Jacob Duffy Warns Team India: టీమిండియా వర్సెస్ న్యూజిలాండ్ మధ్య ఎల్లుండి నుంచి టి20 సిరీస్ ప్రారంభం కాబోతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో టీమిండియాకు న్యూజిలాండ్ స్టార్ బౌలర్ జాకబ్ డఫీ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ఫ్లాట్ మైదానాలలో ఆడటం అలవాటు చేసుకున్న టీమిండియాను చిత్తుగా ఓడిస్తామని హెచ్చరించారు. ఫ్లాట్ మైదానాలలో 250 పరుగులు సులభంగా బాదిన టీమిండియా బ్యాటర్స్… న్యూజిలాండ్ గడ్డపై 170 పరుగులు కొట్టడం కూడా కష్టమేనన్నారు. తమ బౌన్సర్లతో టీమ్ ఇండియా బ్యాటర్ల ప్యాంట్లు తడిపేస్తామని హెచ్చరించారు. కచ్చితంగా టీమిండియాపై పై చేయి సాధించి… సిరీస్ గెలుస్తామని స్టేట్మెంట్ ఇచ్చారు. దీంతో జాకబ్ డఫీ చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి.
టీమిండియా వర్సెస్ న్యూజిలాండ్ టీ20 సిరీస్ ప్రారంభం కాబోతున్న తరుణంలోనే జాకబ్ డఫీ కీలక వ్యాఖ్యలు చేశారు. ఐపీఎల్ కోసం భారత గడ్డపై ఫ్లాట్ మైదానాలు తయారు చేయడం దారుణమన్నారు. ఫ్లాట్ మైదానాలపై మ్యాచులు నిర్వహించి టి20 క్రికెట్ ను నాశనం చేస్తున్నారని ఫైర్ అయ్యారు. దీనివల్ల టీమిండియా పరిస్థితి దిగజారే ప్రమాదం ఉందని హెచ్చరించారు. భారత గడ్డపై అద్భుతంగా ఆడుతున్నప్పటికీ.. విదేశాలలో టీమిండియా విఫలం కావడం గ్యారెంటీ అన్నారు.
భారత మైదానాలలో బౌలర్లకు అనుకూలించేలా పిచ్ లు తయారు చేయాలని సూచించారు. న్యూజిలాండ్ గడ్డపై టీమిండియా క్రికెటర్లు 250కి పైగా స్కోర్ చేయడం కష్టమేనన్నారు. ఇక్కడి బౌన్సీ మైదానాల దెబ్బకు… టీమిండియా బ్యాటర్ల ప్యాంట్లు తడిచిపోతాయని హెచ్చరించారు. టీమిండియాను దారుణంగా ఓడించే తీరుతామని సవాల్ విసిరారు. ప్రతీ మ్యాచ్ లో 250 పరుగులు వస్తే అసలు క్రికెట్ పైన మజాను ఇవ్వదన్నారు. ఫ్లాట్ మైదానాలు ఉంటే బౌండరీల సైజు పెంచితే బెస్ట్ అని సూచించారు.
న్యూజిలాండ్ గడ్డపై పర్యటించబోతున్న టీమిండియా వైట్ వాష్ కావడం గ్యారెంటీ అని తన్వీర్ అహ్మద్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఫ్లాట్ మైదానాలకు అలవాటు పడిన టీమిండియా… న్యూజిలాండ్ గడ్డపై ఘోరంగా ఓడిపోతుందని హెచ్చరించారు. ఐర్లాండ్ అలాగే ఇంగ్లాండ్ చేతిలో టీమిండియా ఓడిపోయినట్టుగానే న్యూజిలాండ్ లోను ఐదు మ్యాచ్ లలో ఓడిపోవడం గ్యారంటీ అని తెలిపారు. అలా జరగకపోతే పాకిస్తాన్ వీధుల్లో బట్టలు లేకుండా తిరుగుతానని తన్వీర్ అహ్మద్ శపథం చేశారు. ఇది ఇలా ఉండగా టీమిండియా వర్సెస్ న్యూజిలాండ్ మధ్య అక్టోబర్ 22వ తేదీ నుంచి టి20 సిరీస్ ప్రారంభం కానుంది. ఇందులో భాగంగానే న్యూజిలాండ్ చేరుకుంది శ్రేయస్ అయ్యర్ సేన.