి అక్టోబర్ 30 చివరి తేదీ, అంటే కేవలం 10 రోజులు మాత్రమే ఉంది.

Advertisement

ALSO READ: పాత ఇన్‌స్టా యూజర్‌నేమ్‌తో విసిగిపోయారా? ఇలా ఈజీగా మార్చుకోండి!

ఒరిజినల్ కంటెంట్ రివార్డ్స్ ప్రోగ్రామ్‌కు పూర్తిగా భిన్నం. కేవలం వీడియో కంటెంట్‌ను ప్రోత్సహించడం ద్వారా యూజర్లను పెంచుకోవాన్నది ఎక్స్‌ ప్లాన్ అని సోషల్‌ మీడియా నిపుణులు చెబుతున్నారు. మరి ఇంకెందుకు ఆలస్యం, వెంటనే స్టార్ట్ చేయండి. లక్షలు అంది పుచ్చుకోండి.

Related News

యాపిల్ లవర్స్‌కు పండగలాంటి వార్త.. వచ్చే వారమే మార్కెట్లోకి 4 సరికొత్త గ్యాడ్జెట్స్!

పాత ఇన్‌స్టా యూజర్‌నేమ్‌తో విసిగిపోయారా? ఇలా ఈజీగా మార్చుకోండి!

ఫోన్ కెమెరా బ్లర్‌గా ఉందా? వాటర్ మాయిశ్చర్ తొలగించే బెస్ట్ హ్యాక్స్!

120Hz డిస్‌ప్లే నిజంగానే ఎక్కువ ఛార్జింగ్ లాగేస్తుందా?అసలు నిజం ఇదే!

ఫోన్ ఛార్జింగ్ అవట్లేదా? ఈ చిన్న పొరపాట్లే USB పోర్ట్‌ను పాడుచేస్తాయి

ఆస్ట్రేలియాలో రాక్షస సాలీడు.. శాటిలైట్ ఫోటోతో అసలు సంగతి చెప్పేసి నాసా

వింటర్‌లో కాలుష్యం నుంచి ఫుల్ సేప్టీ..ఏసీలో ఈ ఒక్క మోడ్ ఉంటే చాలు!

Big Stories

Advertisement
×