Induction Stove: దేశంలో గ్యాస్ సరఫరాలో నెలకొన్న అనిశ్చితి కారణంగా పెద్ద ఎత్తున ప్రజలు.. ఇండక్షన్ స్టవ్స్ కొనుగోలు చేస్తున్నారు. ఒకప్పుడు సగటున వందకు 5-10 ఇళ్లల్లో మాత్రమే ఉండే ఈ ఇండక్షన్ స్టవ్స్.. ప్రస్తుతం 20-30కి పెరిగిపోయినట్లు నిపుణులు చెబుతున్నారు. అయితే ఈ ఇండక్షన్ స్టవ్స్ వినియోగంపై కొందరిలో చాలా సందేహాలు, అపోహలు ఉన్నాయి. కరెంటుతో నడిచే ఈ కుకింగ్ టాప్స్ పై నీరు చిందితే ఏమైనా షాక్ కొడుతుందా? అనే అనుమానాలు చాలా మందిలో ఉన్నాయి. ఈ కథనంలో దీనిపై క్లారిటీ తెచ్చుకునే ప్రయత్నం చేద్దాం.
సాధారణంగా ఇండక్షన్ స్టవ్స్ పై కొద్దిపాటి నీరు, వంటకు సంబంధించిన తడి ఆహార పదార్థాలు పడితే వెంటనే ఎలాంటి షాక్ ఉండదు. ఎందుకంటే ఇండక్షన్ స్టవ్ పైభాగం.. దృఢమైన గ్లాస్-సిరామిక్ షీట్ తో తయారు చేస్తారు. ఇది లోపల ఉండే ఎలక్ట్రిక్ భాగాల్లోకి నీరు చేరకుండా అడ్డుపడి.. విద్యుత్ షాక్ తగలకుండా రక్షిస్తుంది. దీనికి తోడు.. ఇండక్షన్ స్టవ్స్ చాలా తక్కువ విద్యుత్ ను వినియోగిస్తాయి కాబట్టి.. దీనివల్ల షాక్ తగిలే అవకాశాలు కూడా చాలా తక్కువేనని నిపుణులు చెబుతున్నారు.
ఇండక్షన్ స్టవ్స్ పై నీరు చిందినప్పుడు కాకపోయినా.. కొన్ని సందర్భాల్లో విద్యుత్ షాక్ తగిలే ప్రమాదముంది. స్టవ్ పైన ఉన్న గ్లాస్ ఉపరితలం పగిలిపోయి, చిన్న పగుళ్లు ఉన్నప్పుడు నీరు లోపలికి చేరి.. ఎలక్ట్రిక్ షాక్ కు దారి తీయవచ్చు. అలాగే అధికమెుత్తంలో నీరు పాత్ర నుంచి చిందినప్పుడు.. అవి సర్క్యూట్ బోర్డ్ లేదా వెటిలేషన్ కోసం ఏర్పాటు చేసిన రంధ్రాల్లోకి వెళ్లే అవకాశం ఉంటుంది. దీనివల్ల కూడా షాక్ సమస్య రావొచ్చు. ఇవి కాకుండా.. ప్లగ్ పాయింట్ దగ్గర విద్యుత్ సరఫరాలో సమస్యలు తలెత్తితే కూడా విద్యుత్ షాక్ కు దారి తీసే ముప్పు ఉంది.
Also Read: AP Capital Bill: కాసేపట్లో లోక్‌సభ ముందు ఏపీ రాజధాని బిల్లు.. రెండు గంటలపాటు చర్చ
ఇండక్షన్ స్టవ్స్ రెగ్యులర్ గా వినియోగిస్తున్నవారు.. కొన్ని జాగ్రత్తలు పాటించడం ద్వారా ఎలక్ట్రిక్ షాక్ నుంచి తప్పించుకోవచ్చు. మీరు వంట చేస్తున్నప్పుడు స్టవ్ మీద నీరు చిందినట్లైతే వెంటనే స్విచ్ ఆఫ్ చేసి.. పొడి బట్టతో స్టవ్ పై భాగాన్ని తుడిస్తే మంచిది. స్టవ్ గ్లాస్ మీద పగుళ్లు ఉంటే దానిపై వంట చేయకపోవడం ఉత్తమం. టెక్నీషియన్ ను పిలిపించి.. రిపేర్ చేయించిన తర్వాతనే తిరిగి వాడాలి. మరోవైపు ఇండక్షన్ స్టవ్స్ ను ఎట్టిపరిస్థితుల్లో నీటితో కడగొద్దు. తడి బట్టతో తుడిచి మాత్రమే శుభ్రం చేసుకోవాలి. మార్కెట్ లో ఆటో కట్ ఫీచర్ ఉన్న ఇండక్షన్ స్టవ్స్ ను కొనుగోలు చేస్తే విద్యుత్ షాక్ నుంచి బయటపడొచ్చు. నీరు లేదా పాలు పొంగినప్పుడు ఆటోమేటిక్ గా స్టవ్ ఆగిపోయేలా ఈ ఫీచర్ దోహదం చేస్తుందని నిపుణులు వివరిస్తున్నారు.
ముఖ్యగమనిక: నిపుణుల సూచనల మేరకు ఈ కథనం అందించడం జరిగింది. ఇది కేవలం మీ అవగాహన కోసం మాత్రమే. ఇందులోని కంటెంట్ కు బిగ్ టీవీ ఎలాంటి బాధ్యత వహించదు.
Also Read: ఏంటీ.. రాకాస కాంబో ఐదేళ్ల క్రితమే ఫిక్స్ అయ్యిందా.. నిహారిక లెటర్ లో మానసా శర్మ!