Revanth Reddy Slams KCR :హైదరాబాద్ లో పెరిగిపోతున్న ట్రాఫిక్ కి చెక్ పెట్టె క్రమంలో తెలంగాణ ప్రభుత్వం మరో కీలక అడుగు వేసింది.ముఖ్యంగా తూర్పు హైదరాబాద్ ప్రజలు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న ప్రతిష్టాత్మక మూసారాంబాగ్ హై లెవల్ బ్రిడ్జిని తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి ఈరోజు ఘనంగా ప్రారంభించారు.
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్‌ఎంసీ) ఆధ్వర్యంలో మూసీ నదిపై దాదాపు రూ.52 కోట్ల భారీ అంచనా వ్యయంతో 400 మీటర్ల పొడవైనతో అంబర్ పేట నుండి ప్రయాణ సమయం తగ్గడంతో పాటు.. ఈ ప్రాంతంలో ట్రాఫిక్ రద్దీ కూడా కొంతమేర తగ్గే అవకాశం ఉంది.ఇక ఈ ప్రారంభోత్సవం సందర్బంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ కేసీఆర్ పై ఒక రేంజ్ లో ఫైర్ అయ్యారు.
ఈ సందర్బంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ”కాంగ్రెస్ ఏర్పడి వెయ్యి రోజులు పూర్తయిన సందర్భంగా కొంతమంది అల్లరి మూకలు ఈరోజు మా పాలన మీద ప్రభుత్వ వైఫల్యాల మీద కార్యాచరణ తీసుకున్నాం మేము నిరసన తెలుపుతాము, మేము రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మలని దగ్ధం చేస్తామని ఈరోజు బయలుదేరాయి .
అసలు విషయం ఏంటంటే ధనిక రాష్ట్రంగా 16 వేల కోట్ల మిగులు బడ్జెట్ తో తెలంగాణ రాష్ట్రాన్ని కెసిఆర్ కి అప్పజెప్పారు.ఆనాడు 70 వేల కోట్ల రూపాయల మాత్రమే అప్పు ఉండే ది.సంవత్సరానికి 6,500 కోట్ల రూపాయలు అసలు మిత్తి కడితే సరిపోతుంది అంటే నెలకు 500 కోట్ల రూపాయలు ప్రభుత్వం మీద భారం పడేది. 16,000 కోట్ల రూపాయలు బ్యాంకులో మిగిలి ఉండేది .
ఆ పరిస్థితుల్లో జూన్ 2, 2014 నాడు కెసిఆర్ కి అధికారం అప్పచెపితే సరిగ్గా తొమ్మిదిన్నర సంవత్సరాలలో , ఒకే ఒక్క కేసీఆర్ ఆయన కుటుంబంలోని నలుగురు కలిసి 8 లక్షల పదకొండు వేల కోట్ల రూపాయల అప్పులల్ల తెలంగాణ రాష్ట్రాన్ని నిండా ముంచి ,ప్రభుత్వ ఉద్యోగులకు జీతభత్యాలు ఇవ్వలేని రిటైర్ అయిన ఉద్యోగులకు పెన్షన్లు ఇవ్వలేని పరిస్థితికి తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొచ్చారు.
1948 నుండి 2014 వరకు 16 మంది ముఖ్యమంత్రిలు కలిసి పరిపాలన చేస్తే వారందరూ కలిసి చేసిన అప్పు 70 వేల కోట్లు.కానీ కెసిఆర్ కల్వకుంట్ల కుటుంబం తొమ్మిదిన్నర ఏళ్లలో చేసిన అప్పు ఏడున్నర లక్షల కోట్ల రూపాయలు . ఆనాడు నెలకు 500 కోట్ల రూపాయలు కడితే సరిపోయేదని , అలాంటిది ఈనాడు నెలకు 7500 కోట్ల రూపాయలు కట్టాల్సిన పరిస్థితికి కేసీఆర్ తీసుకువచ్చాడ”ని మండిపడ్డారు.
ఈరోజు నేను తిన్న తినకపోయిన, పని చేసినా చేయకపోయినా ఆరోగ్యం బాగాలేక ఇంట్లో పండుకున్న అప్పులోడు ఊరుకోడు. చంద్రశేఖర రావు చేసిన అప్పులకు ఆయన చేసిన తప్పులకు నెలకు 7500 కోట్లు అంటే సంవత్సరానికి 80 నుంచి 90 వేల కోట్ల రూపాయలు ఆసలు ,వడ్డీ కలిపి కట్టాల్సిందే.10 ఏళ్లలో కేసీఆర్ సాధించిన విజయమే ఏదైనా ఉంది అంటే అది 70 వేల కోట్ల రూపాయల ఉన్న అప్పుని 8 లక్షల పదకొండు వేల కోట్ల రూపాయలకే తీసుకెళ్లడమే అంటూ మూసారాంబాద్ వంతెన ప్రారంభోత్సవంలో మండిపడ్డారు సీఎం రేవంత్ !