E-Paper
Advertisement

ఇండక్షన్ స్టవ్ వాడుతున్నారా? చాలామందికి తెలియని షాకింగ్ నిజాలు!

ఇండక్షన్ స్టవ్ వాడుతున్నారా? చాలామందికి తెలియని షాకింగ్ నిజాలు!
Advertisement

Induction Stove: ఇటీవల ఇరాన్ – ఇజ్రాయెల్ – అమెరికా యుద్ధం నేపథ్యంలో భారత్ లో గ్యాస్ సరఫరాకు ఆటంకం ఏర్పడిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో పెద్ద ఎత్తున ప్రజలు ఎల్‌పీజీకి ప్రత్యామ్నాయంగా ఇండక్షన్ స్టవ్స్ ను కొనుగోలు చేశారు. అయితే దీనిపై వంట చేయడానికి సంబంధించి చాలా మందిలో అనేక సందేహాలు ఉన్నాయి. కుకింగ్ సమయంలో టెంపరేచర్ పదే పదే మార్చొచ్చా? లేదా? అన్న కన్ఫ్యూజన్ వారిలో ప్రధానంగా కనిపిస్తోంది. దీనికి సంబంధించి అసలు నిజాలేంటో ఈ కథనంలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

పదే పదే మారిస్తే.. తప్పా?

ఇండక్షన్ స్టవ్ మీద ఉష్ణోగ్రతను పదే పదే మార్చడం తప్పు కాదని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. ఇండక్షన్ టెక్నాలజీ టెంపరేచర్ ఛేంజింగ్ కు అనుకూలంగా ఉంటుందని పేర్కొంటున్నారు. కాగా, గ్యాస్ స్టవ్ తరహాలోనే ఇండక్షన్ కూడా బటన్ నొక్కిన వెంటనే సెకన్ల వ్యవధిలో వేడిని తగ్గించడం లేదా పెంచడం వంటివి చేస్తుంది. కూర ఉడుకుతున్నప్పుడు లేదా పాలు పొంగుతున్నప్పుడు వెంటనే ఉష్ణోగ్రత తగ్గించడం వల్ల వంట పాడుకాకుండా చూసుకోవచ్చు. అయితే టెంపరేచర్ లో మార్పు వల్ల కలిగే లాభా నష్టాలను సైతం నిపుణులు పేర్కొంటున్నారు.

కరెంట్ ఖర్చు ఆదా

Advertisement

చాలామంది ఉష్ణోగ్రత మార్చితే కరెంట్ ఎక్కువ కాలుతుందని భయపడతారు. కానీ ఇండక్షన్ స్టవ్‌లు ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్ ద్వారా పనిచేస్తాయి. మీరు పవర్ తగ్గించినప్పుడు విద్యుత్ వినియోగం కూడా వెంటనే తగ్గుతుంది. కాబట్టి పదే పదే మార్చడం వల్ల అదనపు ఖర్చు ఏమీ ఉండదు.

కుక్‌టాప్ మన్నిక..

ఇండక్షన్ లోపల ఉండే సర్క్యూట్ బోర్డ్.. టెంపరేచర్ లో జరిగే మార్పులను తట్టుకునేలాగే తయారు చేస్తారు. అయితే మరీ వేగంగా బటన్లను నొక్కుతూ ఉంటే.. కంట్రోల్ ప్యానెల్ లేదా బటన్లు త్వరగా పాడయ్యే అవకాశం ఉంటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

రుచికరమైన వంట

Advertisement

వంట చేసేటప్పుడు అవసరానికి తగ్గట్టుగా ఉష్ణోగ్రత మార్చడం వల్ల ఆహారం అడుగు అంటకుండా ఉంటుందని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. అదే సమయంలో పోషకాలు కోల్పోకుండా ఉంటాయని పేర్కొంటున్నారు. అయితే వంట ప్రారంభంలో హై ఫ్లేమ్ లో పెట్టి.. ఉడికేటప్పుడు లో ఫ్లేమ్ కి మార్చడం బెస్ట్ పద్దతి అని నిపుణులు తెలియజేస్తున్నారు.

Also Read: AC Water Tips: ఏసీ నీటిని మొక్కలకు పోస్తున్నారా? అయితే ఇది తప్పక తెలుసుకోండి!

మరికొన్ని చిట్కాలు..

ఇండక్షన్ స్టవ్ పై వంటకు సరైన పాత్రలను ఎంచుకోవాలని నిపుణులు చెబుతున్నారు. ఇండక్షన్ కి సరిపోయే ఫ్లాట్ బాటమ్ ఉన్న ఐరన్ లేదా స్టెయిన్ లెస్ స్టీల్ పాత్రలనే వాడాలని సూచిస్తున్నారు. ముందుగానే స్టవ్ పై ఖాళీ పాత్రను పెట్టి ఎక్కువ సేపు హై టెంపరేచర్‌లో ఉంచవద్దని పేర్కొంటున్నారు. దీనివల్ల గ్లాస్ ప్యానెల్‌ దెబ్బతింటుందని హెచ్చరిస్తున్నారు. అలాగే కంట్రోల్ ప్యానెల్ మీద వేడి వేడి నీళ్లు, నూనె పడకుండా చూసుకోవాలని చెబుతున్నారు. లేదంటే కంట్రోల్ బటన్లు దెబ్బతినే అవకాశముంటుందని అంచనా వేస్తున్నారు.

Also Read: వాషింగ్ మిషన్ బ్యాడ్ స్మెల్ వస్తోందా? వెంటనే ఇలా చేయండి.. కేవలం 10 నిమిషాల్లో!

Related News

సోషల్ మీడియాలో వైరల్ అయ్యే వీడియో రియలా,ఫేకా? తెలుసుకోండిలా!

బడ్జెట్ ధరలో బెస్ట్ 3-డోర్ ఫ్రిజ్.. వర్ల్‌పూల్ ప్రోటాన్ రివ్యూ

రూ.1,599 కే బెస్ట్ ఇయర్‌బడ్స్..హెవీ బేస్‌తో మార్కెట్ షేక్!

మార్కెట్‌ను షేక్ చేస్తున్న 43 ఇంచుల టీవీ.. ఫీచర్స్ నెక్స్ట్ లెవెల్!

కేవలం రూ. 999 కే హెడ్‌ఫోన్స్..సౌండ్ క్వాలిటీ చూస్తే పిచ్చెక్కిపోవాల్సిందే!

రూ.6వేలలోపు టాప్ క్లాస్.. బ్రాండెడ్ వాషర్ ..మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్‌కి పండగే

బిగ్ డిస్‌ప్లే స్మార్ట్‌వాచ్.. బ్లూటూత్ కాలింగ్ ఫీచర్లతో దుమ్మురేపుతోంది!

ప్రీమియం వాషింగ్ ఎక్స్‌పీరియన్స్..క్షణాల్లోనే బట్టలు తెల్లగా మెరిసిపోవాల్సిందే!

Big Stories

Advertisement
×