E-Paper
Advertisement

ప్రదీప్ రంగనాధన్ ‘లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ’ టీజర్ వచ్చేసింది.. 40 ఏళ్ల తర్వాత..

ప్రదీప్ రంగనాధన్ ‘లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ’ టీజర్ వచ్చేసింది.. 40 ఏళ్ల తర్వాత..
Advertisement

LIC Teaser: యువ దర్శకుడు నటుడు ప్రదీప్ రంగనాథన్, కృతి శెట్టి జంటగా నటిస్తున్న తాజా చిత్రం ‘లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ’ (LIC). విఘ్నేష్ శివన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా టీజర్‌ను చిత్ర యూనిట్ తాజాగా విడుదల చేసింది. భవిష్యత్తు కాలపు నేపథ్యంలో సాగే ఈ వినూత్న కథాంశం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇప్పటికే మంచి హిట్ సినిమాలతో మంచి జోష్ మీద ఉన్న ప్రదీప్ రంగనాధన్ నయన తార భర్త అయిన విఘ్నేష్ శివన్ దర్శకత్వంలో నటిస్తున్నారు. వరుస సినిమాలు వంద కోట్లు కలెక్ట్ చేస్తుండటంతో ప్రదీప్ సినిమాపై కూడా భారీ అంచనాలు పెట్టకున్నారు నిర్మాతలు. గతేడాదే ఈ సినిమా విడుదల కావాల్సి ఉండగా తేదీల సర్థు బాటు కారణంగా ఏప్రియల్ 10, 2026న విడుదల కానుంది.

Read also-‘ధురంధర్’ ఫుల్ మూవీ రన్ టైమ్ ఎంతో తెలిస్తే షాక్ అవుతారు.. రిలీజ్ ఎప్పుడంటే?

Advertisement

ఈ సినిమా కథ 2040వ సంవత్సరంలో అంటే భవిష్యత్తులో జరుగుతుంది. టీజర్‌లో చూపించిన విజువల్స్, టెక్నాలజీ రోబోలు ప్రేక్షకులను ఒక కొత్త లోకంలోకి తీసుకెళ్తాయి. “ప్రేమకు కూడా ఇన్సూరెన్స్ ఉంటే ఎలా ఉంటుంది?” అనే క్రేజీ పాయింట్‌తో ఈ సినిమా రూపొందినట్లు తెలుస్తోంది. ‘లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ’ పేరుతో సాగే ఈ సంస్థ, విడిపోయిన ప్రేమికులకు లేదా ప్రేమలో విఫలమైన వారికి భరోసా ఇచ్చేలా కనిపిస్తోంది. ‘లవ్ టుడే’ సినిమాతో సెన్సేషన్ క్రియేట్ చేసిన ప్రదీప్ రంగనాథన్, ఈ టీజర్‌లో చాలా ఎనర్జిటిక్‌గా కనిపిస్తున్నారు.

Read also-ఐదేళ్ల కిందటే మానశ శర్మకు నిహారిక హామీ.. ఇచ్చిన మాట నిలబెట్టుకున్న మెగా డాటర్

Advertisement

కృతి శెట్టి తన గ్లామర్‌తో ఆకట్టుకోగా, వెర్సటైల్ నటుడు ఎస్.జె. సూర్య ఒక కీలకమైన వినోదాత్మకమైన పాత్రలో మెరిశారు. రాక్ స్టార్ అనిరుధ్ రవిచందర్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ టీజర్‌కు ప్రధాన ఆకర్షణగా నిలిచింది. ఆయన మ్యూజిక్ సినిమాపై మరింత హైప్‌ను క్రియేట్ చేస్తోంది. విఘ్నేష్ శివన్ మరియు నయనతారకు చెందిన రౌడీ పిక్చర్స్ ఈ సినిమాను నిర్మిస్తోంది. ఈ చిత్రం ఏప్రిల్ 10న థియేటర్లలో సందడి చేయనుంది. సైన్స్ ఫిక్షన్ కామెడీ కలగలిసిన ఈ ‘లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ’ ప్రేక్షకులకు ఒక కొత్త అనుభూతిని ఇస్తుందని టీజర్ చూస్తుంటే అర్థమవుతోంది. ఈ సినిమా విడుదల కోసం ప్రదీప్ రంగనాధన్ అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

Related News

హైదరాబాద్‌లో ‘వైఫ్ ఎక్స్ఛేంజ్’ కల్చర్ ఉందంటూ హీరోయిన్ మాధవీలత సంచలన వ్యాఖ్యలు!

మగాళ్ల హత్యల పై షాకింగ్ కామెంట్స్.. కొడుకు కోసం ఆందోళన పడుతున్న కాజల్..

నేను దేశ ద్రోహిని కాదు.. బీజేపీ తీరుపై నటుడు నరేష్ ఫైర్..

హిట్ కొట్టిన రోజా,నాగదుర్గ.. పాపం ఐశ్వర్య, లయ!

నేషనల్ అవార్డు విన్నింగ్ పై మెగాస్టార్ ట్వీట్.. నిహారిక క్రేజీ కామెంట్స్!

కన్నీటి పర్యంతమవుతున్న ‘మహారాజ’ బ్యూటీ.. అసలేం జరిగిందంటే?

డ్యాన్స్ మాస్టర్స్ అసోసియేషన్ వివాదం..ఫిలిం ఫెడరేషన్ అత్యవసర సమావేశం!

ఉత్తమ బాలల చిత్రంగా నేషనల్ అవార్డు అందుకున్న తొలి తెలుగు చిత్రం ఏంటో తెలుసా?

Big Stories

Advertisement
×