E-Paper
Advertisement

చెత్తలో పడేసే ప్లాస్టిక్ బాటిళ్లతో.. అద్భుతమైన ఇల్లు.. కెనడా బిల్డర్ల క్రేజీ ఆవిష్కరణ!

చెత్తలో పడేసే ప్లాస్టిక్ బాటిళ్లతో.. అద్భుతమైన ఇల్లు.. కెనడా బిల్డర్ల క్రేజీ ఆవిష్కరణ!
Advertisement

Plastic Bottles House: ప్లాస్టిక్ బాటిళ్లు చెత్తకుప్పల్లోకి చేరి పర్యావరణాన్ని నాశనం చేయడానికి బదులు మన ఇంటి గోడలుగా మారితే ఎలా ఉంటుంది? చాలా బాగుంటుంది కదా. కెనడాలోని నోవా స్కోటియాకు చెందిన జోయెల్ జర్మన్, డేవిడ్ సాల్నియర్ అనే ఇద్దరు బిల్డర్లకు సరిగ్గా ఇదే ఆలోచన వచ్చింది. ఇది వచ్చిందే తడువుగా మెటెఘన్ రివర్ ప్రాంతంలో సుమారు 2,000 చదరపు అడుగుల వైశాల్యంతో వారు ఒక వినూత్న ఇంటిని నిర్మించారు. తద్వారా ప్రపంచవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షించారు.

మెటెఘన్ రివర్ ప్రాంతంలోని ఇంటిని పూర్తిగా వాడేసిన ప్లాస్టిక్ బాటిళ్లతో కెనడా బిల్డర్లు నిర్మించారు. ఇందుకోసం ఏకంగా 6,12,000 వాడేసిన ప్లాస్టిక్ సీసాలను ఉపయోగించారు. అయితే ఇంటి నిర్మాణంలో ప్లాస్టిక్ సీసాలను నేరుగా ఉపయోగించలేదు. బిల్డర్ల సంస్థ.. ‘జెడి కాంపోజిట్స్’ ఆర్మాసెల్ అనే సంస్థతో కలిసి ఈ సీసాలను రీసైకిల్ చేసింది. ముందుగా సీసాలను చిన్న చిన్న ముక్కలుగా చేసి, కరిగించి, ప్రత్యేకమైన ప్రక్రియ ద్వారా దృఢమైన పీఈటీ (PET) ఫోమ్‌గా మార్చారు.

Advertisement

ఈ ఫోమ్‌ను ఇంటి గోడల ప్యానెళ్ల మధ్యలో అమర్చారు. బయటకు సాధారణ ఇల్లులాగే కనిపిస్తున్నప్పటికీ దీని గోడల లోపల రీసైకిల్ చేసిన ప్లాస్టిక్ దాగి ఉంది. అయితే ఈ ఇంటి తయారీలో ఉపయోగించిన ప్యానెళ్ల దృఢత్వం అందరినీ ఆశ్చర్యపరిచింది. పరీక్షల నిమిత్తం 8×8 అడుగుల ఒక ప్యానెల్‌పై గాలుల తీవ్రతను ప్రయోగించినప్పుడు అది గంటకు 326 మైళ్ల (సుమారు 524 కిమీ) వేగాన్ని తట్టుకోగలిగింది. ఇది అత్యంత తీవ్రమైన కేటగిరీ 5 తుఫాను గాలుల కంటే రెట్టింపు వేగం కావడం విశేషం. అయితే ఇది ఒక ప్యానెల్‌పై జరిపిన పరీక్ష మాత్రమే తప్ప మొత్తం ఇంటిని విండ్ టన్నెల్‌లో పెట్టి చేసిన పరీక్ష కాదని బిల్డర్లు స్పష్టం చేశారు.

Also Read: సాధారణ ఫ్యాన్ vs బీఎల్‌డీసీ.. రెండింటికి తేడా ఏంటి? పవర్ ఆదాకు ఏది పర్ఫెక్ట్?

Advertisement

ఈ వినూత్న నిర్మాణ శైలి ద్వారా ప్లాస్టిక్‌ వ్యర్థాలను అత్యంత ఉపయోగకరంగా మార్చవచ్చని సదరు బిల్డర్లు నిరూపించారు. సాంప్రదాయ ఇటుకలు, సిమెంట్ నిర్మాణాలకు ప్రత్యామ్నాయంగా ఈ ప్యానెళ్లు అద్భుతమైన కూలింగ్ తో పాటు, దీర్ఘకాలిక మన్నికను అందిస్తాయని బిల్డర్లు తెలిపారు. భవిష్యత్తులో ప్రకృతి విపత్తులను తట్టుకునే విధంగా తక్కువ ఖర్చుతో వేగంగా ఇళ్లను నిర్మించడానికి ఈ సాంకేతికత ఎంతో ఉపయోగపడుతుందని నిపుణులు భావిస్తున్నారు.

Also Read: క్యాబేజీ, పండ్ల తొక్కలతో నివాసాలు.. ఉంటే నీడ, తింటే ఆహారం.. ఇదెక్కడి టెక్నాలజీ సామీ!

Tags

Related News

స్మార్ట్‌ఫోన్ ఇప్పుడు భూకంప హెచ్చరికల సాధనంగా.. గూగుల్ బిగ్ అప్‌డేట్!

యూట్యూబ్ ఛానెల్ పెడుతున్నారా? ఈ కంటెంట్‌తో వీడియోలు చేస్తే మీరే కింగ్.. కనక వర్షం కురవాల్సిందే!

యాపిల్ ప్రియులకు ఊహించని షాక్.. ఆన్‌లైన్ స్టోర్ బంద్, కారణం ఏమిటంటే?

యూట్యూబ్‌లో ఏఐ పాటలకు ప్రత్యేక లేబుల్స్.. అసలు ఇవి ఎలా పనిచేస్తాయంటే?

మెమరీ చిప్‌ల కొరత.. 14 ఏళ్ల కనిష్టానికి పడిపోయిన గ్లోబల్ స్మార్ట్‌ఫోన్ మార్కెట్!

iPhone 16 తక్కువ ధరకే వస్తోందని కొంటున్నారా? ఈ విషయం తెలిస్తే ప్లాన్ మార్చుకుంటారు!

యాపిల్ వాచ్ సిరీస్ 11పై ఊహించని డిస్కౌంట్.. అమెజాన్ పండుగ సేల్‌లో టాప్-5 డీల్స్ ఇవే!

శీతాకాలం అలర్ట్.. ఏసీ అవుట్ డోర్ యూనిట్‌కు కవర్.. కేవలం రూ.200తో రూ.20 వేల నష్టానికి చెక్!

Big Stories

Advertisement
×