E-Paper
Advertisement

Charging Tips: ల్యాప్‌టాప్‌‌‌ నుంచి ఫోన్‌కు ఛార్జింగ్ పెడుతున్నారా? అయితే మీ ఫోన్ పని గోవిందా.. ఎందుకంటే?

Charging Tips: ల్యాప్‌టాప్‌‌‌ నుంచి ఫోన్‌కు ఛార్జింగ్ పెడుతున్నారా? అయితే మీ ఫోన్ పని గోవిందా.. ఎందుకంటే?
Advertisement

Charging Tips: స్మార్ట్‌ఫోన్ అనేది మనిషి జీవితంలో ఎంతలా భాగమైపోయిందంటే.. ఓ పూట భోజనం మానేస్తారేమో గానీ, చేతిలో ఫోన్ లేకపోతే మాత్రం అస్సలు ఉండలేరు. రోజంతా ఏదో ఒకటి స్క్రోల్ చేస్తూనే ఉండటం మనకు అలవాటైపోయింది. ఈ క్రమంలో బ్యాటరీ కొంచెం తగ్గినా చాలు.. ఎక్కడ స్విచ్ ఆఫ్ అయిపోతుందో అని తెగ కంగారు పడిపోతుంటాం. అయితే కొన్నిసార్లు ఒరిజినల్ ఛార్జర్ అందుబాటులో లేకపోయినా లేదా ప్లగ్ పాయింట్ దూరంగా ఉన్నా.. చాలామంది చేసే పని ల్యాప్‌టాప్‌కు కేబుల్ తగిలించి ఫోన్ ఛార్జ్ చేయడం.

ల్యాప్‌టాప్‌కు ఫోన్‌ను కనెక్ట్ చేయడం ఈజీ అనిపించవచ్చు. కానీ, ఇలా చేయడం వల్ల ఫోన్ బ్యాటరీ మెల్లగా పాడవుతుందని చెబుతున్నారు టెక్ నిపుణులు. మన ఫోన్ బ్యాటరీకి ఒక పద్ధతిలో వోల్టేజ్, కరెంట్ అందాలి. ఫోన్‌తో పాటు వచ్చే ఛార్జర్ సరిగ్గా దానికి తగ్గట్టే తయారవుతుంది. కానీ ల్యాప్‌టాప్ ఇచ్చే పవర్ అవుట్‌పుట్ వేరుగా ఉంటుంది. దీంతో ఫోన్ బ్యాటరీ సామర్థ్యం దెబ్బతిని, త్వరగా పాడైపోయే ప్రమాదం ఉంది.

స్లో ఛార్జింగ్‌తో నష్టమే:

Advertisement

ల్యాప్‌టాప్ ద్వారా ఛార్జ్ చేసినప్పుడు మొబైల్ చాలా నెమ్మదిగా ఛార్జ్ అవుతుంది. దీనివల్ల ఫోన్ ఎక్కువ సేపు ప్లగ్‌లోనే ఉంటుంది. ఇలా ఎక్కువసేపు కనెక్ట్ అయి ఉండటం వల్ల మొబైల్ త్వరగా వేడెక్కుతుంది. అధిక వేడి వల్ల బ్యాటరీ మాత్రమే కాకుండా ఫోన్ లోపల ఉండే సెన్సిటివ్ విడిభాగాలు కూడా దెబ్బతింటాయి. ఒక్కోసారి కేవలం బ్యాటరీ శాతం పెరగడం మాత్రమే కనిపిస్తుంది కానీ, పనితీరులో ఎలాంటి మార్పు ఉండదు. ఈ అలవాటు వల్ల బ్యాటరీ లైఫ్ పూర్తిగా తగ్గిపోయి మీ ఫోన్ డెడ్ అయ్యే ప్రమాదం కూడా ఉంది.

Also Read: మీరు వాడిపడేసిన పాత ఫోన్‌నే CCTV Cameraగా మార్చేయొచ్చు.. అదెలాగంటే?

బ్యాటరీ లైఫ్ పెరగాలంటే..

Advertisement

⇒ లక్షల రూపాయలు పెట్టి కొన్న ఖరీదైన ఫోన్ ఎక్కువ కాలం మన్నాలంటే ఎప్పుడూ కంపెనీ ఇచ్చిన ఒరిజినల్ ఛార్జర్‌నే వాడాలి.

⇒ లోకల్ లేదా నాణ్యత లేని ఛార్జర్ల జోలికి వెళ్లకపోవడమే మంచిది. లేదంటే బ్యాటరీ త్వరగా పాడైపోతుంది.

⇒ బ్యాటరీని ఎప్పుడూ 20% కంటే తగ్గకుండా, 80% కంటే దాటకుండా ఛార్జ్ చేయడం వల్ల బ్యాటరీ లైఫ్ బాగుంటుంది.

⇒ మీ ఫోన్ ఛార్జర్‌ను అందరికీ ఇచ్చి వాడటం వల్ల కేబుల్స్, అడాప్టర్ దెబ్బతినే అవకాశం ఉంటుంది.

⇒ బ్యాటరీ తక్కువగా ఉన్నప్పుడు పవర్ సేవింగ్ మోడ్‌ను ఆన్ చేసుకోవడం మర్చిపోవద్దు.

⇒ ఫోన్ సాఫ్ట్‌వేర్‌ను ఎప్పటికప్పుడు అప్‌డేట్ చేస్తుండాలి. ఎందుకంటే.. కొత్త అప్‌డేట్స్‌లో బ్యాటరీ ఆప్టిమైజేషన్ ఫీచర్లు ఉంటాయి.

Also Read: బడ్జెట్ ధరే కానీ ఫీచర్లు మాత్రం నెక్ట్స్ లెవల్.. త్వరలో లాంచ్ కానున్న టాప్-5 ల్యాప్‌టాప్స్!

Related News

ఐఫోన్ యూజర్లకు మెటా బిగ్ ఆఫర్.. ఐక్లౌడ్ లేకున్నా వాట్సప్ చాట్ బ్యాకప్ ఇక ఈజీ!

ఆకాశం నీలం, సూర్యాస్తమయం ఎరుపు.. అంతరిక్షం నలుపు.. అసలేంటీ రంగుల మిస్టరీ?

జస్ట్.. రూ.3,000 లోపే 45 రోజుల బ్యాటరీ బ్యాకప్.. ఐఫోన్ కంటే పవర్‌ఫుల్ టార్చ్‌తో Nokia 4G ఫోన్!

8,100mAh బ్యాటరీ, AI బటన్‌తో హానర్ నుంచి క్రేజీ ఫోన్.. ధరెంతో తెలిస్తే Buy Now నొక్కేస్తారు!

జియో, విఐ బెటర్ అంటున్న యూజర్లు.. ఎయిర్‌టెల్ 5G హాట్‌స్పాట్ బ్యాన్‌పై సోషల్ మీడియాలో ఆగ్రహం!

స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ ప్రాసెసర్, భారీ బ్యాటరీ.. గేమర్స్ కోసం నెక్ట్స్ లెవెల్ టాబ్లెట్ వచ్చేసింది!

కెమెరా పక్కనే మరో డిస్‌ప్లే.. ఇన్ఫినిక్స్ కొత్త బడ్జెట్ ఫోన్ లుక్ చూశారా?

రెడ్‌మీ నోట్ 17కు రీబ్రాండెడ్‌గా Poco X8, M8 పవర్.. ఫీచర్లు, ధరల వివరాలు ఇవే!

Big Stories

Advertisement
×