E-Paper
Advertisement

Motorola Discount: 5500mAh బ్యాటరీగల మోటోరోలా ఫోన్‌పై రూ.4000 డిస్కౌంట్.. ఆఫర్ ఎక్కడంటే

Motorola Discount: 5500mAh బ్యాటరీగల మోటోరోలా ఫోన్‌పై రూ.4000 డిస్కౌంట్.. ఆఫర్ ఎక్కడంటే
Advertisement

Motorola Discount | మోటోరోలా మోటో G96 5G స్మార్ట్‌ఫోన్ గత సంవత్సరం జులైలో లాంచ్ అయింది. లాంచ్ అయిన తర్వాత ఈ ఫోన్ సేల్స్ బాగున్నాయి. యూజర్ల నుంచి గొప్ప ఆదరణ పొందింది. ఇప్పుడు ఈ ఫోన్ చాలా తక్కువ ధరకు అందుబాటులో ఉంది. పెద్ద 6.67 ఇంచ్ డిస్‌ప్లే, 144Hz రిఫ్రెష్ రేట్, 5500mAh బ్యాటరీ, 33W ఫాస్ట్ చార్జింగ్ లాంటి బలమైన ఫీచర్లు ఉన్నాయి. ఫ్లిప్‌కార్ట్‌లో ఇప్పుడు భారీ డిస్కౌంట్‌తో అమ్మకాలు జరుగుతున్నాయి.

ఫ్లిప్‌కార్ట్‌లో సేల్ డిస్కౌంట్ వివరాలు

మోటో G96 5G 8GB ర్యామ్ + 128GB స్టోరేజ్ మోడల్ ఒరిజినల్ ధర సుమారు రూ.20,999. ఫ్లిప్‌కార్ట్ ఇప్పుడు 14శాతం డిస్కౌంట్ ఇస్తోంది. డిస్కౌంట్ తర్వాత ధర రూ.17,999 అవుతుంది. అంటే డైరెక్ట్‌గా రూ.3,000 సేవింగ్స్ చేసుకోవచ్చు. ఈ ధరతో ఈ ఫోన్ చాలా మంది యూజర్లకు మంచి బడ్జెట్ ఆప్షన్ అవుతుంది.

బ్యాంక్ ఆఫర్లతో అదనపు డిస్కౌంట్

Advertisement

బ్యాంక్ ఆఫర్ల ద్వారా మరింత ఆదా చేసుకోవచ్చు. ఫ్లిప్‌కార్ట్ ఆక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌తో రూ.900 వరకు డిస్కౌంట్ వస్తుంది. SBI క్రెడిట్ కార్డ్‌తో కూడా రూ.900 వరకు ధర తగ్గుతుంది. రెండు ఆఫర్లు కలిపితే మొత్తం దాదాపు రూ.4,000 వరకు డిస్కౌంట్ పొందవచ్చు.

డిస్‌ప్లే, పెర్ఫామెన్స్ ఫీచర్లు

మోటో G96 5Gలో కర్వ్డ్ pOLED డిస్‌ప్లే ఉంది. స్క్రీన్ ఫుల్ HD+ రిజల్యూషన్‌తో వస్తుంది. 144Hz రిఫ్రెష్ రేట్ వల్ల స్మూత్ ఎక్స్‌పీరియన్స్ ఇస్తుంది. పీక్ బ్రైట్‌నెస్ 1600 నిట్స్ వరకు ఉంటుంది. క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 7s జెన్ 2 ప్రాసెసర్ ఉంది. ఆండ్రాయిడ్ 15తో మోటోరోలా హలో UI స్కిన్ ఉంది. రోజువారీ పనులు, గేమింగ్ చాలా స్మూత్‌గా జరుగుతాయి.

బ్యాటరీ, చార్జింగ్ కెపాసిటీ

Advertisement

5500mAh పెద్ద బ్యాటరీ ఉంది. హెవీ యూసేజ్‌తో కూడా ఒక రోజు పూర్తిగా ఉపయోగించవచ్చు. 33W టర్బో పవర్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ ఉంది. త్వరగా రీఛార్జ్ అవుతుంది. IP68 రేటింగ్ వల్ల డస్ట్, వాటర్ రెసిస్టెన్స్ ఉంది. ఫోన్ మరింత మన్నికగా ఉంటుంది.

Also Read: రికార్డ్స్ బద్దలు కొడుతున్న 10001mAh బ్యాటరీగల కొత్త రియల్‌మి ఫోన్.. కేవలం 1 గంటలో షాకింగ్ సేల్స్

కెమెరా, కనెక్టివిటీ ఫీచర్లు

50MP మెయిన్ కెమెరా ఉంది. ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ సపోర్ట్ ఉంది. 8MP అల్ట్రా-వైడ్ కెమెరా కూడా ఉంది. ఫ్రంట్ కెమెరా 32MP రిజల్యూషన్‌తో వస్తుంది. సెల్ఫీలు, వీడియో కాల్స్ షార్ప్‌గా వస్తాయి. 5G, 4G సపోర్ట్ ఉన్నాయి. డ్యూయల్ సిమ్ సపోర్ట్ ఉంది. బ్లూటూత్ 5.2, వై-ఫై, GPS, NFC, USB Type-C కూడా ఉన్నాయి.

మోటో G96 5G ఇప్పుడు తక్కువ ధరలో బలమైన ఫీచర్లతో దొరుకుతోంది. భారీ బ్యాటరీ హెవీ యూజర్లకు బాగుంటుంది. 144Hz డిస్‌ప్లే గేమర్లకు అద్భుతం. కెమెరా క్యాజువల్ ఫోటోగ్రఫీకి సరిపోతుంది. మిడ్-రేంజ్ సెగ్మెంట్‌లో ఇది మంచి ఆప్షన్ అవుతుంది.

Related News

గేమర్స్‌కు పూనకాలు తెప్పిస్తున్న Oppo K15.. నీళ్లలో పడినా, రఫ్ అండ్ టఫ్ వాడినా తగ్గేదే లేదంట!

సోషల్ మీడియాలో వైరల్ అయ్యే వీడియో రియలా,ఫేకా? తెలుసుకోండిలా!

బడ్జెట్ ధరలో బెస్ట్ 3-డోర్ ఫ్రిజ్.. వర్ల్‌పూల్ ప్రోటాన్ రివ్యూ

రూ.1,599 కే బెస్ట్ ఇయర్‌బడ్స్..హెవీ బేస్‌తో మార్కెట్ షేక్!

మార్కెట్‌ను షేక్ చేస్తున్న 43 ఇంచుల టీవీ.. ఫీచర్స్ నెక్స్ట్ లెవెల్!

కేవలం రూ. 999 కే హెడ్‌ఫోన్స్..సౌండ్ క్వాలిటీ చూస్తే పిచ్చెక్కిపోవాల్సిందే!

రూ.6వేలలోపు టాప్ క్లాస్.. బ్రాండెడ్ వాషర్ ..మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్‌కి పండగే

బిగ్ డిస్‌ప్లే స్మార్ట్‌వాచ్.. బ్లూటూత్ కాలింగ్ ఫీచర్లతో దుమ్మురేపుతోంది!

Big Stories

Advertisement
×